కీర్తనలు అన్నమాచార్య నారాయణ తే నమో నమో

అధ్యాత్మ సంకీర్తన - నిడు రేకు 49 - సంపుటము 4a కీర్తన 32

పాడి
పల్లవి:
నారాయణ తే నమో నమో
నారద సన్నుత నమో నమో
చరణములు:
మురహర భవహర ముకుంద మాధవ
గరుడ గమన పంకజనాభ
పరమపురుష భవబంధ విమోచన
నరమృగశరీర నమో నమో
జలధిశయన రవిచంద్రవిలోచన
జలరుహభవనుత చరణయుగ
బలిబంధన గోపవధూవల్లభ
నలినోదర తే నమో నమో
ఆదిదేవ సకలాగమపూజిత
యాదవకుల మోహనరూప
వేదోద్ధర శ్రీవేంకటనాయక
నాదప్రియ తే నమో నమో
AndhraBharati AMdhra bhArati - tALLapAka annamAchArya kIrtanalu - nArAyaNa tE namO namO - Tallapaka Annamacharya - annamayya peda tirumalacharya chinna china tirumalacharya Lyrics of annamayya kIrtanalu saMkIrtanalu ( telugu andhra )