| ఇతిహాసములు | రంగనాథరామాయణము | అయోధ్యాకాండము |
|
బలువిడి నేతెంచు భరతసైన్యముల కలకలధ్వనుల నాకర్ణించి బిట్టు[వా.రా. సర్గ 99] కలఁగి నల్గడఁబాఱుకరివరాహముల బలుమృగంబులఁజూచి బలధూళిఁజూచి: “యిట ధూళి దివిఁబర్వనేమి కారణమొ! యటువోయి యరసి ర.”మ్మనిన లక్ష్మణుఁడు వేవేగ నొక మహావృక్షాగ్ర మెక్కి భావించి యుత్తరభాగంబునందు బలములఁబొడగని భానువంశజుల బలుబిరుదులతోడి పడగలు సూచి యిచ్చలో:“భరతేశుఁడిట రాముమీఁద వచ్చుచున్నాఁ.”డని వడి నిశ్చయించి పటువజ్రమద్రిపైఁ బడుభంగి దోపఁ జటులసత్త్వమున వృక్షము డిగ్గనుఱికి వారక రోషదుర్వారుఁడై వచ్చి యా రామవిభుఁజూచి యనియె లక్ష్మణుఁడు: “అడవికి నినుఁబోవనడచి నీ రాజ్య మడరి యంతయుఁగొని యంతటఁబోక ఘనశక్తి525 నీ మీఁదఁగైకేయికొడుకు సనుదెంచుచున్నాఁడు సబలుఁడై526వీఁడె. అవె చూడు కోవిదారాది ధ్వజంబు; లవె చూడు భటులవీరాలాపములును; శరచాపకవచముల్ సరిఁబూని నీవు భరతుని కెదురుగా బలువిడి నడవు; నిలువకు; కాదేని నీవు సీతయును దొలఁగుము; నీ శాంతి దుది నింతసేసె; నేనింక సైరింప; నిటవచ్చెనేని వీనిఁజంపెద.”నన్న విని రామవిభుఁడు: “నాకుఁదమ్ముఁడవయ్యు నా తోడఁబుట్టి నీకిట్టియవినీతి నేఁడేల కలిగె?[వా.రా. సర్గ 97] భ్రాతృవత్సలమూర్తి పరమపావనుఁడు నీతికోవిదుఁడు మానిత ధర్మరతుఁడు భరతుండు నీకంటె భక్తుండు నాకు; భరతునిదెస527 నొండుపాపంబు లేదు; మనల నయోధ్యకు మఱలఁబ్రార్థింపఁ జనుదెంచుచున్నాఁడు సందేహముడుగు, కడవకు.”మనుడు రాఘవునాజ్ఞపెంపు గడవ భీతిల్లి లక్ష్మణుఁడూరకుండె. భరతేశుఁ528డప్పుడు 529పౌరులహితుల దొరలసమస్త యోధుల నొక్కచోట[వా.రా. సర్గ 98, 99] విడియించి, తల్లుల వెనుకఁదోడ్తేరఁ గడఁక వసిష్ఠునిఁ గట్టడ సేసి, గురుభక్తి530సూతుఁడు గుహుఁడుఁదోడుగను నరిగి తమ్ముఁడుఁదాను నగ్గిరి యెక్కి వరుస నయ్యడవిత్రోవలు దెలియుటకుఁ గరమర్థి సౌమిత్రి గట్టినయట్టి గుఱుతులు గొన్ని గన్గొనుచు నల్గడల నెఱిఁబరికించుచు నిఖిలాస్త్రశస్త్ర జాలపాలితసువిశాలాంగణములఁ జాలఁ జెన్నగు పర్ణశాల కేతెంచి మునివేషమునఁజాలముదమొందురాముఁ గనుఁగొని531యాత్మలోఁ532గలఁగి శోకించి “పొలుచు కాంచనగృహంబుల నుండువాఁడు లలి దూలి పర్ణశాలల నున్నవాఁడు; పొగడొందుపువ్వుఁబాన్పున నుండువాఁడు జగతిపైఁ బూరిసెజ్జల నున్నవాఁడు; నెఱసి కిరీటంబు నెఱిఁదాల్చువాఁడు తఱచైన జడలొప్పఁ533దాల్చియున్నాఁడు; నోలి రాజులు గొల్వ నుండెడువాఁడు లోలత మృగములలో నున్నవాఁడు; మేలిచందనమును మెయిఁబూయువాఁడు ధూళిధూసరితుఁడై తూలియున్నాఁడు; 534పొనర దివ్యాంబరంబులు గట్టువాఁడు మునివృత్తి వల్కలంబులు గట్టినాఁడు; పొసఁగ రసాన్నముల్ భుజియించువాఁడు కసరుఁగాయలఁబ్రొద్దు గడపుచున్నాఁడు; చూచితే శత్రఘ్న! శుభమూర్తి రాముఁ డీచందమున దుఃఖ మీఁదుచున్నాఁడు; కైకేయి పాపంపుఁ గడుపునఁబుట్టి యీ కష్టదుర్దశ535 లిటు సూడవలసె.” ననుచుఁదమ్ముడుఁదాను నా రామవిభునిఁ గని మ్రొక్కుటయు వారిఁగౌఁగిటఁజేర్చి[వా.రా. సర్గ 100] కన్నుల హర్షాశ్రుకణములు దొరుగ వెన్నులు నివిరి భావించి దీవించె. నహిమాంశుకులునకు నా సుమంత్రుండు గుహుఁడు మ్రొక్కిరి భక్తికొనసాగ నపుడు. ధరణిజకును సుమిత్రా తనూజునకు భరతశత్రుఘ్నులు ప్రణమిల్లి 536నిలువఁ గుశపీఠముల 537నుండఁగోరి రాఘవుఁడు దశరథుసేమంబుఁ దల్లుల శుభము పలుమాఱు నడుగుచు: “538భరత! నీవేల యిల యేల కింత 539దవ్వేఁగుదెంచితివి? భూతలాధీశు పంపున రాజవగుచు నీతితోఁ జేయుదే నీవు రాజ్యంబు? దశరథేశునకు సత్య 540ప్రతాపునకు విశదపుణ్యునకుఁగావింతువే పూజ? తల్లులనెల్ల నాదరము 541ల్లసిల్ల నుల్లంబు సల్లఁగా నూఱడింపుదువె? కోవిదు మత్కులగురుఁ దపోనిష్ఠు నా వసిష్ఠు గరిష్ఠు నలరింతె నీవు. అగ్నిహోత్రముల సంధ్యాకాలనియతి 542భగ్నత లేకుండఁ బాలింతె నీవు? సుజనులౌమంత్రులచొప్పెల్లఁ దెలిసి విజయమూలము మంత్రవిధి యెఱుంగుదువె? అపరరాత్రుల లేచి యర్థచింతనము నిపుణతఁజేయుదె నీవు నిత్యంబు? నరసి యుత్తమమధ్యమాధమజనుల వెరవుతోఁ బనిగొందువే తగినట్లు? తనవారియెడనైనఁదగ 543వూది దండ మనురక్తిఁజేయుదె యపరాధ మెఱిఁగి? మతిమంతు సకలసమ్మతు స్వామిహితుని వితతవిక్రము సైన్యవిభుఁ జేసినావె? కొలిచినవారికిఁ గోరి జీతములు నిలువ గాకుండ సన్నిధి నొసగుదువె? చారులవలన రాష్ట్రముల 544వార్తలును వైరుల తెఱఁగు సర్వము నెఱుంగుదువె? జాలి545ఁదూలెడు పేదసాదుల మొఱలు వాలాయముగ విందువా గర్వముడిగి? యర్మిలి వర్ణాశ్రమాచారవిహిత ధర్మంబు లరయుదె తడఁబడకుండఁ? జోరుల జారుల సుడియంగనీక వారల దండింతె వదలక పట్టి? చతురంగబలముల సన్నాహ546పటిమ నతియుక్తిఁజేయుదె యప్పటప్పటికి? ధనధాన్యవస్తుసద్భటసమేతముగ మునుపుగా గడిదుర్గముల 547బలియింతె? యన్యాయములు సేసి యర్థముల్ గొనక మాన్యతఁబ్రోతువె మఱి కాపు548గడల? నర్థలోభమున విప్రాగ్రహారముల నర్థ మెత్తవుగదా యరవీసమైన? నెపుడు గోబ్రాహ్మణహితముఁగోరుచును నిపుణుఁడవై ధర్మనిష్ఠ నుండుదువె? శక్తిత్రయంబును షడ్గుణంబులును సక్తిఁబంచాంగముల్ చతురుపాయములుఁ బదునాల్గురాజపాపంబులుఁదెలిసి 549సదయత మనుధర్మశాస్త్రపద్ధతిని దేవతా పితృ మహీదేవతాపూజ గావించి స్వర్గంబుఁగాంచు భూవిభుఁడు; నీవును నా రీతి నీతి రాజ్యంబుఁ గావింతువే?”యంచుఁ గాకుత్స్థుఁడడుగఁ గరములు మొగిచి గద్గదకంఠుఁడగుచు భరతుండు రామభూపాలుతో ననియె: “నీ ధర్మసరణి నా కేమియుఁదెలియ దో ధర్మనిపుణ! యింకొక వార్త వినుము:[వా.రా. సర్గ 101] నృపకులాధీశ్వర! నిన్నుఁగానలకుఁ గృపమాలి 550కైకేయి కినిసి పొమ్మనినఁ దడయక నీ విట్లు తాపసవృత్తి నడవికి విచ్చేసి: తది యాదిగాఁగ నలఁతలఁదూలి యేడగునాఁడు నిన్నుఁ దలఁచుచు మృతుఁడయ్యె దశరథేశ్వరుఁడు. ఏనును బితృమేధ మెల్లను జేసి కానల మీరుండఁ గాన వచ్చితిని.” అనుపల్కు నిర్ఘాతమై 551తాఁక రామ జనపతి మూర్ఛిల్లి జగతిపైఁ 552ద్రెళ్లె.[వా.రా. సర్గ 102] మేదినీసుతయు సౌమిత్రియుఁదూలి మేదిని వ్రాలిరి మృతులైన 553పగిది. నొలసినధృతి రాముఁడొకకొంత దెలిసి పలుమాఱు 554విలపింప భరతుండు వలికెఁ: “గృతమతివయ్యుఁబ్రాకృతుని చందమున నతిదుఃఖమునఁబొంద నగునయ్యనీకు? దేవ! లక్ష్మణుఁడు వైదేహియు నీవు వేవేగ దశరథోర్వీనాథమణికిఁ బరలోకవిధులెల్ల భక్తితోఁజేయుఁ; డరయంగ నదికృత్య.”మనిన రాఘవుఁడు మందాకినికి 555వచ్చి మది నిష్ఠవెలయ నందుఁగృతస్నానుఁడై తండ్రికపుడు పొనరఁదిలోదకంబులు వోసి, వగలు పెనఁగొన మఱి గారపిండిచేఁబుణ్య ధనుఁడర్థిఁ బిండప్రదానంబు సేసి, ఘనతరశోక సంకలితుఁడై మగుడి సన్నుత 556గతిఁబర్ణశాల కేతెంచి యున్నచో రఘురాముఁడున్నచక్కటికిఁ బౌరవర్గముతోడ బంధులతోడఁ జారువర్తనులైన సచివులతోడ[వా.రా. సర్గ 103] ఘనుఁడు వసిష్ఠుండు కౌసల్యమొదలు జననులఁదోడ్కొని చనుదెంచుటయును 557నూనినశోకాగ్ను లొదవ రాఘవుఁడు దాను సీతయు సుమిత్రాతనూభవుఁడు వారి558యంఘ్రులమీఁద వ్రాలి శోకింప వారును శోకింప వారించె559నంత నా వసిష్ఠమునీంద్రుఁడమలవాక్యముల; నా వేళఁగౌసల్య యవనినందనను వనవాసకలితవివర్ణాంగిఁ జూచి తనమది విధి దూఱి తద్దయుఁబొగుల; గిరిమీఁదవర్తించుకిన్నర యక్ష గరుడోరగామర కామినుల్ వచ్చి: “రామునిసతి దశరథరాజుకోడ లీ ముగ్ధ జనకమహీపాలుపుత్త్రి వివిధసంకటముల వేఁగుచునుండె; భువి560నసాధ్యము లేదుపో యెందువిధికి? నని సీతఁ561బేర్కొన నప్పు డా రాముఁ డనఘుఁడైన వసిష్ఠునడుగుల కెఱఁగి జననులఁ జుట్టాల సచివుల హితుల మునులను గుశపీఠముల నుండఁబనిచి తనతమ్ములును దాను దర్భాసనముల జనలోచనోత్పలచంద్రుఁడై యుండి, యా వేళ భరతుని యాకృతిఁ జూచి: “యో వత్స!జడలును నురువల్కలములు[వా.రా. సర్గ 104] నీవేల తాల్చితి? నృపునాజ్ఞఁ బూని వేవేగ చని మహీవిభుఁడవై యుండు.” మని పల్కుటయు రామునాననాంబుజముఁ గనుఁగొని భరతుండు గరములు మొగిచి “దేవ! రాఘవ! కైకధృతి 562 దూలి నిన్ను భావింపనేరక పాపంబు సేసి “యడవుల నుండు వొ.”మ్మన్న మాటలకుఁ దడయక 563చనుదేరఁదగునయ్య నీకు? మిముఁబాసి దశరథమేదినీపతియు నమరలోకంబున కరిగె; నీ ఘోర పాపంబు మా తల్లి పచరించె; నరక కూపకోటుల నింకఁగూలకయున్నె! యేను నీ దగురాజ్య మే మెయిఁబూనఁ గానేర; నా చేతఁగాదు భూనాథ! నీ వయోధ్యకు564నింక నెమ్మి విచ్చేసి పావనమతితోడఁ బట్టంబుఁబూను; వల్లభు నెడఁబాసి వగలఁబెల్లడలు తల్లుల నూరార్పు; 565తక్కినహితుల సచివులఁజుట్టాల సకలపౌరులను సుచరిత్ర! కృపతోడఁజూచి పాలింపు. నన్ను నీ బంటు మన్ననచేసి నాదు విన్నపంబాలింపవే దయామూర్తి.” యని పాదముల వ్రాలి యటులేవకున్నఁ దనదు తమ్మునినెత్తి 566దయఁగౌఁగిలించి “భరత! నీ విది యేమి బాలుండవైన కరణిఁబల్కెదు ధర్మగతి దప్పనాడి? యా కైక నేల పోనాడెదు; తండ్రి పోకకు నీవేల 567పొగిలె దీ వేళ? డాకతో నదిని గాష్ఠంబుఁగాష్ఠంబు జోకయై పాసినచొప్పు దీపింపఁ బుత్త్రమిత్రకళత్రములు డాయుఁబాయు మైత్రి ఋణానుబంధరూపమున. నవనిపైఁబుట్టినయప్పుడె చావు ధ్రువము జీవునికని రూపించి నరుఁడు తనకులోచితమైన ధర్మమార్గమున మనినవాఁడిహపరమాన్యుఁడై యుండుఁ గావున మనతండ్రి కమనీయసత్య భావుఁడై నీతితోఁబ్రజలఁ బాలించి ఘన దానయాగ సత్కర్మముల్ వెక్కు లొనరించి రాజ్యసౌఖ్యోన్నతిఁగాంచి మనవంటితనయుల మనమారఁగాంచి జనులెల్లఁగొనియాడ స్వర్గస్థుఁడయ్యె. నతనికై వగచుట యనుచితంబింక; నతనివాక్యము మన568కటు సేయఁదగవు. పితృవాక్యకరణంబె ప్రియధర్మమెందు సుతునకు; నటుసేయుసుతుఁడె విశ్రుతుఁడు వనమునఁబదునాల్గు569 వర్షముల్ నన్నుఁ దనపంపుఁ గైకొని తాపసవృత్తి నుండఁగట్టడసేసె నుర్వీశుఁ;డట్ల యుండెద; నందుకై యొండాడవలవ.” దని తెల్పుచోనంత నర్కుండు గ్రుంకె. ననుపమప్రీతిమై నా రాత్రి దీర్చి[వా.రా. సర్గ 105-107] మఱునాఁడు సంధ్యాసమాధులొనర్చి మఱి వసిష్ఠాదులు మంత్రివర్గములు విశదంబుగాఁబరివేష్టించి కొలువఁ గుశపీఠమున రఘుకుంజరుఁడుండె. నా సభామధ్యంబునందుండి భరతుఁ డా సమయంబున హస్తముల్ మొగిచి: “దేవ! మీ యానతి తెఱఁగున నీతి భావించి పితృవాక్యపద్ధతిఁ బుడమిఁ గైకొంటి; నా భువిఁగడపట యేను మీకిత్తు; నిందు కేమియు ననవలదు. సర్వసర్వంసహా చక్రభారంబుఁ బర్వి తాల్పఁగ ఫణిపతి యోపుఁగాని యసల డింభకజలవ్యాళ మెట్లోపు? వసుధేశ! యే నట్టివాఁడ, బాలుండ; నీ ధారుణీభార మేడ? నేనేడ? సాధురక్షణ మేడ? చర్చించిచూడ! బాలార్కుచే నొప్పుప్రథమాద్రియందుఁ బోలింప మిణుఁగురుఁ బురువున్నయట్లు శ్రీనిధి! నీ వుండు సింహాసనమున నేనుండఁగనుపట్టునే? భూమిప్రజకుఁ గావున మౌనిలక్షణములు మాని నీ వయోధ్యకు వచ్చి 570నీతిచే హెచ్చి. యెల్లవారలకోర్కు లీడేర రాజ్య మెల్లఁబాలింపు; మిం కేమియు ననకు. మొనర నీ వటు సేయ నొల్లవైతేని విను మేను నీ571మీఁద విడుతుఁబ్రాణములు. కాకున్న సౌమిత్రి572గతి నిన్నుఁగొలిచి కాకుత్స్థతిలక! యిక్కడ నుండువాఁడ.” నని దర్భశయనుఁడై యటు లేవకున్న యనుజన్మునెత్తి యిట్లనియె రాఘవుఁడు: “ఇదియేమి భరత! నీ విట్లాడఁదగునె? 573పదునాల్గువర్షముల్ పరికింప నెంత? యిదె తీర్చి వచ్చెద; నిందుకై మనము తుదిఁదండ్రివాక్యంబు ద్రోయంగఁదగునె? 574దశరథేశునకు మీ తల్లిని మున్ను విశదంబుగా నిచ్చువేళ మీ తాత: “నా కూఁతునకుఁగల్గునందను నఖిల భూకాంతుఁగా నీవు పూన్పుమీ.”యనుచు నమ్మిక వడసి వెన్కను బెండ్లిసేసె నమ్మాటపట్టున; నమరదైతేయ యుద్ధంబులో విభుండొసగినవరము బుద్ధిఁదప్పక కైక575 భూమీశు నడిగె. ధారుణి నీకుఁగాంతారంబు నాకుఁ గోరిన దశరథక్షోణిపాలకుఁడు సత్యంబు దప్ప కీఁజాడ గావించి నిత్యకీర్తులు గాంచి నెగడె నిందందు. మనమున మనుజేంద్రుమాట వాటించి ఘనకీర్తిసుకృతముల్ గైకొంద576 మవని. “నరుగఁడే? గయకొక్కఁడైనఁ;గన్యకను 577నరసి దానంబు సేయఁడె?యొక్కఁడైన; విడువఁడే యొకఁడైన వృషభ.”మటంచుఁ గొడుకులఁగాంచుట గోరి పితాళ్లు. ధాత్రిఁ“బున్నరకసంత్రాత”యౌకతనఁ బుత్త్రుఁడై యొప్పు; నీ పుణ్యంబులెఱిఁగి 578యేనె 579నా తండ్రి పల్కిటు సేయనైతి నేనిఁ దండ్రుల పలుకెవ్వఁడు సేయు ధర?‘యథా రాజా తథా ప్రజా’యనుచు నరులెల్ల మనయట్ల నడతురు; గాన వరబుద్ధిఁ గైకొన్న వ్రతము నిండించి యరుగుదెంచెదను; నీ వాగ్రహముడుగు నా మాట వాలింపు; నా మాటమీఁద భూమికిఁబతిగమ్ము; పురికింకఁబొమ్ము.” అనిన:“రావణుఁడింక నాజిలోఁజచ్చె.” నని నిశ్చయముసేసి యందున్న మునులు సురలు దిగ్వరులు“భాసురధర్మనిరత! భరత!రామునిమాట పాటింపు.”మనిరి. అప్పుడు జాబాలియను 580మౌనిరాముఁ దప్పక 581కనుఁగొని 582తానిట్లుపలికె:[వా.రా. సర్గ 108] “రామ! యిదేమి నిరర్థకబుద్ధి నేమించి మునివోలె నృపవేష ముడిగి రాజోపభోగ్యమౌ రాజ్యంబు విడిచి యీ జాడనుండుట కేమికారణము? ఎక్కడి తలిదండ్రు? లెక్కడి సత్య? మెక్కడి సుతధర్మ? మిదియెల్లఁ గల్ల. తలిదండ్రులొండొరుల్ దమసౌఖ్యమునకు గలయుచో శుక్లరక్తము లైక్యమొంది యోజఁబిండాకృతి నుదయించు నరుఁడు; బీజమాత్రము దండ్రిపెక్కేల యింక? నిముడక యాఱిపోయినదీపమునకుఁ జమురు వోసిన 583యట్లు సచ్చినయట్టి వారికిఁ బరలోకవైదిక కర్మ మూరక జనులు సేయుటలు వ్యర్థంబు. కావున నా మాట గైకొని రామ! నీవయోధ్యకుఁబోయి నృపుఁడవైయుండు”. మని యిట్లు జాబాలి యాడువాక్యములు విని కోపమున రఘువీరుఁడిట్లనియె: “నిట్టి నాస్తికబుద్ధి యెవ్వరికైనఁ బట్టి బోధింపు జాబాలిమునీంద్ర?[వా.రా. సర్గ 109] మాకు మాపెద్ద లే మర్యాద నడచి రాకైవడి మెలంగు టదియ సమ్మతము. సత్యమూలంబులు సకలధర్మములు; సత్యంబుకంటె నెంచఁగ ధర్మమెద్ది? యట్టిసత్యము దప్ప కనఘ! మా తండ్రి పట్టినధృతి నన్నుఁబనిచెఁగానలకుఁ. గాన యాతనియాజ్ఞఁ గడచినఁబుణ్య హీనుండు నా కంటె నితరుఁడు గలఁడె? సత్యంబు ధర్మంబు శమమును దమము నిత్యభూతి దయయు నీతి విక్రమముఁ బ్రియవాక్యమును దేవపితృ 584విప్రపూజ రయమొప్ప స్వర్గమార్గములండ్రు బుధులు. ఇవియెల్లఁ గల్లగా నీవు బోధించి; తవునవు; నీ వెట్టియగ్రజన్ముఁడవు? నిన్ననఁబనియేమి నిన్ను నాస్తికుని మన్నన 585సేసిన మా తండ్రి 586ననక?” యని రామవిభుఁడాడునట్టి వాక్యములు విని 587భీతి జాబాలి వెండియుఁబలికె: “నన్ను నాస్తికునిఁగా నరనాథచంద్ర! యెన్ని; తయోధ్య కెట్లేని విచ్చేసి భూమి588 యేలుదువనుబుద్ధి నిట్లంటి రామ!యోర్వు.”మటంచుఁబ్రార్థనసేసె. నంత వసిష్ఠసంయమి సూర్యవంశ మంతయు నిక్ష్వాకుఁడాదిగా నెన్ని[వా.రా. సర్గ 110-113] “యనఘ! మీ కులమున నగ్రజుఁడుండ ననుజుండు రాజౌట యరసిన లేదు. కావునఁబెద్దల క్రమమున నీవు భూవలయంబెల్లఁ బూనుట లెస్స. యెంతైనఁబితృవాక్యమే దాటననుచు నెంతయు నిశ్చయ మిట్టిద యేని |