ఇతిహాసములు రంగనాథరామాయణము అయోధ్యాకాండము
భరతుఁడు రాము సన్నిధి కేఁగుట
మనిబుద్ధి సెప్పిన నమ్మునినాథుఁ
గనుఁగొని భరతుండు475గరముఁగోపించి:
“యిదియేమి మునినాథ!యింతమూఢుఁడవె?
మదినింత యెఱుఁగవె మా కులక్రమము?
నన్నఁగానలఁద్రో476చె; నక్కటా! నన్నుఁ
గన్నతండ్రిని జంపెఁగడఁగి మా తల్లి.
యింత సాలదె నాకు;477నింక రాజ్యంబుఁ
జింతింతునే యేను! జెప్పకు మింకఁ.
గైకేయికొడుకని కడఁగి పల్కెద478వు
కాక, యీ తలఁపులు గలవె నా యందు?
నిట్టున్నరూపున నేను మా యన్నఁ
బట్టంబు గట్టెదఁ బ్రార్థించి తెచ్చి;
కాకున్న మాయన్న గైకొన్న479నియతిఁ
గైకొందు480గా; కొండుగలుగునే నాకు?”
నని నిశ్చయముసేసి యపుడు మంత్రులను
గనుఁగొని;“మా యన్నఁగానఁబోవలయు
దెరువులు సక్కఁగా దిద్దింపుఁ481డోలిఁ
బురజనులకు నేఁగఁబొసఁగినరీతి;
నెడనెడ విడుదు లనేక వస్తువులుఁ
గడుసమగ్రములుగాఁ482గావింపుఁ”డనిన.
ననుకూలమతి వారునట్ల చేయిం483ప
ననుపమోత్సాహులై యమ్మఱునాఁడు
నవసహస్రములు దంతావళ ఘటలు
జవనాశ్వమణులు లక్షయుశతాంగములు[వా.రా. సర్గ 83]
నఱువదివేలును నమితపదాతి
తఱచుగా నడవ నత్తఱిఁబౌరజనుల
జనపదస్థుల నెల్లజాతులవారి
ధనరత్న రాసులఁ దగవసిష్ఠాది
మునుల రాజుల మంత్రిముఖ్యులఁగొనుచుఁ
దన తమ్ముఁడును,దానుఁ,దల్లులందఱును
ననువుగాఁజతురంతయానంబులెక్కి
వెనుక రా భరతుం484డు వేగమె కదలి
పోయి గంగానదిపొంతను విడియ
నాయతశుభశీలుఁడగు గుహుం డెఱిఁగి[వా.రా. సర్గ 84-89]
“కడఁగి రామునిమీఁదఁగైకేయికొడుకు
నడచుచున్నాఁడు సేనలతోడ.”ననుచు
485నలవుమైఁగోపించి486యగణితంబైన
బలములతో వచ్చి భరతున కనియె:
“భరత!రాముఁడు రాజ్య487పదవి నీకిచ్చి
యరు488దైన మునివృత్తి నడవుల నుండ
నీవు సేనల489తోడ నిజశక్తి మెఱసి
పోవుచున్నాఁడవు; పోలునే నీకు?
నేను రామునిబంట; నే490నింక నిన్నుఁ
బోనీను; నీ బలంబుల సంహరింతు.
నడరి నీతోడఁబోరాడి ప్రాణములు
విడిచిన మఱి రామవిభునిపైఁబొమ్ము.”
అని రోషమున గుహుఁడాడు వాక్యములు
విని భరతుఁడు నవ్వి విమలుఁడై పలికెఁ:
“బరమాత్ముఁడగు రాముఁబ్రార్థించి తెచ్చి
పరగ నయోధ్యకుఁబట్టంబు గట్టఁ
బోవుచున్నాఁడ 491ను; బుద్ధిలోఁగీడు
భావింప; నీవిట్లు492పలుకంగ వలవ.”
దనియని యాతని నక్కునఁజేర్చి
తన మదిఁ 493బొగులునాతని చిత్తమెఱిఁగి
యనురక్తి భరతేశు నడుగుల కెఱఁగి
యనుపమవన్యంబులైన వస్తువులు
గను దనియఁగ494ఁబెక్కు కానుకలిచ్చి
కొనిపోయి గుహుఁడు కాకుత్స్థుండు దొల్లి
విడిసిన చోటనె విడియించి ప్రీతి
జడలు495గట్టినచోటు సని యటు సూప
జననులు మునులును సచివులుఁదానుఁ
గనుఁగొని భరతుండు గడు శోకమంది
496పనవుచు మఱి మఱ్ఱిపాలు దెప్పించి
తన తమ్ముఁడును దాను ధరియించె జడలు.
భరతుండు మఱునాఁడు బ్రాహ్మిక కర్మ
పరుఁడునై గుహుఁడొప్పఁబన్నించినట్టి
యేనూఱుబలు నావలెక్కి వేర్వేఱ
తానుఁదల్లులు మునుల్‌ దగమంత్రివరులు
సకలసేనల497తోడ జాహ్నవి దాటి
యకలంకుఁ498డగు గుహు499నపుడు దోడ్కొనుచు

  1. ↑గరములు మొగిచి, గరమర్థిఁబలికె
  2. ↑చి యక్కటా!
  3. ↑నీరాజ్యమేల
  4. ↑రొ
  5. ↑వ్రతము
  6. ↑నాయందుఁగలదె వేఱొండు
  7. ↑డఖిల-పుర
  8. ↑గట్టింపుఁ
  9. ↑చి-రను
  10. ↑డావేళను, డవ్విధమునఁగ
  11. ↑బలువిడిఁ(నలువుమైఁ) గోపించి ప్రళయాగ్నివోలె
  12. ↑నావలాగించి
  13. ↑పదము
  14. ↑దుగా
  15. ↑ఁగూడి
  16. ↑మైన
  17. ↑నాబుద్ధిలోనొండు-భావించి
  18. ↑భావింప (ఁదగునె?)వలవ-ద(య)నపుడు భరతేశు
  19. ↑బొగుల
  20. ↑మఱి
  21. ↑దాల్చిన
  22. ↑పనుపడి
  23. ↑ఁగూడి చని గంగదాటి
  24. ↑డై
  25. ↑నటవీడుకొల్పి
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )