| ఇతిహాసములు | మొల్ల రామాయణము | అవతారిక |
| రామ కథా సుధా మాధురి | ||
| క. |
ఆది రఘురాము చరితము నాదరముగ విన్నఁ గ్రొత్తయై, లక్షణ సం పాదమ్మై, పుణ్య స్థితి వేదమ్మై తోఁచకున్న వెఱ్ఱినె చెప్పన్? |
20 |
| ఉ. |
రాజిత కీర్తియైన రఘురాము చరిత్రము మున్ గవీశ్వరుల్ తేజ మెలర్పఁ జెప్పి రని తెల్సియుఁ గ్రమ్మఱఁ జెప్పనే లనన్ భూజన కల్పకం బనుచు, భుక్తికి ముక్తికి మూల మంచు, నా రాజును దైవమైన రఘురాము నుతించినఁ దప్పు గల్గునే? |
21 |
| క. |
వారాంగన శ్రీరాముని పేరిడి రాచిలుకఁ బిలిచి పెంపు వహించెన్ నేరుపు గల చందంబున నా రాముని వినుతి సేయ నర్హము గాదే? |
22 |
| క. |
నేరిచి పొగడినవారిని, నేరక కొనియాడువారి నిజ కృప మనుపం గారణ మగుటకు భక్తియె గారణ మగుఁ గాని చదువు కారణ మగునే? |
23 |
| ఉ. |
సల్లలిత ప్రతాప గుణ సాగరుఁడై విలసిల్లి, ధాత్రిపై బల్లిదుఁ డైన రామ నరపాలకునిన్ స్తుతి సేయు జిహ్వకున్ జిల్లర రాజ లోకమును జేకొని మెచ్చఁగ నిచ్చ పుట్టునే? యల్లము బెల్లముం దినుచు నప్పటి కప్పటి కాస సేయునే? |
24 |
| |