| ఇతిహాసములు | రంగనాథరామాయణము | బాలకాండము |
|
భూమీశ! విను: మంగభూపతిసుతుఁడు రోమపాదుఁడు గుణారూఢుండు దొల్లి తా నేలి పాలించుధరణిపై నెందు వానలు లేకున్న వగలచేఁ బొగిలి వరమునీంద్రులచేత వర్షహోమములు పరువడిఁ జేయించి పడయ 95రాకున్న భూరిశోకంబునఁబొగులుచునున్న యా రాజుఁగనుఁగొని యమ్మును లనిరి: “పరహితోన్నతుఁడు విభండకసుతుఁడు చిరపుణ్యనిధి ఋశ్యశృంగుఁడన్వాఁడు నగధైర్య!పుట్టిననాఁటనుండియును నగరరాష్ట్రముల నెన్నఁడు నెఱుంగమిని నతఁడెందు నాఁడువారను పేరెఱుంగఁ; డతఁడు దాపసవృత్తి నడవుల నుండు; వసుధేశ! యతఁడిందువచ్చినఁజాలు వెసఁబాయు నీ యనావృష్టిదోషంబు” నావుడు “మునినాథు నగరి కే రీతి రావింతు?”నని విచారము సేసి తెలిసి యనురక్తిఁగడుఁబ్రోడలగు వారసతుల వినుతయౌవనరూపవిభ్రమవతుల మనసిజమోహనమంత్ర దేవతలఁ బనిచె నొప్పెడువారిఁబ్రార్థించి యతఁడు అతివ లమ్మునియున్న యడవికిఁబోయి యతని యాశ్రమభూమి నల్లనఁగదిసి చతురనర్తనకళాసంగీతగతుల నతనికిఁదమయొప్పులర్థిఁ జూపుటయు నా పుణ్యనిధి వార లాఁడువారగుట రూపింపనేరక రుచులఁజొప్పడక యలసయానముల నీ యడవిలో నొప్ప 96మెలఁగెడు నివి వింతమృగములో కాక యనుచుండ నొక్కనాఁడతివలు ప్రీతిఁ దనుఁజేరవచ్చినఁ దప్పక చూచి చన్నులపేరడ్గి చన్నుల మీఁద నున్నహారములకు నుద్దేశమడిగి “మాకుఁగొమ్మొక్కటిమస్తకమ్మునను మీకుఁగొమ్ములు రెండు మెఱసె ఱొమ్మునను97 నే వృక్షములఁగల్గె నివి యపూర్వములు మీ వల్కలము లతిమృదులంబు లరయ; మా జటాబంధంబుమాడ్కివి గావు మీ జటాబంధముల్ మెఱుఁగులఁబొదలె; మేని బూడిదపూఁత మేల్‌తావి గొట్టు; వీనులవిందు మీ వేదనాదములు కని విని యెఱుఁగ మిక్కాననభూమి; మునులకు నీ వేషములు గలవొక్కొ? ఎక్కడిమును?”లన్న 98నింతు లా ఘనుని చిక్కుట భావించి చెలఁగి నవ్వుచును “నానుపూర్విగ శ్రుతిహారియౌ సామ గానంబు వాడి చక్కఁగఁబదక్రమము శుద్ధమార్గంబునఁజూపంగ నేర్తు; మిద్ధర మాచర్యలెఱుఁగ మీ తరమె?” యని నేర్పుమాటల నమ్మునిస్వామిఁ గనుఁబ్రామి మఱియు నక్కన్యకామణులు “ఎవ్వరితనయుఁడ?వెవ్వఁడ? వేల యివ్వనంబుననుండు? టెఱిఁగింపు”మనుడు “నడరుకీర్తులఁబుణ్యుఁడగు విభండకుని కొడుకును? ఋశ్యశృంగుండు నా పేరు; విపులమనోనిష్ఠ వెలయ నీ యడవిఁ దపము సేయుటకునై తగిలి వర్తింతు;99 వినుఁడు: మీరిచటికి విచ్చేయుకతన ననఘుండనైతిఁ గృతార్థుండనైతి.” నని 100మునులని వారి నాశ్రమంబునకుఁ గొనిపోయి ఋశ్యశృంగుఁడు పూజసేసె. నెలనాఁగ లమ్ముని యిచ్చినపూజ లలరుచుఁగైకొని యతని 101వీక్షించి “మునివర, మా వనంబునఁదెచ్చినార మనుపమఫలరాజి” యనుచు లడ్వములు నతిరసంబులు మనోహరములు నైన యతిరసంబులు102మనోహరములు మఱియు సారరసంబుల చవులగ్గలింపఁ బేరు సెప్పఁగరాని పెక్కుభక్ష్యములు నిచ్చిన నమలుచు నెడనెడఁజవులు మెచ్చుచుఁదనిసి యా మెలఁతలఁజూచి “మున్నిట్టి ఫలముల మునివరులార! యెన్నఁడు 103నెఱుఁగమ యే వనంబులను. మీ తపంబె తపంబు; మీ తపోవనమె యీ తపోవనముల కెక్కుడు తలఁప.” నని పల్క నయ్యింతు లల్లన నగుచు ననువొందఁ దనులత 104లరసోఁకఁ గదిసి తావి యూర్పులచేతఁదాలిమి దూలి పోవ నొయ్యన ముఖాంబురుహంబు 105లెత్తి పలుకులఁదళుకులఁ బాట106తేటలను బిలుపుల సొలపుల బెల్లించి యతని హృదయంబు గరఁగంగ నిఱిచన్నుఁగవలు గదియించి బిగియారఁ గౌగిళ్ల మరపి “యనఘ! పోయెద మింక నాశ్రమంబునకు” నని విభాండకుదెస నడరినభీతి107 నరిగి చేరువనుండి రావనంబునను నరవిందలోచన లరిగిన పిదప వారింక నెప్పుడు వత్తురో యనుచు నా ఋశ్యశృంగుఁడు నట నిద్రలేక యా రాత్రి వేగించి యా మఱునాఁడు నా రమణులఁ గన్న యచటి కేతేర నందియల్ మొరయంగ నసదుఁగౌఁదీగ లందంద వడఁకాడ నంచల నడల మగువలు వచ్చి యమ్మహితాత్ముఁగాంచి నగు మొగంబులతోడ 108నలువొందఁజేరి “మునివర! మా వనంబునకు రావలయు” నని పల్క రాకకు ననుమతించుటయుఁ దమవిలాసంబులఁ దమ యుపాయములఁ దమకంబు వుట్టించి తరలాక్షులంత నొనర దీమంబుల నొక వింతమృగముఁ గొనివచ్చు తెఱఁగునఁగొనివచ్చిరతని. నతఁడు సొచ్చుటయును నయ్యంగదేశ మతుల వర్షముల సస్యంబుల నొప్పె. ననఘుఁడారాజన్యుఁడాత్మజ శాంత యను కన్య నిచ్చిన నా నృపునింట నతఁడుండు; దశరథుండమ్మునిఁ దెచ్చి హితమతిఁబుత్త్రకామేష్టినాఁ బరగు[వా.రా. సర్గ 11] క్రతు వమ్మునీంద్రుచేఁ గావించెనేని సుతుల నల్వుర బహుశ్రుతుల నున్నతుల 109నాతనిచేఁగాంచునని చెప్పెఁదెలియ నా తోడఁ దొల్లి సనత్కుమారుండు. అటుగాన నీ వింక నా ఋశ్యశృంగుఁ బటుభక్తియుక్తిమైఁబ్రార్థించి తెమ్ము.” అనవుడు దశరథుం డా రోమపాద జననాథువీటికిఁజని ఋశ్యశృంగుఁ గ్రతువున కాచార్యుగా వరియించి యతులిత చతురంతయానాఢ్యుఁ జేసి యతని విరోధ్యసాధ్యకు నయోధ్యకును జతురుఁడై తోడ్తెచ్చె శాంతతోఁగూడ. వచ్చుచో దూతలవలను వీక్షించి పుచ్చి ముందర వారిఁ“బురమును నగరు వాసవపురికంటె వైభవంబెసగఁ గైసేయవలయును గడువేగ మీర” లని పల్క వారును నరిగి పౌరులకు వినుపింపఁ, జేసిరి వివిధశిల్పములు. దుందుభి శంఖాది తూర్యనాదంబు లందంద మ్రోయఁగ నంత భూపతియుఁ ముందుగా రథమెక్కి ముదము సిత్తమునఁ జెంది శాంతయు ఋశ్యశృంగుండు నడవఁ బురమున 110కేతెంచెఁ బురజనుల్ సేయు పరమ మంగళతతుల్ పరగఁగైకొనుచు. నీ రీతి నా ఋశ్యశృంగునిఁదెచ్చి భూరమణుం డంతిపురమున నునిచి వితతార్ఘ్యపాద్యాది విధులఁ బూజించి యతికృతార్థుఁడ నైతినని సంతసిల్లె. నా సమయంబున నా రాజసతులు కౌసల్యమొదలుగాఁ 111గడు వేడ్కతోడ మహితభూషణ వస్త్రమాల్యాదులిచ్చి బహువిధంబుల వారిఁబ్రార్థించి. రంతఁ గొంతకాలమునకుఁగువలయజనులు సంతోషమంద వసంతమేతేర[వా.రా. సర్గ 12] నడరెడు వేడుక నా ఋశ్యశృంగు కడకు 112భూపతి వచ్చి కడుభక్తి మ్రొక్కి “సన్నుతస్థితి నన్ను సంయమిప్రవర! చెన్నొంద జన్నంబు సేయింపవలయు.” నని విన్నవించిన “నౌఁగాక” యనుచు నినకులోత్తముఁజూచి యిట్లని పలికె: “వేగంబె తెప్పింపు విహితంబులైన యాగసంభారంబులన్నియు నధిప!” యనవుడుఁదగువారి “నయ్యైతెఱంగు లొనరింపుఁ”డనుచు నియోగించి యప్పు డఖిల సంభారంబులర్థిఁదెప్పించి మఖము సూచుటకు సుమంత్రునిఁబంపి, కేకయక్ష్మానాథుఁ గీర్తిసనాథు నా కాశిరాజు నవ్యాహతతేజు జనకాంగ రాజాది జననాథ వరుల ననఘ చరిత్రులనర్థి రప్పించి, మనుజనాయకుఁడు సుమంత్రుతో ననియె “ననఘుల వేదవేదాంగపారగుల గృహమేధులగువారిఁ గృతతంత్రభాష్య మహితార్థనిశ్చయమతుల భూసురులఁ బరగు సుయజ్ఞు జాబాలిఁగశ్యపుని సురుచిరాత్ముని వసిష్ఠుని వామదేవు రయమునఁ దోడ్కొనిరమ్ము నీ” వనినఁ బ్రియమున నాతండు వెంపార నరిగి యురుభక్తి నందఱ నొగిఁదోడితేరఁ బరువడితో నర్ఘ్యపాద్యాదులిచ్చి నిర్మలవ్రతనిధి నియతార్థమతము ధర్మార్థయుతముగాఁ దగుమాటఁబలికె: “మునులార!కొడుకులు మును నాకు లేమి మనమున నే నొక్క మతముఁజింతించి మిత్రసూక్తుల నశ్వమేధయాగమును పుత్త్రులకొఱకునై పుత్త్రకామేష్టిఁ జేయంగ నీ ఋశ్యశృంగుఁదోడ్తెచ్చి మీ యనుగ్రహముఁగామించియున్నాఁడ.” ననవుడు నా వసిష్ఠాది సంయములు జననాథుమాటకు సంతోషమంది “యినకులోత్తమ!లోకహిత మాచరింపఁ దనయులఁగోరు నీ తలఁపొప్పు నింక నశ్వంబు విడువు మీ యశ్వమేధమున విశ్వరక్షకులైన విక్రమోజ్జ్వలులు నలుగురు గొడుకులు నరనాథ! నీకుఁ గలిగెద.”రని పల్కఁగడు సంతసిల్లి113 సవనయోగ్యంబైన జవనాశ్వమరసి భువనపావనమూర్తి పూజించి నొసటఁ114 బ్రకటిత బిరుదాంక 115పట్టికఁగట్టి యొకయేఁడు దన యిచ్చ నుర్విఁజరింప సమకట్టి విడిచె నశ్వంబు రక్షింప విమతోగ్రులగు సైన్యవిభులతోఁగూడ. నంత వసిష్ఠాదులనుమతి సేయ వింతగా శిల్పకోవిదుల రావించి సరయువు నుత్తరస్థలి యాగశాల విరచింపఁగాఁబంచె వేదోక్తసరణి; మఱియు నానా దేశమనుజవల్లభుల వఱలువిప్రనృపాలవైశ్యశూద్రులను రప్పించె. నంత వర్షము పూర్ణమైన నెప్పటిమధుమాస మేతేర నృపుఁడు[వా.రా. సర్గ 13] చిరతపోనిధి ఋశ్యశృంగుసమ్మతియు గురునియానతియుఁగైకొని మంచివేళ నిహితసంభారవర్ణితహోమకుండ సహితమై యేకవింశతిరమ్యయూప మహితమై శ్రౌతధర్మక్రియాచార విహితమై మాయాప్రవీణదైతేయ రహితమై సకలా116మరహితమై యొప్పు మహనీయమగు యాగమంటపంబమర |