| ఇతిహాసములు | రంగనాథరామాయణము | కిష్కింధాకాండము |
|
ఒనర నుత్తమమైన యొకలగ్నమందు వినతుఁడన్వానరవీరు నీక్షించి: “యే వెంట నెచ్చోట నెందు నే మఱక నీవు నీ సేనలు నెఱిఁదూర్పు నడచి యా మహీతనయ నా యమునలో వెదకి యామునగిరిఁజూచి యటమీఁదఁబోయి సురనదిలోఁజూచి శోణనదంబుఁ గరమర్థి నరసి యా కౌశికి వెదకి యల సరస్వతిఁజూచి యట సింధు వరసి పొలుచుపౌండ్రవిదేహభూములు వెదకి మాలవ కోసల మాగధ బ్రహ్మ మాలాఖ్య సీమల మైథిలి నరసి జలధితీరము సూచి చని మందరాద్రి నిలయ కిరాతుల నెలవులు వెదకి తివుటమై నట యవద్వీపంబు గడచి యవల జంబూద్వీప మట దాటి మీఁదఁ జెచ్చెర నటు పోయి శిశిరాద్రి వెదకి యచ్చోటఁగాలోదమను మడుఁగరసి తనరు లోహితసముద్రము దాటిపోయి చని కూటశాల్మలిచ్ఛాయల నరసి మఱిపోయి గరుడాశ్రమంబున వెదకి వఱలుగోశృంగపర్వతము శోధించి యందలిశృంగంబులందు వర్తించు మందేహరాక్షసమండలి నరసి యట దుగ్ధసాగర మవలీలఁగడచి యట సుదర్శనమను153 నబ్ధిలో వెదకి వలనొప్ప శుద్ధార్ణవము దాటి యచట బలువైన జాతరూపశిలాద్రి యరసి యందు వేదలలతో నాసీనుఁడైన యిందువర్ణు ననంతు నీక్షించి మ్రొక్కి యొగిఁబదునాలుగు యోజనంబులకు మిగిలి యవ్వల నున్న మేరువు వెదకి యా మేరుగిరిచుట్టు నర్కుని కెఱఁగి యా మెయి వాలఖిల్యాదుల కెఱఁగి యావల నుదయాద్రియందు శోధించి రావణు నిలయ మారసి వార్తదెమ్ము. రవిలేక యంధకారము గ్రమ్ముకతన భువిమీఁద నవ్వలిభూము లేనెఱుఁగ. నివిడి నీ విటపోయి నెలలోన రమ్మ. యవమతి రాకున్న నాజ్ఞ గావింతు.” నావుడు లక్షవానరులతోఁగూడి యా వాలితమ్మున కర్కవంశ్యునకు వేవేల తెఱఁగుల వినతుఁడై కడఁగి వేవేగ వినతుండు వెడలెఁదూర్పునకు నినతనూభవుఁడంత హితశీలు నీలు హనుమంతు నంగదు నట జాంబవంతు[వా.రా. సర్గ 41, 44] గజు గంధమాదను గవయు గవాక్షు విజయుని మైందుని ద్వివిదునిఁదారుఁ దగఁబిల్చి: “మీ రింక దక్షిణంబునకుఁ దగు వానరులఁగొంచుఁదడయక పోయి యర్మిలి వింధ్యాద్రియాదిగాఁ దొడరి నర్మదయు దశార్ణనగరంబు నరసి దండకారణ్యంబుఁ దప్పక వెదకి దండిగా నవల గోదావరి నరసి వలనొప్ప నట వేత్రవతిలోనఁజూచి నెలకొని కాళింగ నిషధదేశముల నారసి కర్ణాటకాంధ్రచోళేంద్ర చేర కేరళ పాండ్యసీమలనెల్ల నరసి యమ్మలయాద్రి నరసి కావేరి నరసి యగస్త్యునియాశ్రమంబరసి యమ్మహాత్మునిఁగాంచి యతనియనుజ్ఞ నెమ్మితోఁదామ్రపర్ణీనది దాటి జలధివేలావనస్థలముల వెదకి పొలుపొందు నా హేమపురములో వెదకి యెదిరినకడఁక మహేంద్రాద్రియందు వెదకి యవ్వల నున్న విషమా154ద్రిఁగడచి యావలఁబుష్పాద్రియందు శోధించి క్రేవఁగుంజరమనుగిరిఁబరీక్షించి యచట నగస్త్యుగేహము విశ్వకర్మ రచితమై తగు నందు రమణి శోధించి యంజనానది దాటి యవ్వల మణుల రంజిల్లుఫణులచే రక్షింపఁబడిన వదలక యా భోగవతిలోనఁజొచ్చి వెదకి యవ్వలనున్న వృషభాద్రి కరిగి యందుపై గంధర్వు లప్సరల్ సురలు నుందు రాచోటుల నోడక వెదకి తలఁ155కక యరిగి వైతరణి లంఘించి పొలుచువైవస్వతుపురమున కరిగి, యందు నా సమవర్తియనుమతి వడసి పొందుగాఁబితృలోకములు గలయంగ వెదకి సీతాదేవివృత్తాంత మరసి పదిలులై నెలలోనఁబ్రతివార్త దెండు. ఆవల నంధకారావృతంబగుట దేవతలకునైనఁదీర దం దరుగ.” ననిన నా కపినాథు లందఱుఁగూడి యనుమోద రసవార్ధియందోలలాడి దిననాథతేజుఁడై దీపించు రామ జననాథుతోఁదమసత్త్వముల్ మెఱసి: |