| ఇతిహాసములు | రంగనాథరామాయణము | బాలకాండము |
|
చనిచని గౌతమాశ్రమము రాఘవుఁడు గనుఁగొని పలికె నా గాధినందనుని: “సమధిక మిట్టియాశ్రమభూమి సకల రమణీయమయ్యు నిర్జనమేటి కయ్యె? మున్నిందుఁదపమున్న మునివరుఁడెవ్వఁ? డన్నియు నెఱిఁగింపు.”మనిన నిట్లనియె: “గౌతముఁడిక్కడ గడువేడ్కఁదొల్లి యాతతనిష్ఠ నహల్యతోఁ గూడి యతిఘోరతపముసేయఁగ నింద్రుఁడెఱిఁగి యతని తపంబుఁదానంతయుఁజెఱుప మనమునఁజింతించి మఱియొక్కనాఁడు ముని నిజానుష్ఠానమునకుఁబోవుటయు గౌతమాకారంబుఁ గైకొని వచ్చి యాతనిసతి నహల్యాదేవిఁగదిసి: “ఋతుకాలమనరు కోరికగలవారు; మతిఁదలంపఁగఁబ్రొద్దు మఱిచాలఁగలదు; పొలఁతుక!ఋతుకాలమునఁగ్రీడసలుప వలయుటఁదలపోసి వచ్చితి.”ననిన నెఱిఁగి యహల్య:“నీ వింద్రుండవగుట యెఁఱుగుదు;నౌఁగాక;యిందుర.”మ్మనుచు జలజాక్షి 467తమపర్ణశాలలోపలికి బలభేదిఁగొనిపోయి పరగఁగ్రీడించె. సురనాథుఁడంతట స్రుక్కుచు భీతి నరుగుచో గౌతముఁడంతలో వచ్చి: “యోరి పాపాత్మక! యుచితమే నీకు నారూపు గైకొని నా పత్నిఁగవయ? నీ పాపఫలమున 468నీవు నిష్ఫలుఁడ వైపొమ్ము;పొ.”మ్మని469యటశపించుటయు గౌతమశాపమఖండమై 470తాఁకి యాతని వృషణంబు 471లవనిపైఁబడియె. నడరి గౌతముఁడహల్యాదేవిఁజూచి: “పడఁతి పాషాణరూపముఁదాల్చి యిచట కరముగ్రమగు నెండఁగాలి, పెంధూళిఁ బొరలుచుండుము నీవు పొడగానఁబడక.’ యనిన: శాపమునకెయ్యది తుది నాకు?” ననిన నహల్యకిట్లనియె గౌతముఁడు: “వైకుంఠధాముఁ డవాప్తకాముండు లోకరక్షణకళాలోల మానసుఁడు రాముఁడై వచ్చి పురాణపూరుషుఁడు భూమిపై జనియించి పొగడు దీపింపఁ జనుదెంచి కౌశికుజన్నంబుఁగాచు; నినకులాధీశ్వరుఁ డీ త్రోవ వచ్చి తొలఁగిపోవక నిన్నుఁద్రొక్కినఁజాలు, జలజలోచన! నీదు శాపంబు దీఱు.” నని చెప్పి శీతాద్రికరిగె గౌతముఁడు; మునిపత్ని ఱా రూపమున నుండె.నంత: సురరాజు దనపాటు సురలతోఁదెలుపఁ దరమిడి పితృదేవతల వారు వేఁడి[వా.రా. సర్గ 49] వెరవరులై మేషవృషణముల్ దెచ్చి సురలు సంధించిరి సురలోకపతికి. నతులపుణ్యాత్మకులది యాదిగాఁగఁ గ్రతువులఁ472జంపరు కడఁగి మేషముల. నాఁడాదిగా మునినాథుశాపమునఁ బోఁడిమిసెడి యా తపోవని నున్న యా యహల్య నతుల్య హతమనశ్శల్యఁ జేయవే శ్రీరామ! శ్రితపుణ్య 473నామ!” యని చెప్పి గౌతమునాశ్రమంబునకుఁ జనుదేర శ్రీరాముచరణముల్ సోఁక మొగులెల్ల విరియ సోమునికళవోలెఁ బొగ యడంగిన హవ్యభుక్కీలవోలెఁ గలఁకదొలంగిన కమలినివోలె బలు474మసటుడిగిన బంగారువోలె శ్రీరామపాద రాజీవపరాగ దూరీకృతాఘసందోహయై యపుడు వెలఁది యంతట శిలావేషంబు మాని తిలకించి తనతొంటిదేహంబుఁబూని మునిపతిచేత రామునిమహత్త్వంబు వినినదిగాన యా వేదండయాన యా మహామహునకు నాతిథ్య మొసగి: “శ్రీమీఱ నిటకు విచ్చేసితి గాన చరితార్థనైతి నీ చరణపద్మములు దరిసించి శ్రీరామ! త్రైలోక్యనాథ!! మీ పాదతీర్థమౌ మిన్నేఱు భువన పాపంబు లెడఁబాపఁబాల్పడె ననఁగ నిలయెల్లఁగొలిచి మిన్నెక్కటి గెలిచి బలిమెట్టి బ్రహ్మాండభాండముల్ ముట్టి వేదశిరోవీథి విహరించునీదు పాదముల్ నాదు475శాపముఁబాపుటరుదె!” యని రాము వినుతించె. నంత గౌతముఁడు సనుదెంచి రఘురామచంద్రుఁ476బూజించి ప్రాకటజన్మసాఫల్య నహల్యఁ గైకొని తొల్లింటిగతి విలసిల్లెఁ; గ్రొవ్విరిజడివాన కుంభినిఁ గురిసె; నవ్వేళ దివ్యతూర్యంబులు మొరసె. |