| బాల సాహిత్యము | బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి | నేతిలో నేరేడుపండు |

| నేతిలో నేరేడుపండు |
చిట్లపొట్లకాయ సీమనెల్లికాయ గోడపుచ్చకాయ గొబ్బినెల్లికాయ అత్తకు పెడితే అల్లం నే తింటే బెల్లం కొత్తకుండల్లోని గోధుమల్లారా! పాలపిడతల్లోని పసిబిడ్డలార! అమ్మ అమ్మ, నీ బిడ్డపేరేమంటే, నీళ్లల్లో నిమ్మపండు, పాలల్లో పనసపండు, నేతిలో నేరేడుపండు. |