ఇతిహాసములు రంగనాథరామాయణము బాలకాండము
కథారంభము: అయోధ్యా వర్ణనము
ద్వాదశయోజనవ్యాయతంబగుచు
నైదుయోజనముల నది వెడల్పగుచు[వా.రా. సర్గ 5]
నిపుణత మనువుచే నిర్మితంబగుచు
నెపుడు శాత్రవకోటి కెదురుచుక్కగుచుఁ
గొలఁదిమీఱిన భానుకులజులకెల్లఁ
గులరాజధానియై కొనియాడఁబరగి
సరయువుపొంతఁ గోసలభూమియందు
ధరణికిఁదొడ వయోధ్యాపురి యొప్పు.
మణిగోపురంబుల మణితోరణముల
మణికుట్టిమంబుల మణిగవాక్షములఁ
గేళీగృహంబులఁ గృతకశైలముల
బాలానిలంబుల 84బహువినోదముల
మహితవారణముల మానితాశ్వముల
బహురథప్రతతుల భటకదంబముల
విమలసౌధంబుల విపణిమార్గములఁ
గమనీయవనములఁ గమలాకరములఁ
జెఱువుల బావులఁ జెఱకుఁదోఁటలను
దఱచైన శాలికేదారవారములఁ
బరిఖలఁ గోటలఁబసిఁడిమాడువులఁ
గరమొప్పి లోకవిఖ్యాతమై పరగు

  1. బటహనాదముల
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )