| ఇతిహాసములు | రంగనాథరామాయణము | అయోధ్యాకాండము |
|
వని దూఱుకౌసల్య నధిపతి సూచి తనపూర్వకథయెల్లఁదాఁ జెప్పఁదొణఁగె: “నీవు సెప్పిన323వెల్ల నిజము,324కౌసల్య! భావింప నే నట్టిపాపకర్ముండ. నొడలఁబ్రాణములింక నుండవు నాకుఁ గడుబెట్టిదములాడి కారింపవలదు. కౌసల్య! నా తొంటికర్మఫలంబు లోనరించిన 325నేల యూరకపోవు? దైవంబునకునైనఁ దన కర్మఫలము భావించి కుడువక పాయరాదెందు. ‘నదియెట్టి’దంటేని నది326చెప్పఁజోద్య; మది దెల్లమిగ విను.”మనిచెప్పఁదొడఁగె: “నాఁడెల్ల నేలెడు నా పిన్నదనము నాఁడొక్కనాఁ డేను నడురేయిఁబోయి యరుదైనవేఁటల నాసక్తిఁ327దగిలి శరచాపములు వూని సరయువుపొంత ఱేసి చూడఁగరానిఱేవు చక్కటికి డాసినపొదలలో డాఁగి యే నుండ నఱిముఱి మృగకోటులయ్యేటినీరు పఱతెంచి 328త్రావుశబ్దములచక్కటికి వీనుల దృష్టించి వెస శబ్ద329వేధు లైన బాణములేసి యందంద 330చంపి తనియక కాపున్న తఱి యజ్ఞదత్తుఁ డనునొక్క మునిపుత్త్రుఁ డమ్మహానదికి దీమమై విధి దన్నుఁ దెచ్చిన వచ్చి కామించి యయ్యేటఁగలశంబు ముంపఁ గుదియక వెస331మ్రోయుగుటగుట332ధ్వనికి నది మత్తగజమని యడరి యేయుటయు నా తీవ్రతరబాణ మదరంటఁగొన్న “హా తాత! హామాత!”యను నార్తరవము పొరిఁబొరి నా మర్మములుగాఁడి పాఱ వరమునిసుతుఁడిల వ్రాలి యిట్లనియెఁ: “గ్రమమొప్ప నడవులఁగందమూలములు నమలుచుఁదపసినై ననుఁగన్నగురులఁ గొలిచి యేరికిఁగీడు గోరని నాకుఁ గలిగెనే నేఁడిట్టి కష్టంపుఁ జావు? ఎట్టి పాపాత్ములు నీ 333రాత్రులందు నెట్టన చంపరు నెఱసి జంతువులఁ; బగళుల రతికేళిఁబాయక 334మెలఁగు మృగములఁజంప; రిమ్మెయి నోటలేక యెవ్వఁడొకో నన్ను నీ నడురేయిఁ గ్రొవ్వాఁడిశరమునఁగూల్చినవాఁడు? వాఁడేమిగతిఁబోవువాఁడొకో! యింక వాఁడేమిసేయును? వగవ నా మృతికి: నక్కటా! వృద్ధులై యంధులై తమకు దిక్కెవ్వరును లేక దీనులై యున్న తల్లిదండ్రులు నేఁడు దమకైనవగల వెల్లి నే335 తేపల వెడల నీఁదెదరొ? కడుఁబ్రొద్దువోయె;నొక్కఁడుఁబోయి తడసెఁ గొడు?’కని మది నెంతగుందునో తల్లి! ననుఁగన్నతల్లితో నా రామిఁజెప్పి యనుమానపడి యెంతయడలునో తండ్రి! ‘యాటలు మరగి రాఁ’డని చూతురొక్కొ! ‘నీటికందువ లేమి నిలిచె’ నండ్రొక్కొ! యేమని వగతురో యీ చావు విన్న? నేమి గాఁగలవారొ యిటమీఁద వార? 336లెవ్వరీ యుదకంబు లిచ్చెద రింక? నెవ్వరు337ప్రోచెద రిటమీఁద వారిఁ? గడఁగి యీ బాణమొక్కటనె మువ్వురముఁ బడితి; మిం కేమని పలవింతు విధికి!” నని విలాపించుచో నా విలాపములు విని:“యెప్పుడెప్పుడు విరియునో తమము? ఎప్పుడు సూతునో యిమ్మహాపురుషు? నిప్పాటు వాటిల్లెనే నేఁడు 338నాకు?” ననుచుండనుదయించె నంతఁజందురుఁడు వనధితో నా శోకవనధి యుప్పొంగఁ. జందురుఁడుదయింప సరయువు దాటి యం339దుఁదత్తీరంబు340నందేను341వెదకి తన చేతికలశంబు ధరణిపై 342డించి తన చెక్కు గలశమస్తకమునఁజేర్చి యురమున వీపున 343నుడుగక వెడలు నురురక్తధారల నొడలెల్లఁదోఁగి వీడిన జడలతో విశిఖ వేదనల వాడినమోముతో వసుమతి వ్రాలి శరముపదేశమై చనఁజొచ్చి 344యాత్మఁ బరికించి దేహసంబంధంబు లణఁచి యే కర్మములయందు నీడాడనీక కైకొని యింద్రియగతు లుజ్జగించి కడపటియోగంబుఁగని తన్ను మఱచి పడియున్న యోగియై పడియున్నవాని మునికుమారుని జగన్మోహనాకారుఁ గనుఁగొని బాణంబుఁ345గనుగొని346బెదరి యన్నదీజలము లేనప్పుడు తెచ్చి కన్నులు దుడిచి యంగములెల్ల347ఁదడిపి: “యక్కటా! మునినాథ!యడరి నా శరము 348తెక్కలి దాఁకి వధించెనే నిన్ను! నీ నదీజలముల కేలవిచ్చేసి? తే నింక నీ పాపమేమిటఁగడతు?” ననుచుండఁదనకన్ను లల్లన విచ్చి ననుఁజూచి తనుఁజూచి నా భీతిఁజూచి: “నీ వేమిచేయుదు? నీ కేల వగవ? నీ వెవ్వఁడవు నాకు నికృతి గావింప? దైవయోగంబున ధరణీశ! నాకు నీ విధియయ్యె;349నింకేల శోకింప? 350నే నేనుఁగనుబుద్ధి నేసితిగాని పూని నా351యెడఁగోపమున నేయ వీవు. ఏను బ్రాహ్మణుఁడఁగా; నెలమి వైశ్యునకు భూనాథ! శూద్రకుఁబుట్టినవాఁడ. నటుగాన యిది బ్రహ్మహత్యయుఁగాదు; పటుపాప352ఫలము నిన్‌బ్రాపింప లేదు; నరనాథ!353తలఁకకు నా చావుఁజూచి; యరిగి నా గురువుల కంతయుఁజెప్పు. నీవు సెప్పకమున్న నిజయోగదృష్టి భావించి చూచి యేర్పడఁ354గాంచిరేనిఁ గోపించి ననుఁగన్న355గురువులు నిన్ను శాపింప356రఘుకులక్షయము గాఁగలదు. కావున 357వారికిఁ గలశోదకములు వేవేగ కొనిపోయి వినిపింపు దీని. మనుజేశ! యీ యస్త్రమరణంబు నాకు ననుచిత; మీ బాణమల్లనఁబెఱుకు; మీ శరవేదన కే నోర్వఁజాల; నా శరీరమునఁబ్రాణము లుండ వింక.’ ననవుడు నేనప్పుడల్లనఁ జేరి ఘనమైనశోకాగ్నిఁగాలుచు 358ఁగదిసి యమ్ము 359వెఱుకఁ360బూని యటు ముట్టవెఱచి 361క్రమ్మఱఁదెగువమైఁ362గడఁగి కంపించి పనుగొనువగలతో బాణంబు వెఱుక ముని363కుమారుఁడు ప్రాణముల్364వాసె.నంత గలఁగుచు నేను నా కలశంబుతోడ జలములు గొని తదాశ్రమభూమి కరిగి[వా.రా. సర్గ 64] యతివృద్ధులై యంధులై తా రనన్య గతికులై నిజసుతాగమన ముల్లముల నెడపక కోరుచు నెఱకలు విఱిగి పడియున్న పక్షులపగిది నట్లున్న ఘనపుణ్యులగు వారిఁగనుఁగొని చేరఁ జనుదెంచు నా కాలిచప్పు డాలించి “యోపుత్త్ర!365తడవుగానుండుదురయ్య; “మాపట్టిరా;366ఁడేలమసలెనో?”యనుచుఁ దలఁకుచుండితిమి367మీ తల్లియు నేను. నిలుతువె యొకచోట నీ వింతదడవు? తనయ! నీ వెక్కడ368ఁదడసితివయ్య? కనుఁగొనఁగా మాకుఁగన్నులు నీవ. యతివృద్ధుల369గు మాకు నాధారమీవ. గతిలేనిమాకు సద్గతి370 యును నీవ. 371యది యేలపలుక?372వేమంటిమి నిన్ను? నుదకముల్ దెమ్మంటి మో కుమారకుఁడ! యని పల్కు మునిపల్కు లంతరంగమునఁ బెనఁగొనుశోకంబు భీతియుఁబెనుపఁ 373జె374ప్పెదనని వచ్చి చెప్ప375రాకుండి చెప్పకపోదని చెప్ప నూహించి, చలియించి గద్గదస్వరమున వెడలు పలుకులు దడఁబాటు పడఁగ నిట్లంటిఁ “దాపసోత్తమ! యేను దశరథమేది నీ పాలకుఁడఁగాని నీ పట్టిఁగాను. నీచకర్ములు విన్న376నిందించునట్టి నీచకర్మము నాకు నేఁడు సిద్ధించె. నే యుగంబులయందు నెవ్వఁడేనియును జేయనిపాపంబు సేసి మీకడకు వచ్చితి; నేమని వాక్రువ్వనేర్తుఁ? దెచ్చె నన్ దైవ మీతెంపు సేయుటకు. సరయువుపొంత నిశావేళ వేఁటఁ దిరుగుచు మృగము లే తెంచు 377చక్కటికి 378వీనుల దృష్టించి వెస శబ్దవేధు లైన బాణములేసి యందంద చంప నీరుకందువనుండి నీ కుమారుండు నీరు ముంపఁగఁగుంభనినద మాలించి యేనుఁగన్‌తలఁపున నేసితి; 379నెఱుఁగ; నానతి నాకేమి యనఘ? మీ తనయు ప్రాణముల్గొనియె నా పటుబాణ.”మనినఁ బ్రాణముల్ జల్లనఁబడి మూర్ఛవోయె. నా ముని;పత్నియు“హా పుత్త్ర!”యనుచు భూమిపైఁబడి రిత్తబొందియట్లున్న, నప్పుడే నడలుచు నల్లనఁ దెలుపఁ దెప్పిరి వారు నా దెస మోము లెత్తి: “యేలయ్య, దశరథ! యేముశోకాగ్నిఁ గాల మా తనయు380ఁదెక్కలి381దాఁచితీవు? అడవులఁదపసులై యంధులై యున్న బడుగులఁజంపి పాపముఁగట్టుకొంటి? వడరి నీ దగుబాణమదరంటఁగొన్నఁ బడునప్పుడేమనిపలికెనో కొడుకు? పాయనివేదనఁ బ్రాణముల్ విడిచి పోయెనో; విడువక పొరలుచున్నాఁడొ? మృతికైన నొండునిమిత్తంబు లేదె? యతిసుతండట బాణమట చంప విధియె! పుడమి వానప్రస్థుఁబొలియించెనేనిఁ జెడు నింద్రుఁడైనను జెడఁడె భూవిభుఁడు. అవనీశ! మా పుత్త్రు నజ్ఞానబుద్ధిఁ దవిలి382యేసితిగాన దగదు383 మా కలుగ. మా384కుఱ్ఱఁజూడక మముఁగొని కాలు శోకాగ్నులాఱవు; చూపవే వాని.” ననియని శోకించు నత్తపోధనులఁ గొనిపోయి“వీఁడె మీ కొడు;”కనుటయును: “వేఁడి దయోదారవిమలమానసుఁడు? వేఁడి తపోధన విపులపుణ్యుండు? వేఁడి సుధీజన వినుతవర్తనుఁడు? వేఁడి నిరంతర వేదతత్పరుఁడు?” ననుచుఁజేతులు సాచి యందంద385తడవి తనయునిపైఁబడి తల్లి శోకించి తొడలపై నునిచి నెత్తుటఁ దోఁగియున్న జడలతోఁదలఁజేర్చి సంతాపమంది: “యో విమలాత్మక! యోయజ్ఞదత్త! యో విశ్రుతాచార! యో ధర్మ386నిరత! యెందు మాతోడ నీ విటు సెప్పికాని 387యెందునుఁ బోవు నీ. విదియేమి నేఁడు? నాకలోకమునకు 388న్నతిఁబోవుచుండి నాకేల 389చెప్పవు? నా వంశతిలక! 390కడవఁజేసితిఁ; బాపకర్మురాలైతి. నడురేయి నిన్నేల నదికిఁబొమ్మంటి? నేచిన గురుభక్తి నెల్లలోకముల 391ఱాచినకొడుకు నాఱడిఁజంపుకొంటి. నా కేటితపమింక? నాకు నీతోడి లోకంబె గతియగు లోకైకవినుత! ఎక్కడి ప్రాణంబు? లెక్కడి బాణ; మెక్కడి దశరథుం? డెక్కడి నీవు? ఇన్నియు నొడఁగూర్పనిటు 392నేర్పుగలిగి 393నిన్నుఁద్రెక్కొనియెనే నీ కర్మఫలము?” అని తల్లి శోకింప నమ్మునీశ్వరుఁడు తనయునిపైఁబడి తద్ద394యు వగచి: “నీవు నా కడ కతినిష్ఠతో వచ్చి కావింతు ప్రీతి సత్కారముల్ దొల్లి; యేను నీ కడ కిప్పు395డే తెంచియుండ నే నెయ్యములు సేయ; 396విటు నీకుఁదగునె? కొడుక! నీ నిర్మలగుణకలాపములు వెడలెనే యీ బాణవివరంబునందు? నెవ్వరిఁజదివింతు నింక వేదములు? ఎవ్వరిఁజదివింతు నింక శాస్త్రములు? ఎవ్వరి397వినిపింతు నింక ధర్మములు? ఎవ్వరి కెఱిఁగింతు నింకఁగావ్యములు? 398ఫలమూల399జలములు పరగంగఁదెచ్చి యలయకుండఁగ నెవ్వ రరసి పెట్టెదరు? దీర్ఘాయువని నిన్ను దీవింతుఁ గాని నిర్ఘాత పటుబాణ నిహతి వల్కితినె? జమునైనఁబుత్త్రభిక్షము వేఁడుకొనెదఁ 400గొమర! నన్నచటికిఁగొనిపోఁగదయ్య. 401పనివడి యెందును బరలోకవిధులు దనయు402లొనర్తురు తల్లిదండ్రులకుఁ; బరిపాటి దప్పించి పరలోకవిధులు మరలించి విధి నీకు మముఁజేయఁబనిచె. నీ కలదినముల నిష్ఠ వెంపారఁ జేకొని మమ్ము రక్షించితి వీవు. నీయట్టి కొడుకును నిజముగాఁబూని యే యుగంబునఁగందు మేమింక ననఘ! దురితదూరుఁడవు”బంధుర403తపోనిధివి గురుభక్తుఁడవు నీవు గురుభక్తియుతులుఁ బరలోకపరులార్య 404పరులు ధర్మైక పరులును నిజదారపరు 405లాత్మపరులు నన్న దానాది మహాదానపరులుఁ గన్నలోకంబులు గనుము.” నీవనుచుఁ గరమర్థి నగ్నిసంస్కారాదివిధులు దరమిడి చేసిరి తమతనూజునకు. నమరుఁడై యతఁడంత నాకాశవీథి నమర విమానంబునందుండి పలికె: “నో గురులార! యే నుత్తమలోక భోగభాగ్యుఁడ నైతిఁ, బుణ్యుఁడనైతిఁ, గరమర్థి మిముఁ406గొల్చుకతమున;నాదు మరణంబునకు మీరు మఱుఁగకుఁడింక. నే కాల మే త్రోవ నేది గావలయు నా కాల మా త్రోవ నది గాకపోవ. దయ్యెడు కార్యంబు లగుఁగాక మాన వయ్య! మీరితనిపై నలుఁగకుఁ.”డనుచు ననిమిషపురి కేఁగ నతఁ; డంత వారుఁ దనయునిపైఁగూర్మిఁదరియింపలేక: “పోయెద మేమిదె పుత్త్రశోకమున; మాయట్ల నీవును మరణంబు నొందు.” మని ఘోరమగుశాప మలిగి నా కిచ్చి తనువులు విడిచి రత్తపసులచ్చోట నగ్నిసమానుల కాపుణ్యధనుల కగ్నిసంస్కా407రంబు నట యేను జేసి చేకొన్నవగల వచ్చితిఁ బురంబునకు. నా కర్మఫల మిప్పుడాసన్నమయ్యె. |