| ఇతిహాసములు | రంగనాథరామాయణము | బాలకాండము |
|
దడయక దుర్నిమిత్తము లనేకములు పొడసూపె; నప్పుడు భూపతి గలఁగి : “యేలొకో మునినాథ! యిబ్భంగిఁదొడరి పోలనీ శకునముల్ పొడసూపఁజొచ్చె.” ననవుడు దశరథు ననుకంపఁజూచి యనియె వసిష్ఠసంయమి నిశ్చయించి: “యుర్వీశ! ముందఱ నొకమహాభయము పర్వి యంతటిలోన పాయు నోడకుము.’ అనుచుండ వాయువు లందంద విసరెఁ; గనుకనిఁబెంధూళి గప్పెఁ;గప్పుటయుఁ; గరులు జోదులు తురంగములు రాహుతులు విరథులై రథులు నివ్వెఱపాటు వడిరి; సేనలు నలుగడఁ జీకాకువడిరి; భానుమండలమునప్రభ మాసె; నంత: నిరువదియొక్క మాఱేచి రాజులను దరమిడి చంపినధన్యవిక్రముఁడు క్రమ్మినజడలలోఁ గాఁపున్నగంగ చెమ్మనా నుదుటఁబెంజెమ రుబ్బుచుండ, ఘోరమై మండెడుకుత్తుకవిషము క్రూరదైత్యులమీఁదఁ గోపించి యుమిసి పరమేశ్వరుఁడు దనఫాలనేత్రమునఁ బెరిగి మండుచునున్న పెనుమంటవుచ్చి తనరెండుకన్నులఁ దగఁబంచిపెట్టి కొని వచ్చుపగిదిఁగన్గొనలఁ గెంపెసగఁ, దెగి లోన మండెడు తీవ్రకోపాగ్ని యెగసి పైసుడిగొన్న యెఱమంట లనఁగ వెలసి కెంజాయల వెదసల్లుజడలు బలిసిన జూటంబు భాసిల్లుచుండఁ, దమకించి భుజలక్ష్మి దగఁబట్టియుండు విమలనాళముతోడి విరిదమ్మియనఁగఁ బరశువు మూపున భరియించి వచ్చు పరశురామునిఁజూచి భయమునఁ676బొంది రయమున దశరథరాజును మునులు భయనివారణమంత్రపరతంత్రు లగుచు ననఘులై యెదురుగా నర్ఘ్యపాద్యములు గొనిపోవ 677మునులచేఁగొని జామదగ్ని దశరథభూపాలుఁ దర్జించి త్రోచి దశరథరాముముందఱ వచ్చి నిలిచె. నిలిచిన భార్గవు నిజమూర్తిఁజూచి తలయూఁచి 678మెచ్చి సద్భక్తితో మ్రొక్కి[వా.రా. సర్గ 75] చక్కఁగట్టెదుర హస్తము లొప్ప మొగిచి యొక్కింతభయమున నున్న వీక్షించి: “నీవెంత మ్రొక్కిన నిన్ను మన్నించి పోవ:679నాతోఁబోరు భూపాల!”యనుడు “భూసురోత్తమ! కశ్యపుఁడు మొదలైన భూసురోత్తములకు భువియెల్ల నిచ్చి యతిజితేంద్రియవృత్తి నడవుల నుండు నతులతపోరాశి వగుటఁగాఁ జేసి యొనర నీ కెఱఁగుట యుచితంబుగాన మునినాథ!నీ కేను మ్రొక్కితిఁగాని వెఱచి మ్రొక్కుటగాదు; 680వెరవేది నన్ను నుఱక పోనాడుట యుచితమే నీకు?” ననవుడుఁ:“దాపసుండని నన్నుఁ681బలికి; తనిలో సహస్రబాహార్జునుఁ682దొట్టి యిరువదియొక్కమా ఱేచిరాజులను దరమిడి చంపి యీ ధరణిపైఁదొల్లి నెఱిఁదిలోదకములు నెత్తుట నొసగఁ దెఱఁగొప్ప మా పితృదేవతలెల్ల భూపాలశవములు పొలుపొంద దివికి సోపానములు సేసి సొరిదిమైఁజనిరి; 683అట్టిభార్గవరాము684ఁడౌట నన్నెఱుఁగ కిట్టేల రాముఁడై యిలఁబుట్టి తీవు? రాజన్నఁబొరిగొందు; రామ685నామకుల రాజుల సైఁతునే రణభూమి నేను? రాజ686కులుండవౌ రాముని నిన్ను నాజి మన్నింతునే? యదియునుంగాక: కరమొప్ప విలువిద్యఁగడిమిమై నేను 687హరునితోఁదొల్లి యభ్యాసంబు సేయ నాఁడు కుమారుండు నా తోడఁదొడరి పోఁడిమిసెడి యోడిపోయినఁజూచి నా పెంపు మెచ్చిన నాగకంకణుని చాపంబు విరిచిన సైఁతునే నిన్ను?” ననిన నా భార్గవుం డాడు వాక్యములు విని పల్కె రఘురామవిభుఁడు నవ్వుచును “ఏను వినోదమై యెక్కిడి తివియఁ బూనినచాప మప్పుడ688తెగెఁగాక! నా తెగ కేల పినాకివిల్ నిలుచు? నాతత భుజ689సత్త్వమట్టిది నాకు. నెసగి యుద్ధతులయి యిక్ష్వాకుకులులు పసుల బ్రాహ్మణుల690ఁజంపఁదలంపరెందు. నీ వెన్ని పలికిన నీ కవిసెల్లు; నీవు బ్రాహ్మణుఁడవు; నిను691నొంప నొల్ల; నిదె నాదు కంధర; మిదె నీదు పరశు; 692వదయత నుచితకృత్యము సేయుమింక.” ననవుడు రఘురాము నలుక దీపింపఁ గనుఁగొని పలికె భార్గవరాముఁడడరి: “భావింప నాకు నీ పలుకులు సూడ నీవు క్షత్త్రియుఁడవు; నేను బ్రాహ్మణుఁడ; నను గర్వమున్నది; యటు చూడవలదు; వినుతవిక్రమశక్తి 693వెండి చూచెదవు; వఱలు నజ్జనక భూవరునింట నీవు విఱిచినవిల్లు నీ విల్లును దొల్లి యర్మిలి నిండార నమరులు విశ్వ కర్మచే నొక్కటఁ గావింపఁబనిచి పురములు నిర్జింపఁబోయెడునాఁడు హరునకుఁదగనిచ్చిరందులో నొకటి. సురలున్నవిల్లు విష్ణునకిచ్చి పిదప హరిహరసత్త్వంబు లారయ వేఁడి సరసిజాసనుఁగానఁజని విచారించి యిరువురకెంతయు నెరవు సేయుటయు హరియు రుద్రుఁడుఁబోర నమరులుజూచి హరిశక్తి ఘనమని యందఱునెఱిఁగి యిరువుర మాన్పిరి; యీశ్వరుఁడంత సురలచిత్తస్థితిఁ జూచి యా విల్లు రయమున నా దేవరాతున కిచ్చె; జయశీలుఁడది దెచ్చి జనకున కిచ్చె; వనజోదరుండును వలనొప్ప నిచ్చెఁ దనచేతిచాప మత్తఱి ఋచికునకు; జమదగ్ని 694కతఁడిచ్చెఁజాపరాజంబు; జమదగ్ని నా కిచ్చె సదయుఁడైదీని; నెలకొని యీ విల్లు నీ వెక్కువెట్టి 695తలకొని బాణసంధానంబు సేసి కడిమి సూపక నిన్నుఁగదలనీ.”ననినఁ దడయక కోపించి దశరథాత్మజుఁడు కన్నులఁ గనదగ్నికణములు దొరుగఁ దన్నెఱుంగని జామదగ్నితో ననియె:[వా.రా. సర్గ 76] “నిరుపమభుజశక్తి నీకుఁగల్గుటయుఁ దరమిడి రాజులఁ696దఱిమి చంపుటయు నెఱుఁగుదు; నన్ను నీ వితరుని మాడ్కి వెఱవక పలికెదు 697వీరంబు మెఱసి; నీవెఱుంగవు నాదు 698నిజబాహుశక్తి; నీవెంతవాఁడవు? నీ చాప మెంత? తె.”మ్మని 699విలుదీసి700తిగిచి మోపెట్టి 701క్రమ్మఱ నత్యుగ్రకాండంబు దొడిగి: “నీ కాళ్లు దెగనేసి నీ గర్వ 702మడఁచి నీ కోప703ముడిపెద704నే.”ఁడన్నఁదలఁకి యురుబాహు గర్వంబు నుబ్బునుదూలి పరశురాముఁడు రాముఁబ్రార్థించి పలికె: “నేను గశ్యపునకు నిల యిచ్చినాఁడఁ; గాన రాత్రులు నిల్వఁగా 705నేర నిచట; ననుదినంబునుమహేంద్రాచలంబునకుఁ జనవలయుటఁజేసి చరణముల్ వలయు; నా కాళ్ల నేయక నా పాలి పుణ్య లోకమార్గంబు706లాలోకించి యేయు.” మనవుడు రఘురాముఁడాజామదగ్న్యు ఘనపుణ్యలోక 707మార్గములేసె. నంత, 708జడభావమున నున్న జమదగ్నిరాముఁ గడు నుగ్రుఁడైయున్న కాకుత్స్థరాముఁ జూచుచు నుండిరి సురసిద్ధసాధ్య ఖేచరు లద్భుతక్రీడలఁ దనరి. అంత భార్గవరాముఁడా రాముఁజూచి యంతరంగంబున నతని భావించి: “యనఘ! నీసత్త్వమే నాత్మలోఁజూచి నిను వివేకించితి; నీవు విష్ణుఁడవు; కాకుత్స్థకులదీప! కల్యాణరూప! నీకు నోడుట నాకు నిందగా దెందు; నిరుపమతరశక్తి నీ శక్తి.”యనుచు నరిగె రాముఁడు మహేంద్రాచలంబునకుఁ. బరశురామునివిల్లు ప్రార్థింప నొసగె వరుణుచేతికి రఘువర్యుఁ డా క్షణమె.[వా.రా. సర్గ 77] అప్పుడు వాయువు లనుకూల 709మగుచు నొప్పె; నుత్సాహంబు నొడవె సేనలకు; 710నరుదరుదని సుర లభినుతుల్ సేయ వరజయశ్రీఁగూడి వచ్చి రాఘవుఁడు 711తమతండ్రి దశరథధరణిపాలునకు 712నమర వసిష్ఠున కతిభక్తి మ్రొక్కె. మ్రొక్కిన దీవించి మొగిఁగౌఁగిలించి యక్కున నందంద యౌఁదలఁజేర్చి |