ఇతిహాసములు రంగనాథరామాయణము అయోధ్యాకాండము
రామాదులు సుమిత్రను దర్శించుట
వచ్చి సుమిత్రకు వలగొని భక్తి
చెచ్చెరఁగార్యమ్ము సెప్పి మ్రొక్కుటయు
శ్రీరాము దీవించి సీత దీవించి
ధారుణీపతి239మాట దలపోసి వగచి
మెలుపొంద240నపుడు సుమిత్ర లక్ష్మణునిఁ
బిలిచి యింపలర గభీరోక్తిఁ బలికె:
“రాముని దశరథరాజుగాఁజూడు;
భూమిజ నన్నుఁగా బుద్ధిఁజింతింపు;
మడవి యయోధ్యగా నాత్మలోఁ దలఁపు;
కడుభక్తియుక్తి రాఘవుఁ గొల్చియుండు;
మాయతజయసిద్ధు లభివృద్ధిఁబొందుఁ;
బోయిర.”మ్మని ప్రీతిఁ బుత్త్రు దీవించి
రామచంద్రునిఁజూచి: “రఘువీర! నీకు
సేమంబు 241దలఁచి నీ చిత్తంబులోన
నఱలేనిసఖుఁడన్న ననుజన్ముఁడన్న
నెఱయ242నీతఁడె కాక నిక్కువం బరయ.
నటుగాన లక్ష్మణునరసి రక్షింపు
మటవులలో.”నన్న“నౌఁగాక.”యనుచుఁ
గృతకృత్యుఁడై యంత గృహదేవతలకుఁ
జతురుఁడై మునులకు జననుల కెఱఁగి
ధరణిజఁదోడ్కొని తాను లక్ష్మణుఁడు
శరచాపతూణీర సహితుఁడై వెడలె.

  1. ↑సేఁత
  2. ↑పిదప
  3. ↑దలఁచిన
  4. ↑భృత్యుఁడు నీకు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )