| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 96. ఉయ్యాలా |
|
ఓయి బామలాల ఉయ్యాలా బామలందూనా ఉయ్యాలా రాజమా రాజు ఉయ్యాలా పట్టపురాజు ఉయ్యాలా పట్టపూ రాజుకే ఉయ్యాలా ఏడ్గూరు కొడుకులు ఉయ్యాలా ఆర్గూరు కొడుకులకు ఉయ్యాలా కళ్యాణ మయినాది ఉయ్యాలా కడసారపు కొడుక్కు ఉయ్యాలా కళ్యాణమవలేదు ఉయ్యాలా కంది ముఖమూతో ఉయ్యాలా కచేరి కెల్తున్నాడు ఉయ్యాలా కచేరి పెద్దలూ ఉయ్యాలా ఆడేటి మాటలూ ఉయ్యాలా చి... ఛి... ఛి... రాజా ఉయ్యాలా సిగ్గేలేదా ఉయ్యాలా పెద్దవాడు రాజు ఉయ్యాలా పెళ్ళేలేదా ఓయి ఉయ్యాలా |