| కీర్తనలు | శ్యామా శాస్త్రి | దురుసుగా కృపజూచి సంతత |
| సావేరి - ఆది |
| పల్లవి: |
| దురుసుగా కృపజూచి సంతత మరోగ దృఢ శరీరముగ సలుపు నను॥ |
| అను పల్లవి: |
| పరమ పావని కృపావని వినుత పదసరోజ ప్రణతార్తిహరు రాణి పరాకు ధర్మసంవర్ధని బహు పరాకమలగుణా త్రిపురసుందరి॥ |
| చరణము(లు): |
| నీ సన్నిధినిజేరి గొలిచిన నిన్నెపుడు దలచెడు సుజన దాసజన భాగ్యమెటు దెలుపుదునో ఓ సకలపాపశమనీ విను ఓంకారి, నియతి యెటులనో? నీసాటెవరే జగంబులను నే నిరతము నిను గొలిచితి॥ |
| ఏమో కలకచెంది మనమున నే నెచ్చట గతి గానకను నీ మహిమలెల్ల చెవులారగ విని ఈ మనసులోని వెత దీర్చుట కీ వేళ బహు నిపుణవని కామాక్షీ నీవే వేరెవరు కాదని దలచి గొలిచితిని॥ |
| ధారాధర వినీలకచలసితా సరస కవితా నిచితా సారఘనసార సిత దరహసితా వారిరుహవారి వదనోచితా వాగీశ వినుతా భృతనతా నారాయణి శ్యామకృష్ణ వినుతా నా మనవిని విను గిరిసుతా॥ |
| స్వరము(లు): |
| సరోజనయన నతజనపాలినివని వేదములు మొఱలిడగా నితరులెవరు మనవి విను కృపసలుప పరాకు సలుపరాదిక నీవిపుడు॥ |