| ఇతిహాసములు | రంగనాథరామాయణము | అయోధ్యాకాండము |
|
రాముఁడా దశరథరాజు నీక్షించి యా మహితాత్ముతో నచలుఁడై పలికెఁ: “బదునాలుగేఁడులుఁబ్రకటదుర్గములఁ బదునాల్గుదినములపగిది వర్తించి ధరణీశ!వత్తు; సంతాపింపవలదు. భరతుండు నా కంటె భక్తుండు నీకు; నతనిఁబట్టముగట్టు; మాత్మఁ గైకేయి కృతకంబునకు మదిఁ గింకిరిపడకు. మా తల్లి నీకు నెమ్మది సేవసేయు; నా తన్వి మీరును నరయుఁడు కరుణ.” నని ప్రదక్షిణముగా ననుజుండుఁదాను జనకజయును వచ్చి చాగిలిమ్రొక్క:[వా.రా. సర్గ 40, 41] “నడవికిఁబోయి మీ రరుగుదెం.”డనుచుఁ గొడుకులఁగోడలిఁ గోర్కి దీవించె. నా సమయంబున నర్థి మువ్వురును గౌసల్య పాదపంకజముల కెఱఁగ వెలఁది రాఘవుఁడున్న వేషంబుఁజూచి పలుమాఱు 234విధిఁదూఱి పలవించి పిదప |