కల్లరినగవులఁగన్నులు దెఱచి,
యల్లనల్లనఁదప్పుటడుగులు వెట్టి,
మల్లడిగొను త్రొక్కుమాటలు నేర్చి,
యెల్లవారికిఁ జాల నింపులొనర్చి,
కొద్దిగా ముత్తెంపు గొనబువజ్రాల
మద్దికాయలడాలు మలయఁజెక్కిళ్లఁ,
బ్రాకటంబుగ ఫాలబాలేందు కళల
శ్రీకరాకృతి రావిరేకలల్లాడఁ,
బొగడొందు మగరాలపులిగోళ్లగొలుసు
జిగి డెందములయందుఁ జిందులుద్రొక్క,
నెడనెడ బలుపచ్చలే యడ్డి గలుగఁ
గడునొప్పు మొలనూళ్లగంటలు మొరయ,
మువ్వలందెలు పదంబుల రొదల్ సేయ,
నవ్వు లాటల బాల్యనటన లేర్పడఁగ,
విద్దెలు నెఱపుచు విభునిముందఱను,
ముద్దులు గులుకుచు మోహనాకృతుల
నంత నా నలువురు నభివృద్ధినొంది
సంతతపుణ్యులు సమసత్త్వు లగుచుఁ
దమలోనఁ గవగూడి దశరథాత్మజులు
రమణీయమూర్తులు రామలక్ష్మణులు
భరతశత్రుఘ్నులు పాయక పుణ్య
నిరతులై చౌలోపనీతులై ప్రీతి
1మాయావినోదముల్ మరిగి యాడుచును నా యెడ రఘురాముఁడాప్తులుఁదాను
నిండారుప్రేమతో నెట్టెలు గట్టి చెండును దండంబు చెలువొప్పఁబట్టి
తరమిడి యాడెడుతఱిని గైకేయి వరవు డా మంధర వడి నేఁగుదెంచి
చిట్టంటుచేఁతలఁజెండుఁదట్టుటయుఁ గట్టల్క రాముఁ డా కాష్ఠంబుచేత
నడిచిన నొక్క కాలప్పుడే విఱిగెఁ దడయక యందంద దమకించి రాము
నడరెడు వేడ్కతో నాడంగఁజూచి తడయక రాముపైఁదగఁగ్రూర ముంచి
విరిగినకాలితో వెసఁ గైక నగరి కరిగి తద్వృత్తాంతమంతయుఁదెలుపఁ
దరమిడి కైకేయి దశరథాధిపున కెఱిఁగింప నంతయు నెఱిఁగి భూవిభుఁడు
అలవసిష్ఠుని నయోధ్యకును రావించి వలగొని మ్రొక్కి యో వరమునిచంద్ర!
వీరికి వేదాదివిద్యలన్నియును నేరుపుఁడనుచు నా నృపుఁడప్పగింప
ననఘుఁడమ్మునినాథుఁడట్ల కావించె జననాథుతనయు లాసంయమికరుణఁ
గరిహయారోహణక్రమము లెఱింగి వరరథారోహణవైఖరుల్ దెలిసి
మాయావినోదముల్ మఱగి యాడుచును ఆ యెడ రఘురాముఁడాప్తులుఁదాను
నిండారుప్రేమతో నెట్టెలు గట్టి చెండులు దండముల్ చెలువొప్పఁబట్టి
తరమిడి యాడెడితఱిని గైకేయి వరవుఁడా మంధర వడి నేఁగుదెంచి
చిట్టంటుచేఁతల చెండు పట్టుటయుఁ గట్టల్క రాముఁడా కాష్ఠంబుచేత
నడిచిన నొక్క కాలప్పుడు విఱిఁగెఁ దడయక యప్పుడు దశరథేశ్వరుడు
నలరువసిష్ఠు నయ్యెడకు రావించి వలగొని మ్రొక్కి యో వరమునిచంద్ర!
వీరికి వేదాదివిద్యలన్నియును నేరుపుఁడనుచు నా నృపుఁడప్పగింప
ననఘుఁడమ్మునినాథుఁడట్ల కావించె జననాథతనయు లా సంయమికరుణఁ
గరిహయారోహణక్రమము లెఱింగి వరరథారోహణవైఖరి తెలిసి
యఖిలవేదంబులు.......... ..........
నఖిలవేదంబులు నఖిలశాస్త్రములు
నఖిలశస్త్రాస్త్రవిద్యలు నేర్చి. రంత
వారిలో రాముఁడవార్యశౌర్యమున
సారవివేకాది సద్గుణావళులఁ
దేజరిల్లుచు విష్ణుదేవుండు గాన
రాజిల్లె; నా దశరథుఁడును నంతఁ
|