ఇతిహాసములు రంగనాథరామాయణము అయోధ్యాకాండము
భరతుఁడు భరద్వాజాశ్రమముఁ జేరుట
నతఁడు సూపినత్రోవ నట వోయిపోయి
క్రతుహోమతతధూమకబళితవ్యోమ
కృతకాంబుదస్తోమ కేవలముదిత
కృతలాస్యవిపినబర్హిణబర్హజాల
రచితాంతరాంతర రత్నవిచిత్ర
ఖచితతోరణ500పథిక్రమమయి యొప్పు
నా భరద్వాజసంయమి యాశ్రమమున
కా భరతుఁడు వోయి యనతిదూరమునఁ
జతురంగబలములఁ జతురత నిలిపి
యతులపుణ్యాత్మకుండగు భరద్వాజుఁ[వా.రా. సర్గ 90, 91]
గని భక్తితో నమస్కారముల్‌ సేయఁ
గని యమ్మహాముని కడు నల్గి పలికె:
“భరత! యీ చతురంగబలములఁగొనుచు
భరితసన్నాహసంభ్రముఁడవై 501నీవు
గడుశాంతవృత్తి రాఘవుఁడరణ్యములఁ
బడియుండ నాతనిపైఁబోవ502ఁదగునె?”
యనుచున్న మునికోప మంతయు503నెఱఁగి
వినతుఁడై భరతుండు వెఱ504చుచుఁబలికె:
“జానకీవల్లభు‘సకలరాజ్యంబుఁ
బూనుము నీ.’వనఁబోయెదఁగాని
యొండుభావమునఁ505బో నో మునినాథ!
యొండుగాఁదలఁపకు 506ముల్లంబులోన.”
ననిన సంతోషించి యమ్ముని వలికె:
“ననఘాత్మ! నీవు నీ యఖిలసైన్యములు
మనమార మా యాశ్రమమున నేఁడుండి
వినుతి మే మొనరించు విందారగింపు.”
మని విశ్వకర్మను 507నటకు రప్పించి:
“ఘనచిత్రపురి యొండు గల్పించి యందు
వారు వీరన కెల్లవారికిఁ దగిన
మేరల నిండ్లు నిర్మింపు మీ.”వనిన
నైదుయోజనముల నతఁడొక్కపురము
భూదేవిచరణనూపురము నిర్మించె.
నందుఁ గాంచనమయంబై యొక్కరాజ
మందిరంబమరెఁ; 508దన్మధ్యభాగమున
శ్వేతాతపత్రోరుసింహాసనమునఁ
జాతురి నొక సభాస్థాన మింపొందె.
నప్పుడు మునియాజ్ఞ నట భరతుండు
విప్పైనగృహముఁ బ్రవేశించి యందు
సింహాసనముఁగాంచి,“శ్రీరామనృపతి
సింహార్హమిది.”యని చేతులు మొగిచి,
యా సమీపంబున నతఁ డొక్కపీఠి
నాసన్నుఁడై మంత్రులందఱుఁగొలువ
నున్నచో మునియాజ్ఞ509నొక్కట వచ్చి
కిన్నర గంధర్వ ఖేచరాంగనలు
510నచ్చరనెచ్చెలు లాటపాటలును
నచ్చెరువుగఁజూపి రతనిసన్నిధిని.
ఆ రీతి సకలజనావళి యిండ్ల
నారూఢి వెలసె నాట్యప్రసంగములు.
నిలమీఁద దివిమీఁద నే యే విశేష
ములు గలవన్ని యా మునియాజ్ఞ వచ్చె.
జానపదుల్‌ పౌర511జనము లందఱును
స్నానంబు లొనరించి చలువలుగట్టి
మందారపుష్పదామము 512లూని దివ్య
చందనంబలఁది భూషణములు దాల్చి
వేవేలతెఱఁగుల వింతగా వేల్పు
టావు చతుర్విధాహారంబు లొసగఁ
బరితృప్తులై దివ్యభామలు దమకు
సురతవిశేషముల్‌ 513సొక్కుచుఁదెలుప
జన్మసాఫల్యంబు సమకూడె ననుచుఁ
దన్మయావస్థలఁ దవిలి క్రీడింప
నమ్మునియాశ్రమంబటు సూడ నొప్పె
నిమ్ముల నా స్వర్గ మేవగింపుచును.
ఈ రీతి భరతేశుఁ డెల్ల సైన్యములు
నా ఋషిఁబొగడుచు నా రాత్రి దీర్చి
మఱునాఁడు పురముఁదన్మందిరావళులు
దెఱగంటిచెలులు నదృశ్యమౌటయును
భరతుఁడత్యాశ్చర్యభరితుఁడై యంత
వరతపోనిధి భరద్వాజునిఁ జేరి
ప్రణమిల్లి:“మీ తపోబలమహత్త్వములు
ప్రణుతింప514ఁదరమె యప్పరమేష్ఠికైన?
నేనింక రఘురాము నినకోటిధాముఁ
గానఁబోయెద.”నంచుఁగన్నతల్లులను
నవ్వేళ మ్రొక్కింప నతఁడు: “వీ రెవ్వ
రెవ్వరు? వేర్వేర నెఱిఁగింపు”మనుడు
“ధీరాత్మ!నృపుపెద్దదేవులై యెల్ల
వారిలో వన్నెయు వాసియుఁ515గాంచి
కడుపు సల్లఁగ రాముఁగాంచియు వగల
నుడుకుచున్నది తద్వియోగాగ్నిశిఖలఁ
బరిచిత516 ధర్మసాఫల్య కౌసల్య;
పరికింపు మిదె మునిపతిసార్వభౌమ,
కౌసల్యసతివామకర 517ము సేపట్టి
కైసేఁత లుడివోయి గతపుష్పకర్ణి
కార శాఖయుఁబోలి కైవ్రాలియున్న
యీ రామ శ్రీరామునెడఁబాయలేని
యా లక్ష్మణునిఁగన్నయట్టిపుణ్యాత్ము
రాలు సుమిత్ర,పరాకు, మునీంద్ర!.
ఏ తల్లికై కానకేఁగె మా యన్న,
యే తల్లికతమున నీల్గె మా తండ్రి,
ఏ తల్లికోర్కి నన్నింతకుఁదెచ్చె,
నా తల్లి మా తల్లి హతపుణ్యపాక,
కైక గన్గొను”మంచు గద్గదకంఠుఁ
డై కడపట శోక మగ్గలంబైన
నూరకయున్నచో నూరార్చి యతని
నా ఋషి భావికార్యము518ఁజూచి పలికె:
“నీ కైక లోకైకహిత మొనరించె
మీ519 కెల్లఁదెల్లమౌ మీఁదఁదా.”ననుచు
మఱి రాముఁడున్నట్టిమార్గంబు దెలిపి
తెఱఁగొప్ప నమ్ముని దీవింప వెడలి
సింధురబృంహిత సేనానులాప
సైంధవహేషిత స్యందన నేమి
రవముల520కలికి యరణ్యమృగాళి
దివిఱినభీతి నల్‌దెసలకుఁ బాఱ
బలచరణోద్ధూతపాంసుసంఘాత
మలినీకృతాదిత్యమండలుండగుచు
నా చిత్రకూటాద్రి కర్థితో భరతుఁ
డేచి సేనలుఁదాను నేఁగు చున్నంత
నటచిత్రకూటాద్రి యందు రాఘవుఁడు
కుటిలకుంతల సీతఁగూడి మోదమునఁ[వా.రా. సర్గ 94, 95]
“గనుఁగొంటివే యిన్నగంబు బింబోష్ఠి!
కనుదమ్ములకు విందుగావించె మనకు.
నిన్నగమహిమ దానెన్నంగ వశమె?
పన్నగ పతికైన భామాలలామ!
గుఱుతైన సెలయేటి ఘుమఘుమధ్వనుల
నుఱుములటంచుఁబెల్లుబ్బి నీ కురులఁ
బురుడించు తనగొప్పపురి విచ్చి నెమలి
పొరిఁబొరి నాడెడుఁ; బూఁబోఁడి సూడు.
కాంతరో! యీ చెంచుకాంతలఁగంటె;
దంతికుంభంబులు దమ521చన్నుఁగవకు
నెనవచ్చు టెట్లని యిభకుంభదళన
మొనరించి తన్మణు522లొప్పఁదాల్చెదరు.
దివ్యుల సంకేత దేశంబుగాన
దివ్యవాసనలు సంధించె నీ కోన.
పదతలాలక్తక భాసురం523బల్ల
పొదసూడు గంధర్వభోగ గేహంబు.
కిన్నరకంఠి! యీ గిరికందరంబు
కిన్నర కిన్నరీ గీతసద్గోష్ఠి.
కలకంఠరవసహకారపల్లవము
కలకంఠి! యీ సహకారంబుఁజూడు.
పరిపరివిధముల పరువంపువిరుల
పరిమళంబులు గదంబముగఁగూర్చుచును
మలయానిలుండు గోమలయానలీల
మలయుచున్నాఁడిదె మనమీఁద నబల!
యల్లదె చూచితే హల్ల 524కనికర
ఫుల్లకైరవకంజపుంజరంజితము
సాల తమాల రసాల తక్కోల
తాల హింతాల కుద్దాలకూలమును
నమలిన పులిన మధ్యాసనాసీన
సముచిత మునిబృందసందీప్తమైన
మందాకినీనదీ మణిఁగన్నులలర
మందయానవిలాసమథితమరాళ.”
యనియని పలుకుచు నవనీరుహములఁ
గనుపట్టుపొదరిండ్ల ఘనకందరముల
శైలశృంగంబుల సానుదేశముల
నోలి వినోదించుచున్నచోఁ గడఁగి

  1. పథ,పద
  2. పేర్చి
  3. నేల?
  4. సరసి
  5. పుతోఁ,వొప్పఁ
  6. గాదోముని
  7. ఁడు
  8. నపుడు
  9. దన్మందిరంబునను
  10. నొయ్యన
  11. నచ్చట నప్పుడు నాట
  12. జనులెల్లవారు
  13. లూది, పూని
  14. సూపుచు నుండ
  15. వశమె
  16. దాల్చి
  17. జన్మ
  18. మంటఁబట్టి
  19. నిశ్చయించి - యీ
  20. కది తెల్ల మీమీఁద నౌ
  21. కులికి
  22. కుచంబులకు
  23. లొనర
  24. బైన
  25. కానీక
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )