| ఇతిహాసములు | రంగనాథరామాయణము | బాలకాండము |
|
నా పురి దశరథుండను మహారాజు చాపవిద్యాపరశైలకార్ముకుఁడు[వా.రా. సర్గ 6] చతురుపాయజ్ఞుండు షాడ్గుణ్యశాలి సతతశక్తిత్రయసంధానకర్త ధర్మోత్తరుఁడు గృతాధ్వరుఁడు శ్రీకరుఁడు ధర్మశాస్త్రపురాణతాత్పర్యపరుఁడు అజునినందనుఁడు బాల్యాదిగా నియతిఁ బ్రజలఁబాలించిన పరమపావనుఁడు జంభారికై 85పోయి శంబరాసురుని దంభంబు నడఁచి సుత్రామునిచేత మందారపుష్పదామంబుఁ గైకొన్న యిందుమతీపుత్త్రుఁడినకులాధిపుఁడు తేజంబుఁగాంతియుఁ దెగువయు 86నోర్పు రాజసంబును నుదారతయు ధైర్యంబు మొదలైన సద్గుణంబుల 87ప్రోఁక యగుచు నుదయార్కుగతిఁ దన యుగ్రతేజంబు దీపితంబై యేడుదీవులఁబర్వ భూపాలతిలకమై పొలుపొంద నేలు. నన్నరనాథు కులాంగనాజనము మున్నూట యేఁబండ్రు; ముఖ్యలై యందు నచలిత సౌశీల్య యైన కౌసల్య కుచకుంభనిర్జిత కోకయౌ కైక యనఘ చరిత్రయౌ నా సుమిత్రయును వినుతి కెక్కిరి 88ద్రయీవిద్యలో యనఁగ. నిలమీఁద నతనికి హితపురోహితులు పొలుచు వసిష్ఠాది పుణ్యసంయములు. అనఘాత్మకుఁడు ధృష్టియనువాడు విజయుఁ డనువాఁడు సిద్ధార్థుఁడనువాఁడు మఱియు నర్థసాధకుఁడు, జయంతుండు, నీతి 89తీర్థుఁడశోకుండు, ధీరవర్తనుఁడు,[వా.రా. సర్గ 7] మంత్రపాలకుఁడు, సుమంత్రుండు, ననఁగ మంత్రులు గల రెనమండ్రాతనికిని. నా మంత్రులందఱు నన్యోన్యహితులు స్వామికార్యవిచారచతురమానసులు పరమర్మభేదనోపాయధౌరేయు లరసి ప్రజారక్ష యాచరింపుదురు. అట్టివారెనమండ్రు నఖిలకార్యములుఁ బట్టున దిద్దఁదీర్పనుఁజాలి కొలువ నష్టాక్షరముల బాహాష్టకంబునను స్రష్టయై వెలయు నారాయణుకరణి దశరథుండలరె. నాతని దేశమునను గృశుఁడుఁ,గొండీఁడు, రోగియు, దరిద్రుండు, జారుండు, మఱి యనాచారుండుఁ,బుణ్య దూరుండుఁ,గ్రూరుండుఁదుచ్ఛుండు,శఠుఁడు, మందుండు, మఱిలేరు మందునకైన. నందఱు మణికుండలాద్యలంకృతులు; నందఱు ధర్మపరాయణచిత్తు; లందఱు విహితకులాచారరతులు ఈ చందమున రాజ్యమేపు దీపింప భూచక్రమెల్ల నిమ్ముల నేలి యేలి |