ఇతిహాసములు రంగనాథరామాయణము అయోధ్యాకాండము
భరతునిఁ బిలిపించుట
కావున భరతు వేగమ పిలిపింపఁ
గావలయును429 రాచకార్యముల్‌ దీర్ప.
రాజు లేకున్నఁ బురంబు రాష్ట్రంబు
రాజిల్ల;430దెల్లవర్ణంబులు గలయు;
దండనీతిక్రియల్‌ దానధర్మములు
మెం431 డోడి చెడిపోవు; మింతురు432రిపులు;
జారులుఁ జోరులు సందడింపుదురు;
కోరి నొంతురు సాధుకోటి దుర్జనులు;
దొరలు సామంతులు దుర్గాధిపతులు
నరి యప్పనము లీయ.”రని నిశ్చయించి
యలఘుమానసుఁడు జయంతుండు మొదలు
నలువురుమంత్రుల నయమొప్పఁబిలిచి:
“పలువన్నెచీర లాభరణముల్‌ గొనుచుఁ
బొలుచు గిరివ్రజపురికి మీ రేఁగి
యీ వార్త లాతనికేమియుఁ దెలుప
“కా వసిష్ఠుండు రమ్మనె మి.”మ్మటంచుఁ
గడువేగ భరతు నక్కడ నుండనీక
తొడితెండు;పొం.”డనఁదోరంపుఁగడఁక
వారలు హరుల దువాళిగా నెక్కి
సారె నానాపురజనపదంబులును
నదములు నదులుఁగాననములు గిరులు
బొదలుఁబెక్కులు దాటి పొదలినధాటిఁ
గరముఁ433జెన్నొందు కేకయరాజపురికి
నరిగి వారంత నేడవనాఁటిరాత్రి[వా.రా. సర్గ 69]
బలమేది గోమయపంకమధ్యమునఁ
దల విరియఁగఁబోసి తండ్రి గూలుటయు,
జలనిధి శూన్యమై సంపూర్ణచంద్రుఁ
డిలఁగూలుటయుఁ,బట్టపేనుంగుఁగొమ్ము
విఱుగుట మొదలైన విషమంపుఁగలలు
దఱచుగాఁగని లేచి తద్దయు434భీతిఁ
దన యిష్టసఖులతోఁదత్ప్రకారంబు
వినుపించి వగలచే వెత435వడుచున్న
భరతుసన్నిధి కేఁగి ప్రణతులై నిలిచి,
కరమర్థిఁ దమచేతి కానుకలిచ్చి:[వా.రా. సర్గ 70, 71]
“యా వసిష్ఠుఁడు గార్యమక్కడ గల్గి
దేవ! నిన్నట తోడితెమ్మన్నవాఁడు
విచ్చేయు.”మనవుడు విని దూతచేష్ట
లచ్చుగాఁబొడఁగని యతిభీతిఁబొంది
తమ మామకడ కేఁగి తత్ప్రకారంబు
క్రమమొప్పఁజెప్పి సత్కారముల్‌ వడసి
యతఁడంపఁగదలి రథారూఢుఁడగుచుఁ
జతురంగబలములు సచివు లే తేర
నతులితచింత నేడవనాఁడు వచ్చి
యతిరయంబున నయోధ్యాపురి సొచ్చి
పతిలేనిసతి నిశాపతిలేనిరాత్రి
గతి నెంతయును భోగకళలకుఁబాసి
కన్నుల కాపురి కడుఁబాడువాఱి
యున్నచందముఁగాంచి యుల్లంబు గలఁగి;
“యిది యేమివిధమొకో యీ పట్టణంబు
దుదముట్ట శూన్యమై తోచుచున్నదియుఁ
బౌరులు ననుఁజూచి బాష్పముల్‌ దొరుగఁ
దూరుచు దవ్వులఁదొలఁగిపోయెదరు
436అంగళ్ల సకల437సామగ్రి వస్తువులు
పొంగారవేటి438కిఁబురములో?”ననుచు
నగరివాకిట సమున్నతి రథంబు డిగి
439మొగచెడితానుఁదమ్ముఁడు శూన్యమైన[వా.రా. సర్గ 72-74]
యంతఃపురంబున 440కరుదేరఁ గైక
యెంతయుఁబ్రియముతో నెదురుగా వచ్చి
కవుఁగిలించుటయును గరమర్థిఁ గైక
కవిరళతరభక్తి నప్పుడు మ్రొక్కి
యిచ్చమైఁ దమమామ యిచ్చినతొడవు
లిచ్చి వారలసేమ మేర్పడఁ జెప్పి:
“యెంతయు శూన్యమై యిదియేమి నగరు
వింతయైయున్నది విభవంబు441 లెడలి?
రామలక్ష్మణులకు రాజవర్యునకు
సేమమే?”యనవుడుఁజింతించి కైక
భరతునిఁజూచి సంభ్రమము రెట్టింప
దరహాసవదనయై తగవేది పలికెఁ:
“దలకొని తొల్లి మీ తండ్రి నా కర్థి
442వలనొప్పఁగా రెండువరములిచ్చుటయు
“నొకటికి భరతుని నుర్వియేలింపు;
మొకటికి రఘురాము ననుపు దుర్గముల.”
నని వేఁడుటయుఁదండ్రియానతిఁబూని
జనకజాలక్ష్మణసహితుఁడై మునుల
యనువున రఘురాముఁడడవికిఁబోవఁ
దనయుని నెడఁబాసి ధరణీశుఁడీల్గె.
నీసున నీకుఁగా నీ యుపాయంబు
సేసితి; రాజ్యంబుఁజేకొను మింకఁ;
బ్రజలఁబాలింపు; సంపద443లోలి నింపు;
భుజశక్తి నేలుము; బుద్ధి నొండనకు.”
మనవుడు మూర్ఛిల్లి 444యంతన తెలిసి
ఘనకోపదృష్టితోఁ గైకేయిఁజూచి:
“కైక! నా తల్లివై కరుణకుఁ బాసి
యీ కష్టవర్తన మేల కైకొంటి?
మునివేషమున వనమ్మున రాము నుండు
మని పల్కనెట్లు నోరాడెనే తల్లి?
యరయ నిర్మలధర్ములైన రాఘవుల
చరితంబు నీకు విచారింపవలదె?
యే నింక మా తండ్రి కేమని వగతు?
నేను రామునిమొగం బేమని చూతు?
నెంత గందెనొ కదా యిచ్చలో రాముఁ?
డెంత గోపించెనో యేచి లక్ష్మణుఁడు?
యెంత 445దూఱెనొ కాన కేఁగుచో సీత?
యింత కేమయ్యెనో యింతి కౌసల్య?
యంతఃపురాంగన లాసుమిత్రయును
వంతచే నేమని వగచుచున్నారొ?
వీరలకడ కేఁగి విలపింప నాకు
నోరేది? యెట్లు మనోవ్యథ దీర్తు?
నింక నీ పురమేల?యీ భోగమేల?
శంకింప కడవియే శరణంబు నాకు.
ఘనపాప446రతిఁజేసి కడఁగి మీ తల్లి
నిను నొక్కరక్కసునికిఁగననోపుఁ.
గాని కేకయరాజుగన్నకూఁతురవు
కానేర; వేమందుఁ గైక నీ తోడ?”
447ననుమాటలన్నియు నల్లనఁబొంచి
వినుచున్న మంధర వెసఁజూచి సతులు:
“ఇన్ని పాపంబులు నిదియ చేయించె.”
నన్న శత్రుఘ్నుఁడు నా వృద్ధవనిత
గూను డొంకులు దీరఁగ్రుమ్ముడి జాఱ
మేనిసొమ్ములు వీడ మెలఁతలు సూడఁ
గడకాలు వట్టి యాకసమునఁద్రిప్పి
పుడమిపై వైవ నప్పుడు సాలఁగలఁగి
కైకేయి448సతులెల్లఁగను449కనిఁబఱవఁ
గైకేయి వధియింపఁగడఁగి 450వచ్చుటయు
భరతుఁడు సూచి:“యీ పాపాత్మురాలిఁ
బొరిగొని పాపంబుఁబొంద నేమిటికిఁ?
“బెనుపేది తల్లిఁజంపిననీచు.”లనుచు
మనలఁజూడఁగ రోయు మది రామవిభుఁడు.
అటుగాన వల.”దని యతని వారించి
యట వోయి కౌసల్యయడుగుల కెఱఁగి
తానుఁ దమ్ముఁడు శోకదందహ్యమాన
మానసుఁడై పలుమా ఱెలుఁగెత్తి[వా.రా. సర్గ 75]
పలవింప నప్పుడా భరతునిఁజూచి
యలిగి కౌసల్య యిట్లని 451తూఱఁబలికె:
“బతిఁబాసి సుతుఁబాసి బహుళదుఃఖముల
మతి మాకు శోకింప మఱితగుఁగాక!
నీకేల శోకింప452నెలకొని యింత?
నీ కోరినట్లెల్ల నీ తల్లి సేసె.
నన్న! నీవింక రాజ్యము సేయుచుండు.’
మన్నఁ జేతులు మోడ్చి యతఁడు భీతిల్లి
వెనువెన్క కేఁగి యవ్వెలఁది కౌసల్యఁ
గనుఁగొని:“వాక్కాయకర్మచిత్తముల
శ్రీరామునకుఁ గీడు సేసితినేని,
ధారుణి యే నేలఁ దలఁచితినేని,
నేను గైక తలంపు నెఱిఁగితినేని,
నే నొక్కకీడైన నెఱిఁగితినేని,
వినుము మద్యంబు ద్రావినవానిగతికిఁ,
బెనుపేది విప్రుఁజంపినవానిగతికిఁ,
దెగి గురుపత్నిఁబొందిన వానిగతికి,
జగతిపై ననినోడి చనువాని గతికిఁ,
జెనఁటియై పసిఁడి మ్రుచ్చిలువానిగతికిఁ,
జెనసి గోహత్య సేసినవాని గతికిఁ,
న్యాయంబు దప్పిననరపతిగతికి,
నే యెడఁగొండెకాఁడేఁగెడుగతికిఁ,
దల్లిదండ్రులఁ దిట్టుతనయునిగతికిఁ,
గల్లలాడెడు పాపకర్మునిగతికిఁ,
బరులసొమ్ముల కాసపడు వానిగతికి,
శరణార్థిఁబ్రోవని చపలాత్ముగతికి,
ఘనతరధర్మవిక్రయుఁ డేఁగుగతికిఁ
జనువాఁడ; దేవతల్‌ సాక్షులింతటికి.
నా పాపమునఁజేసి నాకు నీపాప
మీ పాపకర్మురా లిటు 453గట్టెఁగాక!
యేను రామునకు నెగ్గేలకావింతు?
నీ నీచకర్మంబులేడ? నే నేడ?”
నని యేడ్చుభరతుశోకాగ్నులపెంపు
గనుఁగొని కౌసల్య గరము శోకించి:
“యిటువంటిపుణ్యాత్ము నేల దూఱితిని?
కటకటా!”యని పొక్కి కౌఁగిటఁజేర్చి
భరతశత్రుఘ్నులపై వ్రాలి తూలి
పరితాపమొందుచుఁబలవింపుచుండె.
నంత వసిష్ఠసంయమి వారిఁగొనుచు
నంతఃపురంబున కడలుచుఁ బోవఁ[వా.రా. సర్గ 76, 77]
“గనుఁగొనఁగా 454రాదు కైకేయి గన్న
తనయుండు వీఁ.”డని తనమీఁద నలిగి
పెనుపొంద మాణిక్య 455పీఠిపై నొఱగి
తనుఁజూడనొల్లని తలఁపున 456రోసి
కనుఁగవ మూసినగతి నున్నతండ్రిఁ
గనుఁగొని భరతుండు గడుమూర్ఛనొంది
తెలిసి క్రమ్మఱఁజూచి తీవ్రంపువగల
వెలువరింపఁగరాక విలపింపఁ457దొడఁగి:
“వసుధేశ! కేకయావనిపాలుచేత
నసమానమణిభూషణాదులు నీకుఁ
గొనివచ్చినాఁడఁగైకొన నొల్లవేమి?
ననుఁజూడ విదియేమి? 458నా తప్పులేమి?
“కడుఁబాపమతియైన కైకేయి గన్న
కొడు”కని ననుఁజూడఁగూడదుగాక!
ధర459ణీశ!యీ సుమిత్రా460పుత్త్రుఁజూడు
పురపురఁబొక్కుచుఁబొరలుచున్నాఁడు;
కడఁగి నీ హస్తపంకజములఁబట్టి
తుడువ వేమిటికి శత్రుఘ్నుపై ధూళి?
యితనిఁగటా461క్షింపు; మితనితోఁబల్కు
మితనిఁగౌఁగిటఁజేర్పు; మితఁడేమిసేసె?
నీ మంచితనమును నీ దయారతియు
నీ మొగమోటయు నేఁ డెందుఁబోయెఁ?
గైకేయి నీ బుద్ధిఁగలఁచెనే తండ్రి?
నీ కిట్టిమరణంబు నేర్చునే కలుగఁ?
జావరే నృపు, లిట్లు చావరుగాక!
లేవె నెయ్యము, 462లిట్లు లేవుగా కెందుఁ?
బడఁతులు మెప్పించి ప్రాణవల్లభుల
నడుగరే,463యీ యీవులడుగరుగాక!
యీ కష్టవర్తనంబేమిటఁ గడవఁ
జేకుఱు? నే నేమిసేయుదు?”ననుచు
464బలుమఱుఁబలవించుభరతునిఁజూచి
తెలిపి వసిష్ఠుండు దెఱఁగొప్పఁబలికె:
“ననఘాత్మ! మీ తండ్రి యవనియంతయును
వినుతింప నఱువదివే లేఁడు లేలె;
మనుమార్గ465నియతి ధర్మములెల్లఁజేసెఁ;
గొనకొని మీయట్టి కొడుకులఁగనియెఁ;
గావున నింక శోకము మాని నిష్ఠఁ
గావింపు మగ్నిసంస్కారాదివిధుల.”
ననవుడు“నౌఁగాక.”యని మఱునాఁడు
మునుల రాజుల మహాత్ములఁబిలిపించి
వలనొప్ప దశరథేశ్వరుకళేబరము
కలగొని తీర్థోదకము466లార్చి పేర్చి
వరరత్న భూషణావళులు గైసేసి
తరమిడి వేదోక్త దానముల్‌ సేసి
పరగ విమానంబుపైఁ దెచ్చి పెట్టి
యరుదైన 467మంత్రపూతాగ్ని సేపట్టి
తనతమ్ముఁడును దానుఁదగ వసిష్ఠాది
మునులతో భరతుండు ముందఱ నడవ
నా విమానమునకు నంతంత గదిసి
వావిరి నేడ్చుచు వగలఁదూలుచును
మునుకొని కౌసల్యమొదలుగాఁగలుగు
వనితలందఱుఁగూడి వరుస నేతేర
సరయువుచేరువ468శవభూమియందుఁ
దిరముగా సొదఁబేర్చి త్రేతాగ్నులిచ్చి
యొలసినభక్తి వేదోక్త మార్గమున
నెలకొని దశరథనృపతి దహించి
469తగురీతి మఱి తిలోదకములు వోసి
తగవుతోఁబిండప్రదానంబు సేసి
తెఱఁగొప్పఁబండ్రెండుదినములు వలయు
తెఱఁగుల నడపి వర్తించుచో నంతఁ
గొనకొని యిక్ష్వాకుకులగురుండైన
ముని వసిష్ఠుఁడు గార్యమునువిచారించి[వా.రా. సర్గ 79-82]
తాను రాజన్యులుఁ470దగమంత్రివరులు
భానుసన్నిభతేజు భరతు నీక్షించి:
471భరతేశ! మీ తండ్రి పరలోకమునకు
నరిగె; శ్రీరాముఁడు నరిగెఁగానలకు;
నుర్వికి రాజు లేకున్నఁగార్యములు
నిర్వహింపఁగరాదు; నిలువరు ప్రజలు;
ధారుణి చలియించు; ధర్మంబు472లడఁగు;
వైరులు మింతురు; వర్ణముల్‌ గలయు;
నవని యరాజకమైయుండఁదగదు;
ప్రవిమలమతి473నీవు పట్టంబుఁ474బూను.”

  1. రాజ్య
  2. కెల్ల
  3. డాడి; డొడ్డి
  4. ప్రజలు
  5. వేగమునఁ గేకయ
  6. వెఱచి
  7. మై వెనుబడు
  8. అంగళ్లు
  9. సమగ్రవస్తువులఁ-బొం
  10. కిప్పుడటంచువచ్చి
  11. మొగి
  12. కరుగఁ గైకేయి. - యింతులు దానును
  13. దఱిఁగి
  14. వలనుమీఱఁగ
  15. లఁదే(గీ)లింపు
  16. యల్లనఁదె
  17. దూలెనొ
  18. మతి
  19. నా చిత్తమెఱుఁగక నా మాటఁగొనక- నీచవృత్తికిఁజొచ్చి నీ వింతసేసి, లోకులచేత నీ లోకంబులోన - నాకు నిందలు దెచ్చినావని కైక, ననుమాటలన్నియు
  20. వారెల్ల
  21. ఁగొని
  22. నయంత
  23. దూఱఁ,తూలిప
  24. నీకేల వగవ
  25. సేసెఁ
  26. ఁగాదు
  27. భిత్తి
  28. జేసి
  29. దొడఁగె
  30. ననుఁగన్నతండ్రి!
  31. మీఁద
  32. తనూభవుఁడు
  33. క్షింప వితని… బల్కవిత… జేర్పవితఁ…
  34. లెందు… గాకిట్లు
  35. యాయువు
  36. పనివడి
  37. వృత్తి
  38. లాచరించి
  39. యగ్నిహోత్రాగ్ని
  40. సమ
  41. తగవొప్ప
  42. దగు
  43. వరతేజ
  44. లుడుగు
  45. ఁబూని
  46. గటు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )