| ఇతిహాసములు | రంగనాథరామాయణము | బాలకాండము |
|
నంతరాఘవుఁడు విశ్వామిత్రుఁజూచి సంతసంబున: “మునీశ్వర! మీరు నేఁడు[వా.రా. సర్గ 30] యాగ242దీక్ష వహింపుఁడనుమానముడిగి; యాగశత్రుల నెల్ల నడఁచెద నేను.” అనిన 243హర్షించి విశ్వామిత్రమౌని మునుల 244రప్పించి యిమ్ముల దీక్ష వడసి యాగవేదులు మునులర్థిఁ గావింప యాగాంగములు పూర్ణమై 245వేది యొప్పె. 246నంచితాజ్యాహుతు లందంద దొరుగ మించి యగ్నులుమండిమింటికిఁ బ్రాఁక; హోమాగ్నిఁ బ్రభవించు నున్నతధ్వనులు, సామాదివేద 247ప్రసంగఘోషములు, నాతత దేవతాహ్వాన రావములు, హోతలపుణ్యమంత్రోరునాదములు దిక్కులెల్లను నిండి తివిఱి ఘోషింప; నక్కజంబై యాగమటు చెల్లుచుండ రామచంద్రుఁడు ధనుర్ధరుఁడు 248దానగుచు సౌమిత్రియును దాను జాగరూకతను రక్కసుల్ వచ్చుమార్గము మున్నె యెఱిఁగి యక్కౌశికుని మౌనియై యున్నవాని విశ్వమంతయుఁదమోవృతము గాకుండ శశ్వత్ప్రభలఁ గాచుచంద్రార్కు లనఁగఁ గాచిరి కంటికిఁ గనుఱెప్ప కరణి నేచినభక్తి నయ్యెడ నైదునాళ్లు 249అలుకమైఁగవగూడి యా మఱునాఁడు బలిమి మారీచ సుబాహు లేతెంచి మేలిఖడ్గద్యుతుల్ మెఱుఁగులు గాఁగఁ గ్రాలు కాలాంబుదోత్కరములో యనఁగ బలములుఁదారు నుద్భటవృత్తి మింట నిలిచి గర్జనములు నిగుడిచి మించి వదలక యయ్యజ్ఞ వాటంబులోన మదమున నుప్పొంగి మాంసరక్తములు గురియుచో హోతలకోలాహలంబు గరిమ సదస్యుల కలకలధ్వనియుఁ, బరిచారకుల దీనభాషణధ్వనియుఁ బరికించి విని రామ250భద్రుండు251వొంగి; “లక్ష్మణ! చూడు నా లా.”వంచు విజయ లక్ష్మీధనుర్ఘోష 252లక్షణం బెసగ నెలకొని వినువీధి నిజదృష్టి నిలిపి బలువిడి వాయవ్యబాణ మేయుటయు నురువడి మారీచు 253నువ్వెత్తుగాఁగ సరభసవృత్తిమై శతయోజనములు గొనిపోయి యఱిముఱిఁగ్రూరరాక్షసుని వనధిలోపలఁ బాఱవైచె నాశరము; అడరి వజ్రమునకు నలికి యంభోధిఁ బడిన మైనాకమై 254పడినయయ్యసుర యొకరీతి దరిఁజేరి యుగ్రాంశుకులుని యకలంకవిక్రమం బందంద పొగడి దనుజులఁబాసి యాతత నిష్ఠతోడ ననయంబు నాసుచంద్రాశ్రమభూమి శూరత విడిచి యాసురవృత్తి నడిచి ఘోర 255తపంబుఁగైకొని సేయుచుండె. నఱిముఱి రఘురాముఁడగ్నిబాణమున నుఱక సుబాహుని నురమేసి చంపెఁ. దక్కిన రాక్షస దళముల నొకటఁ జక్కాడె 256మానవశరమహత్త్వమున. సురలు మోదించి యచ్చోఁబుష్పవృష్టిఁ గురిసిరి; మునికోటిగొనియాడె 257నతని. నతినిష్ఠ వెలయ విశ్వామిత్రమౌని గ్రతుకర్మమంతయుఁ గడతేర్చి వచ్చి “నెలకొని రఘురామ, నీ 258ప్రసాదమునఁ 259గలఁగక చెల్లింపఁగంటి 260నీ క్రతువు 261నతికృతార్థుఁడనైతి.” నని కౌఁగిలించి 262యతని దీవించి సంయమియు 263హర్షించె264 మఱునాఁడు రామలక్ష్మణు లిరువురును నఱలేనిమైత్రి విశ్వామిత్రుఁజూచి265[వా.రా. సర్గ 31] “యింక నెయ్యదికార్యమెఱిఁగింపు;266నీకు గింకరులము; నీదు కృపకుఁబాత్రులము.’ అనిన నచ్చటిమౌనులందఱు గాధి తనయు మున్నిడికొని తా మిట్టులనిరి: |