| కీర్తనలు | శ్యామా శాస్త్రి | కామాక్షి అనుదినము (స్వరజతి) |
| భైరవి - మిశ్ర చాపు |
| పల్లవి: |
| కామాక్షి అనుదినము మరవకనే నీ పాదముల దిక్కనుచు నమ్మితిని శ్రీ కంచి॥ |
| స్వరము(లు): |
| కుందరదనా కువలయనయనా తల్లి రక్షించు॥ |
| కంబుగళ నీరదచికురా విధువదనా మాయమ్మ॥ |
| కుంభకుచ మదమత్తగజగమ పద్మభవ హరి శంభు నుతపద శంకరీ నీవు నా చింతల వేవేగ దీర్చమ్మా వినమ్మ॥ |
| భక్తజన కల్పలతికా కరుణాలయా సదయా గిరితనయ కావవే శరణాగతుడుగద తామసము సేయక వరమొసగు॥ |
| పాతకములను దీర్చి నీ పద భక్తి సంతతమీయవే పావనిగదా మొరవినదా పరాకేలనమ్మా వినమ్మ॥ |
| కలుషహారిణి సదా నతఫలదాయకి యని బిరుదు భువి లో గలిగిన దొరయనుచు వేదము మొరలిడగ విని॥ |
| నీ పవన నిలయా సురసముదయా కరవిధృత కువలయా మద దనుజ వారణమృగేంద్రార్చిత కలుషదమనఘనా అప రిమితవైభవము గల నీ స్మరణ మదిలో దలచిన జనాదులకు బహు సంపదలనిచ్చేవిపుడు మాకభయమియ్యవే॥ |
| శ్యామకృష్ణ సహోదరీ శివశంకరీ పరమేశ్వరి హరిహరాదులకు నీ మహిమలు గణింప తరమా సుతు డమ్మా అభిమానము లేదా నాపై దేవీ పరాకేలనే బ్రోవవే ఇపుడు శ్రీ భైరవి॥ |