| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 32. లాలి పాట |
|
లాలీ లాలమ్మా లాలీ లాలమ్మ లాలీ లాలమ్మ లాలీ లాలమ్మ గుఱ్ఱాలు లంకల్లో మేసే - లంకల్లో మేసే బుల్లెమ్మ గుఱ్ఱాలూ బీడుల్లో మేసే - బీడుల్లో మేసే అప్పన్న గుఱ్ఱాలూ అడవుల్లో మేసే - అడవుల్లో మేసే ఊరుకో అబ్బాయి వెఱ్ఱీ అబ్బాయీ - వెఱ్ఱీ అబ్బాయీ ఉగ్గెట్టు మీయమ్మ ఊరు కెళ్ళిందీ - ఊరు కెళ్ళిందీ పాలిచ్చు మీయమ్మ పట్టా మెళ్లిందీ - పట్టా మెళ్లిందీ నీలోసె మీయమ్మ నీల కెల్లిందీ - నీల కెల్లిందీ |