| కీర్తనలు | భద్రాచల రామదాసు | పలుకే బంగారమాయెనా |
| ఆనందభైరవి - రూపక |
| పల్లవి: |
| పలుకే బంగారమాయెనా కోదండపాణి ప.. |
| చరణము(లు): |
| పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి కలలో నీనామ స్మరణ మరువ చక్కని తండ్రి ప.. |
| ఇరువుగ నిసుకలోన బొరలిన యుడుత భక్తికి కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి ప.. |
| రాతి నాతిగజేసి భూతలమందున ప్ర ఖ్యాతిజెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి ప.. |
| ఎంతవేడినను నీకు సుంతైన దయరాదు పంతముచేయ నేనెంతటివాడను తండ్రి ప.. |
| శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గావా కరుణించు భద్రాచల వరరామ దాసపోష ప.. |