| బాల సాహిత్యము | బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి | వానవల్లప్పలు |

వానవల్లప్పలు
(వల్లప్పా! వల్లప్పా! వాన కురుస్తున్న దంటుంది చెల్లెలు. బయటకుపోక చెల్లెలును వాకిట్లోనే ఆడుకోమంటాడు వల్లప్ప. వానలో తిరిగితే కొండమీదినుండి (ఆకాశం నుండి) గుండురాళ్లు (వడగళ్లు) పడి కొక్కిరాయి (అల్లరి పిల్లవాడు) కాలు విరిగింది - కాబట్టి వానలోకి పోవద్దని వల్లప్ప అంటే, కాలు విరిగితే మందు ఏమిటని చెల్లెలు అడుగుతుంది.)
(వేపాకు, పసుపు, వెల్లుల్లిపాయ నూనెలో మడ్డి - ఇవన్నీ కలిపి, నూటొక్క సారిపిండి (ఆవర్తితతైలము) ఆ తైలమును పూట కొకసారి విరిగిన కాలుకు రాస్తే, కూడు కొంటుందంటాడు వల్లప్ప.)
|
వానా వానా వల్లప్ప! వాకిలి తిరుగూ చెల్లప్ప! కొండమీది గుండురాయి కొక్కిరాయి కాలువిరిగె దానికేమి మందు? వేపాకు పసుపూ, వెల్లుల్లిపాయ, నూనె లోమడ్డి (నూనెమ్మ బొట్టు,) నూటొక్కసారి, పూయవోయి నూరి, పూటకొక్కతూరి. |