| ఇతిహాసములు | రంగనాథరామాయణము | బాలకాండము |
|
ననురాగ ముప్పొంగ నమ్మఱునాఁడు ఘనశుభగ్రహదృష్టి గలుగుటఁజేసి పనివడి యుత్తరఫల్గునియందు జనకుండు లగ్ననిశ్చయము గావించి పురమును దనయంతిపురముఁగైసేయఁ బరిచారకుల వేగఁ బంచిన వారు గంధకస్తూరికా కలితాంబుపూర గంధిలసకలమార్గ ధరాతలంబు చీని చీనాంబర శ్రేణీ వితాన నానామణీతోరణ ధ్వజాంచితము ఫలభారనమ్రరంభాస్తంభపూగ కలితప్రతిద్వార కక్ష్యాంతరంబు సాంకవలిప్తవిస్తార వితర్ది కాంకిత రంగవల్ల్యాదిశోభితము మణిశాతకుంభకుంభవితర్కి తార్క గణసౌధగోపురోత్కరశిరోగ్రంబు దీపితమాణిక్య దీపసాంబ్రాణి ధూపపుష్పకలాపధూర్వహాపణము నై పుర 622మెల్లెడ నలరఁ గైసేసి నైపుణి మెఱసి యంతఃపురంబంతఁ గరమొప్పఁ గైసేసి “కల్యాణవేది విరచింపుఁ”డన శిల్పవేదు లెంతయును. బచ్చఱాజగతిపైఁ బసిఁడికంబములు మెచ్చురా నిల్పి యా మీఁద నీలంపు బోదెలు గురువిందములదూలములును బాదుగా నిడి తీరు పడుచెక్కడంపు గోమేదికంబుల కొణిగలు బవిరి గా మల్చి623వజ్రాలగార యొసంగి (యునొనగి?) హాటకమణిమయాయతకవాటముల వాటంబుగా నాల్గువాకిం డ్లమర్చి యందుల624బంగరు హరువుచిత్తరువు లందంబుగాఁదీర్చి హరినీలకరుల గమిఁగమిచినపటికంపు సింగముల గమకమౌ సోపాన గతులేర్పఱించి కలితలా 625మజ్జకకాయమానములఁ గలువడంబులు డంబుగాఁజుట్టుఁగట్టి యా లోన నేకాండమౌబలుపచ్చ మేలిపెండ్లియరంగు మృగనాభి నలికి ముత్తెంపునిగ్గుల మ్రుగ్గు లేర్పఱిచి చిత్తజ జనకలక్ష్మీవివాహంబు గుజరాతికెంపుల గోడ లిఖింపఁ బ్రజలకుఁ గన్నులపండువై యొప్పె. నంత వసిష్ఠవిశ్వామిత్రమునుల సంతతపుణ్యుల జనకుండు సూచి: “మీర లయోధ్యకు మిథిలకుఁగర్త; లే రూప ముచితమై యిటమీఁదఁజెల్లు నది సేయుదురుగాక.”యనవుడు వారు సదురొప్ప దశరథజననాథచంద్రు నాయతశుభ626యుక్తి నాభ్యుదయికముఁ జేయింప నర్థితోఁజేసి యా విభుఁడు ఎక్కుడుసంతోష మెసగఁజిత్తమున నొక్కొక్కసుతున కభ్యుదయంబుకొఱకు వెలయంగ నన్నూఱు వేల యా లెక్కఁ గలయఁబదాఱు లక్షల ధేనువులను గలధౌతఖురములుఁ గనకశృంగములుఁ దలకొని చెలువొందు తామ్ర627పుచ్ఛములు దొరసిమించిన కాంస్యదోహనంబులును వరుస వేష్టించిన వరవస్త్రములును గలిగి సవత్సలై కరమొప్పువాని లలి భూసురోత్తములకు భక్తి నిచ్చి మఱియు నసంఖ్యాతమహితహేమములు తఱచుగా628నంతట దక్షిణ లొసగి భూదాన 629వసుదానములు మొదలైన వేదోక్తదానముల్ వేర్వేరనొసగెఁ. దదవసరమున యుధాజిత్తు ప్రేమ తుదమీఱఁగా భరతుని మేనమామ[వా.రా. సర్గ 73] తనతండ్రి కేకయ ధరణీశ్వరుండు మనుమని భరతుని మైత్రిఁ630దోడ్తేరఁ దనుఁబంపఁగా నయోధ్యకు వచ్చి యచట దనయులపెండ్లికై దశరథేశ్వరుఁడు జనకునివీటికిఁజనుట యెఱింగి యనురక్తి631వేవేగ నచటి కేతేర దశరథుండతని నాదరణఁబూజించి కుశలంబులెల్లఁ బేర్కొనుచుండె. నంత, మఱునాఁడు స్నాతకమహితకృత్యములు తఱితోడఁగావించి తమ్ములుఁదాను రాముఁడత్తఱి దశరథునొద్ద నిలువ శ్రీమీఱనతనిఁ632గైసేయించె నృపుఁడు: నా రామునౌఁదల నమరెఁ గిరీట మారోహణాద్రిశృంగాగ్రమో యనఁగ; బద్ధకంకణుఁడయ్యె భక్తులఁ బ్రోవ సిద్ధమన్నట్లు దాల్చెను గంకణమ్ము; లెద మున్నువుట్టిన యిందుదీధితులు పొదలె నేఁడన హారములు సెన్నుమీఱెఁ దన కనకాంబరత్వము భూమిఁదెల్పె ననఁ గనకాంబరం బలరారెఁగటిని; 633గష్టరావణునిచే634గాసిల్లినట్టి యష్టదిక్పాలుర యశము లిర్వంక మౌక్తికచ్ఛలమున మనవులు దెల్పు యుక్తిమైఁజౌకట్టు లొప్పె వీనులను; వదనశృంగార మీ వైఖరి 635నొప్పు పొదలినఁగస్తూరిబొట్టు సూపట్టెఁ.. బదపడి లక్ష్మణభరతశత్రుఘ్ను లుదయార్క తేజు లొండొరులు వేర్వేర కుండలకేయూర కోటీర హార మండనావళి సుకుమార దేహములు గైసేయ నందు దిక్పాలమధ్యమున వాసవుండన రామవసుధేశుఁడొప్పె. నంత, నిక్కడ జనకావనినేత కాంతిమై నలువురు కన్యకామణులఁ గైసేయ సైరంధ్రికలఁబంప వారు భాసురమణిపీఠిపై వారి నునిచి పేరఁటాం636డ్రొగిఁబాడు పెండ్లిపాటలకు శారికాకీరముల్ సందడి సేయఁ గుంకుమ కస్తూరి గోరోచనంబు సంకుమదంబు వాసన గదంబింప నలుగురి కొక్కట నలుఁగులు వెట్టి కలమృదుధ్వనులఁగంకణములు మొరయఁ గురుల637సంపెఁగనూనె గూర్చి, యిం638పొంద హరిచందనంబున నటకలి వెట్టి, ఘనసార సురభి 639నఖంపచాంబువుల జనకపుత్త్రికలకు జలకముల్ 640దీర్చి, జిలుఁగులఁదడియొత్తి,చెంగావివన్నె చలువపావడలపై జాళువా 641సరిగ కొంగుల నొప్పుదుకూలముల్ గట్టి, శృంగారములు గుప్పసేసిరో యనఁగ గొప్పగా642నొప్పుగాఁ గొప్పులమర్చి, విప్పుగా జాజిక్రొవ్విరు లందుఁదుఱిమి, పచ్చకప్పురముతోఁ బన్నీటితోడఁ బచ్చికస్తురికలపము గూర్చి యలఁది, బంగారు సరిగ గన్పడుకుట్టుపనుల కంగులఱైకలు గనుపట్టఁదొడిగి,643 చనుకట్లమీఁదఁ బచ్చలబన్నసరము లును దారహారంబులును బొందుపఱిచి,644 ముద్దుమోము645ల కొక్కమురువు646రా గోర 647దిద్దుచుఁగర్పూరతిలకముల్ దీర్చి, చెక్కుల మకరికల్ సిత్రించి, గొప్ప ముక్కఱల్ నాసాగ్రములఁగీలుకొల్పి,648 మగఱాలతళుకుఁగమ్మలును గట్టాణి 649బొగడలుఁజుఱుకుఁగెంపులబవిరలును బచ్చ650లకడియముల్ పద్మరాగములు గ్రుచ్చిన651మొలనూళ్లు గోమేదకముల యందియల్ మొదలైన 652హారిభూషణము లందంబుగాఁజేర్పనపుడు కన్నియలు శారదపూర్ణిమా653చంద్రబింబములొ, చారువసంతవాసర పుష్పలతలొ,654 సానలఁ655దీఱిన జాతిరత్నములొ, శ్రీనిండఁబటిక నార్చినకుందనంపుఁ 656గమ్ములో,మఱి పులుగడిగిన ముత్తి యమ్ములో, నెఱతావియలరుగంధంపుఁ గొమ్మలో యనఁ బెండ్లికూఁతులొప్పారి ‘రమ్మక్క’యని సతు657లక్కజంబంద. వారిలో సీత లావణ్యవిఖ్యాత సారగుణోపేత జగదేకమాత యాదిమలక్ష్మి దానై పుట్టెఁగాన యా దేవి చెలువ మింతంతని తెలిసి భూషింప శక్యమే భూషణంబులకు భూషణంబై658యొప్పె భూదేవికరణి 659మెఱసి రత్నాకరమేఖల యగుచు, మఱి గంధవతి వసుమతియుఁదా నగుచు. నంత వసిష్ఠసంయమి లగ్నసమయ మంతయు జనకుని నరసి యేతెంచి దశరథుతోడ నంతయుఁదెల్ప నతఁడు కుశికపుత్త్ర వసిష్ఠగురులతోఁ గదలి యమరేంద్రవిభవుఁడై యర్హయానములఁ గొమరొప్పఁగైసేసి కొడుకులు నడవ, 660సంగడిఁగొల్చి రాజన్యులు నడవ, శృంగార మలవడఁజెలువలు నడవఁ, గ్రంతలుగొని పుణ్యకాంతలు నడవ, నంతంతఁబొగడుచు నర్థులు నడవఁ; 661గైసేసి గణికా నికాయముల్ నడవఁ, 662గైసేసి మంత్రివర్గంబుతో నడవఁ, గైసేసి మదమత్తగజములు నడవఁ గైసేసి భటతురంగమకోటి నడవ, వేదనాదములతో విప్రులు నడవ, మోదంబుతో మునిముఖ్యులు నడవ, నడచి యజ్జనకుని నగ రొప్పఁజొచ్చి పుడమిఱేఁడప్పుడు పుత్త్రులుఁదాను వనజలోచనలు నివాళిక లొసగ జనకుఁడెదుర్కొన 663సంభ్రమంబెసగ ఖచితోరు నవరత్న కల్యాణవేది నుచితపీఠంబుల నున్నచోఁబ్రీతిఁ; దన పురోహితులతోఁదడయక 664జనకుఁ డనలుఁబ్రతిష్ఠించి హైమవేదికల వేదోక్త665గతి హోమవిధులాచరించి యా దేవకన్యకలననొప్పు 666తనదు 667కన్యకామణుల నగణ్యలావణ్య మాన్యల నలువుర మైత్రి రావించి జనకుండు మధుపర్కసమయంబుఁదీర్చి తన కూర్మిపుత్త్రి సౌదామనీగాత్రిఁ గామినీజనమణిఁ668గల్యాణి సీతఁ గోమలిఁదెరమఱుంగున వేడ్క నిలిపి రామాభిరాముఁడౌ రామచంద్రునకుఁ గామితసిద్ధి సంకల్పపూర్వముగ: “శ్రీరామ! నా పుత్త్రి సీత సద్ధర్మ చారిణిఁగొను మగ్నిసాక్షిగా.”ననుచు ధారవోసెను దేవతాపుష్పవృష్టి ధారతో దివ్యవాద్యధ్వనుల్ మీఱ. నంతట సుముహూర్తమని తెర దీయఁ గాంతనెమ్మోము మున్గనుఁ669గొని యలరె రామునికనుఁగవ రాకాసుధాంశు గోమున నలరెడు కుముదంబులనఁగ; భామచూపులు నిల్చెఁబతిపాదయుగళిఁ దామరపైఁ దేఁటితండంబు లనఁగ; నింతిలావణ్యాబ్ధి కెదురెక్కు మీన సంతానమై రామచంద్రు చూపడరె; వరుదేహకాంతిప్రవాహమధ్యమునఁ దరుణిచూపులు పద్మదళములై క్రాలె; సతిచూపుఁబతిచూపు సరసతఁజూపు రతి670రూపు, రతిమనోరమణుని671రూపు నెలసి నొండొరు 672మేను లెఱుఁగరాకుండఁ గళలంటఁ దాఁకినగతిఁ గొంతసేపు వెలసె; నంతట రఘువీర కుంజరము చెలికేలు కెందమ్మిచెలువునఁబట్టె; నొండొరుల్ పులకించి యొక్క పీఠమున నుండి హోమము సేయుచుండి.673రాపిదప: నురు వయోధన్య నా యూర్మిళాకన్యఁ గరము సంప్రీతి లక్ష్మణకుమారునకు, వలనొప్పు నా కుశధ్వజుకూఁతులందు 674నలినాయతాక్షి మాండవి భరతునకు, నత్రిజబింబాస్యయగు శ్రుతకీర్తి శత్రుఘ్నునకు నిచ్చె జనకుండు ప్రీతి; నిగమోక్తవిధిని బాణిగ్రహణములు దగిలి కావించిరి దశరథాత్మజులు; తలఁబ్రాలు వోసి రందఱు;లాజహోమ ములు దీర్చి కాంచిరి మునులదీవనలు; దివినుండి ఘోషించె దేవదుందుభులు; భువి నిండఁగురిసెను బుష్పవర్షములు; అప్పుడానందించి రఖిలదేవతలు; నప్పుడానందించి రఖిలసన్మునులు; పాడిరి గంధర్వపతు లుత్సహించి; యాడిరి సంప్రీతి నప్సరోజనులు; తెఱఁగొప్పఁబెండిలిదినములు 675నాల్గు నెఱసి యిత్తెఱఁగున నిండె; నిండుటయు నన్నిశోభనములు నన్ని వేడుకలుఁ గన్నులపండువుగాఁజూచి ప్రీతిఁ ధరణివంశాధీశు దశరథాధీశు శరధిసన్నిభశీలు జనకభూపాలు వెరవొప్ప దీవించి వేడ్క వారనుప నరిగెఁగౌశికుఁడుత్తరాచలంబునకు. ధరణీశులును దమతమదేశములకుఁ గరమర్థిఁజనిరి సత్కారముల్ వడసి.[వా.రా. సర్గ 74] యప్పుడు మిథిలేశుఁడానంద కేళి నుప్పొంగి నిజవైభవోన్నతి మెఱసి కరమర్థి బుద్ధులు గఱపి కూఁతులకు వరరత్నభూషణావళులు విచిత్ర చిత్రాంబరములు దాసీజనంబులును నేత్రోత్సవంబుగా నెమ్మితో నొసగి కరిరథహయభటగణభూషణాదు లరణంబుగాఁదన యల్లుండ్ర కిచ్చె; నా వసిష్ఠాదిసంయములకు దశర థావనీశునకు ననర్ఘ్యమాణిక్య భూషణంబు లొసగి పూజించి వినయ భాషణంబుల యుక్తపద్ధతి ననుపఁ; గొడుకులఁగోడండ్రఁగొమరొప్పఁగొనుచుఁ గడఁకతో దశరథక్ష్మాపతి గదలి యడరి యయోధ్యకు నరుగుచోఁ: ద్రోవ వడిఁబేర్చి ప్రతికూలవాయువుల్ వీచెఁ; |