| ఇతిహాసములు | రంగనాథరామాయణము | అయోధ్యాకాండము |
|
ఘనుని రాఘవుని లక్ష్మణుని దీవించి జనకజఁ జూచి కౌసల్య శోకించి: “యడుగక యితఁడు మహాచక్రవర్తి కొడుకని మీ తండ్రి కోరి నిన్నిచ్చెఁ; 235గడవనిదైవయోగంబునఁ జేసి కడపట మఱి యిట్టిగతి యయ్యె236నేఁడు. తాపసవృత్తిమైఁ దగిలి కానలకు నీ పతితోఁ గూడి నీ కేఁగవలసె దీనికి వగవకు; తివిఱి శ్రీరాముఁ డీ నిఖిలోర్వియు నేలెడి మగుడఁ. బతి పేదవాఁడైనఁ బాయంగరాదు సతులకు; నిదియ విచారింపఁదగవు. చేకొని పతిపంపు సేయు పత్నులకుఁ గైకొను నుభయలోకములందు237 సుఖము.” నన విని కౌసల్య నా సీత సూచి వినుతంబుగాఁబల్కె వినయంబు మెఱసి: “యనుకూలనై పతి నతిభక్తిఁగొలిచి తనర వర్తించెద ధర్మమార్గమున. మానుగాఁబతిఁ238బాయుమగువ సక్రంబు లేని తేరును, దంత్రిలేని వీణయును బోలెఁ బుత్త్రులు గల పుణ్యురాలైనఁ జాలంగఁగొఱగాక చను; నట్లుగాన, పతికిఁబ్రియంబైనఁబ్రాణంబులైన హితబుద్ధి వంచింప కిత్తునే.”ననిన నా దేవి వైదేహి నలరారఁజూచి: “భూదేవి పుత్త్రివై పుట్టిన నీకు నీ గుణంబులు దగు. నెలమి లక్ష్మణుని నీ గుణోజ్జ్వలు రామహితుని మన్నింపు.” మనిన సీతాదేవి“యౌగాఁక.”యనుచుఁ దనకు మ్రొక్కిన నెత్తి తగఁగౌఁగిలించి దీవించె. నప్పుడు దెఱఁగొప్ప రామ దేవుండు గౌసల్య దీవనల్ వడసి |