| ఇతిహాసములు | రంగనాథరామాయణము | కిష్కింధాకాండము |
|
ననిపల్కి హనుమంతు నతినీతిమంతు గనుఁగొని: “మనవీటఁగల కపికోటిఁ జాటించి వెడలింప సమకట్టు ప్రతినఁ బాటించి; యెడసేయఁబాడి గాదింక. మన మిప్పు డా రామమనుజేశుఁగానఁ జనవలె.” నని పల్కి సంభ్రమంబెసగఁ దరణినందనుఁడంతఁదారాదిసతుల వెరవొప్ప నప్పుడు వీడ్కొని 138వచ్చి కలయ దిక్కులనున్న కపియూధపతుల బలములఁబిలిపించి పయనంబు సేసి మేదినీభాగంబు మిన్నును దిశలు భేదిల్లఁబ్రస్థానభేరి వ్రేయించి ప్రబలకాంచనరత్నరమ్యమౌ నొక్క శిబికపై లక్ష్మణుఁజెలిమి నెక్కించి[వా.రా. సర్గ 38, 39] చామరద్వయ సితచ్ఛత్ర చిహ్నంబు లా మహాత్ముని మ్రోల నరుగనేమించి సబలుఁడై తానును సౌమిత్రి వెనుక శిబిక యొక్కటి యెక్కి చిత్రవైఖరిని ముందుగా శుభతూర్యములు బోరుకొనఁగఁ గ్రందుగా వందిమాగధనుతుల్ సెలఁగ నెడనెడఁగపినాథు లేతెంచి తన్నుఁ బొడగన నుడుగణస్ఫురితేందుపగిది సకలవానరవీరసైన్య సన్నాహ మకలంకమై యొప్ప నప్పుడు గదలి యరుదైన పేర్మితో నవని గంపింపఁ గరము139సొంపెక్కి లక్ష్మణుఁగొల్చి నడచె. నట మాల్యవంతంబునందున్న రాముఁ డట మ్రోయుకలకలంబప్పు డాలించి “యవె వచ్చెఁగపిసేన.”లని కోప ముడిగి రవితనూజునిమీఁద రాగిల్లుచుండె. నందమై మణికాంచనాంచితంబైన యాందోళికాద్వయం140బల్లంత డిగ్గి తామరసాప్తనందనుఁడు సంప్రీతి సౌమిత్రియునుఁదానుఁజనుదెంచి మ్రొక్కి యవిరళంబగు భక్తి హస్తముల్ మొగిచి యవనివల్లభున కిట్లని విన్నవించె: “దేవ! సేనలఁబిల్వ దెసలకుఁబంచి వావిరి నవి గూడివచ్చునందాఁక దండెత్తి యిట రాక తడసితిఁగాని యొండొక్క 141వెంటమైనున్నాఁడఁగాను.” అనిన నర్కజు రాముఁడతికృపాదృష్టిఁ గనుఁగొని మన్నించెఁ. గడఁకతో నంతఁ గైలాసగిరియందుఁ గనకాద్రియందు నీలాచలమునందు నిషధాద్రియందు ద్రోణాచలమునందుఁదుహినాద్రియందు శోణాచలమునందు సోమాద్రియందు (వృషభాచలమునందు వింధ్యాద్రియందు ఋషభాచలమునందు ఋక్షాద్రియందు బారియాత్రమునందుఁబ్రాగ్గిరియందు నా రత్నగిరియందు నస్తాద్రియందు, మలయాచలమునందు మంథాద్రియందు గలగొన వర్తించుఘనబాహుబలులు పవమానసూనుండు పనసుఁ డంగదుఁడు గవయుండు నీలుండు గంధమాదనుఁడు పావకాక్షుఁడు 142కాలపాశుండు గ్రధనుఁ డావేగదర్శియు నగ్గవాక్షుండు నలుఁడు మైందుఁడు మహానాథుండు దూమ్రుఁ డలఘుండు 143జంఘుండు నగ్గిరిభేది సుముఖుండు కేసరి జ్యోతిర్ముఖుండు 144విముఖుండు తారుండు 145వినతుండు గజుఁడు జాంబవంతుండును సంపాతి రంభుఁ డంబు146రాజుతనూజుఁడగు సుషేణుండు శతబలి శరభుండు సన్నాథులనఁగ నతివీరవరులు వీరాదిగాఁగపులు తమసుతుల్ దమహితుల్ దమ సహోదరులుఁ దమ చుట్టములుఁదాము దట్టమైకూడి యివి పదులివి నూఱులివి వేలు లక్ష లివి కోటు లవ్వల నివి శతకోటు లనరాక పద్మ మహాపద్మ శంఖ మనఁగఁ బర్వినసంఖ్యలన్నిటిఁగడచి యెలమిసొంపున నేల యీనినభంగిఁ జెలఁగి యే దిక్కుసూచిన వెల్లి విరిసి యేమెయిఁగొలఁదిగా కేపు దీపించి భూమియు నాకసంబును నిండఁగప్పి కర ముగ్రగతిఁగ్రాలుకాలదండముల పరుసున దీపించుబాహుదండములు 147గెడగూడి బడబాగ్ని 148కీలలువోలి వడిఁబేర్చి దివి149రాయువాలపాశములుఁ బొరిఁబొరిఁగాలాభ్రముల 150కాంతులనఁగ నురవడి151మైఁగ్రాలునుగ్రదంష్ట్రములు నలరెడు ప్రళయకాలాదిత్య బింబ ములుఁ బోలె మండెడుముఖగహ్వరములు లోలాబ్ధివిపులకల్లోలఘోషములఁ బోలి ఘోషించు నార్పులు వెల్లివిరియ బలములతోఁగూడఁబ్లవగవల్లభులు గలగొనివచ్చునగ్గలికలు సూచి యిచ్చలోపల నప్పుడిక్ష్వాకుతిలకుఁ డచ్చెరువడి చూచి హర్షించుచుండె: నా వేళ సుగ్రీవుఁడధిపతిఁజూచి: “దేవ! నా సేన లేతెంచుచందంబు[వా.రా. సర్గ 40] నవధరించితె; వీరలం దొక్కఁడొకఁడు తివిఱి నీ పనులు సాధింప నోపుదురు.” అనిచెప్పి వారల యలవులుఁబేళ్లు జననముల్ జాతులు సత్త్వసంపదలు తనువులు వర్ణముల్ దగుభోజనంబు లునుకులు దేశంబు లోలి వర్ణించి “యీ వానరాధీశు లిం దొక్కరొకరు దేవ! నీ దేవి వైదేహిఁదెచ్చెదరు. ఆనతి యి.”మ్మన్న నర్కజుఁదిగిచి భూనాథుఁడాదరంబునఁగౌఁగిలించి: “బలసంపదలయందు భానుజ! నీకుఁ దలపోయ మఱి యసాధ్యములెందు152లేవు? పూని నీ పౌరుషంబును జూచికాక యే నేల కైకొందు నిటక్రింద నిన్ను.” నని పల్కి,“వైదేహి నరసి రాఁబనుపు.” మనవుడు హర్షించి యర్కనందనుఁడు |