| కీర్తనలు | భద్రాచల రామదాసు | చరణములే నమ్మితి నీదివ్యచరణములే నమ్మితి చ.. |
| కాపీ - ఆది |
| పల్లవి: |
| చరణములే నమ్మితి నీదివ్యచరణములే నమ్మితి చ.. |
| చరణము(లు): |
| వారధిగట్టిన వరభద్రాచల వరదా వరదా వరదా నీదివ్య చ.. |
| ఆదిశేష నన్నరమర చేయకు మయ్యా అయ్యా అయ్యా నీదివ్య చ.. |
| వనమున రాతిని వనితగ చేసిన చరణం చరణం చరణం నీదివ్య చ.. |
| పాదారవిందమే యాధారమని నేను పట్టితి పట్టితి పట్టితి నీదివ్య చ.. |
| వెయ్యారు విధముల కుయ్యాలించిన అయ్యా అయ్యా అయ్యా నీదివ్య చ.. |
| బాగుగ నన్నేలు భద్రాచల రామదాసుడ దాసుడ దాసుడ నీ దివ్య చ.. |