| ఇతిహాసములు | రంగనాథరామాయణము | కిష్కింధాకాండము |
|
“జానకి నెబ్భంగి సాధించికాని మానవేశ్వర! రిత్త మగుడిరా మేము.” అని పల్క రాముఁడు హనుమంతుఁజూచి యనువుగా భావికార్యము నిశ్చయించి తన దయాదృష్టి యాతనిమీఁద నుంచి: “యనిలజ! యిందు ర.”మ్మని చేరఁబిలిచి “జనకజఁ156గనుఁగొనఁజాలుదు వీవ. యనఘ! నీచేతఁగార్యములు సిద్ధించు. నీ వంతవాఁడవు; నీ బాహుబలము భావింప నట్టిద పవమానతనయ! ఇదె నాదుముద్రిక; యిది సీతకిచ్చి సుదతిచిత్తములోనిశోకంబు మాన్చి సీతకు మా యున్నసేమంబు సెప్పి సీతసేమముఁజెప్ప శీఘ్రంబెరమ్ము!” అని ముద్రిక యొసగ ననిలనందనుఁడు తన మస్తకంబున ధరియించి మించెఁ దనరార నుదయాద్రి దనదుశృంగమున దినమణిఁదాల్చి యెంతే నొప్పుకరణి. నంత నాహనుమంతుఁడానంద మంది గంతులు వేయుచుఁగరములు మొగిచి: “యినకులాధీశ్వర! యెంతదవ్వైనఁ జని సీతయున్నెడ సాధించి వత్తు; సోమసూర్యులఁబట్టి శోధించియైన భూమియు నభము నబ్ధులు సొచ్చియైన నసమానమగు సత్త్వ మభినుతి కెక్క వసుధేశ! రావణావాసంబుఁజొత్తు; నరిగెద,”నని మ్రొక్కి యట దక్షిణమున కరిగె వాయుజుఁడంగదాదులతోడ. మఱి సుషేణునిఁజూచి మర్కటేశ్వరుఁడు “వఱల నీవొక లక్షవానరుల్ గొలువ[వా.రా. సర్గ 42] సౌరాష్ట్రదేశంబు సనఁజొచ్చి వెదకి ధీరత బాహ్లికదేశంబు నరసి శ్రీకరమైయొప్పు సింధు సౌవీర కేకయదేశముల్ కృతమతి వెదకి వలనొప్పఁబున్నాగవనములో నరసి తెలివిఁబశ్చిమవార్ధి దృష్టించి చూచి లలితమౌ నారికేళవనంబు వెదకి యలయకపోయి వజ్రాద్రి శోధించి పారియాత్రవనంబు పరికించి యచటఁ గూరిమి గంధర్వకోటులఁదెలిసి బలియు హయగ్రీవుఁబంచజనాఖ్యుఁ గలన ఖండించి శంఖంబుఁజక్రంబుఁ జక్రి యెచ్చోఁదొల్లి జతఁగాంచె నట్టి చక్రవంతంబను శైలంబు వెదకి మెలఁకువ నటువోయి మేఘాద్రి యరసి విలసిల్లునఱువదివేల సంఖ్యములు గల కాంచనాద్రులఁగలయ నీక్షించి జలజాప్తుఁడెచట నస్తము గాంచు నట్టి చరమాద్రి నీక్షించి సౌవర్ణ మరసి పురణించు వరుణునిపురమెల్ల వెదకి చరితార్థుఁడగు మేరుసావర్ణిమౌనిఁ బరికించి నెలలోనఁబ్రతివార్తదెండు. అర్కహీనము నమర్యాదంబు గాన పేర్కొన నవ్వలిపృథివి నే నెఱుఁగ.” ననిన సుషేణాదులగు మహాకపులు పనిఁబూని పోయిరి పడుమటి దెసకు. జలజాప్తసుతుఁడంత శతబలిఁబిలిచి: “నలి నీవు లక్షవానరులతోఁ గూడి[వా.రా. సర్గ 43] మొదలఁబుళిందభూములు సొచ్చిపోయి చెదరక యాసౌరసేనంబు వెదకి భరతభూములనెల్లఁ బరికించి యవన ధరణీశుదేశంబు 157తడయక వెదకి కడఁగి కాంభోజ కొంకణ భూము లరసి యెడపక యటవోయి 158హేమంత మరసి సోమాశ్రమంబులఁజొచ్చి శోధించి శ్రీమించుకాలాఖ్యశిఖరిని వెదకి యామై సుదర్శనమను నద్రి వెదకి కామించి యటువోయి కనకాద్రి వెదకి కైలాసగిరిఁజేరి కౌబేరవనము నా లోలనయన! మీ రలయక వెదకి ధనదునిపురము నాతనిసరోవరము ననుమోదభరముఁబాయక విలోకించి యందుఁగుబేరుని నడిగి క్రౌంచాద్రి యందు మీరందఱు నవనిజ నరసి చని యట మైనాకశైలంబుఁగడచి యనఘ వైఖానసంబను కొల నరసి తనరుశైలోదాఖ్యతటిని లంఘించి గొనకొని యుత్తరకురుభూము లరసి యచ్చట గంధర్వు లప్సరల్ సురలు నిచ్చలు నుందు రా నెలవుల వెదకి నిలువ కుత్తరపయోనిధి దాటిపోయి సొలయక యటమీఁద సోమాద్రి వెదకి యచట బ్రహ్మయు శివుఁడర్థి వర్తింతు రచలితగతి మీరలందుండి మరలి యొక నెలలోపల నుర్వీశుకడకుఁ బ్రకటంబుగా మీరు ప్రతివార్తదెండు.” అనవుడు శతబలి159యవనీశు వీడు కొని యుత్తరంపుదిక్కున కేఁగె. నంత- నప్పుడు రఘురాముఁడర్కజుఁజూచి: “యెప్పుడు సూచినా వీ భూములెల్ల?”[వా.రా. సర్గ 46, 47] నావిని:“వాలికి నాఁడేను వెఱచి వేవేగ యతఁడు నా వెనువెంటఁదగులఁ గలగొన గుఱుతులుగా మహియెల్ల నలుదిక్కులును జూచినాఁడ నే.”ననియె. ననిన నచ్చెరువంది యట కొంతకాల మినజానుజులు గొల్వ నినకులుఁడుండె. దగఁబూర్వపశ్చిమోత్తరముల వెదక జగతీశు పనుపునఁజన్నవానరులు ఇనరశ్ము లెందాఁక నిలమీఁదఁ బర్వు ననుపమసత్త్వులై యందాఁకఁదిరిగి నలినాక్షి నెందుఁగానక వచ్చి పతికిఁ జెలువేది ప్రతివార్త సెప్పి రందఱును. నట రామసుగ్రీవు: “లంగదముఖ్యు లిటమీఁదఁబ్రతివార్త లేమి చెప్పెదరొ! యదియేమిచందమో?”యని వారిరాక కెదురుచూచుచు నుండి రెంతయు వగచి. యంత నంగదముఖ్యులగు మహాకపులు పంతంబు లాడుచుఁబరమహర్షమున[వా.రా. సర్గ 48, 49] సంతతజవసత్త్వసంపదల్ మెఱసి మంతుకెక్కినహనుమంతుండుఁదాముఁ జెదరక రవిజుండు సెప్పినయట్ల మొదల వింధ్యాచలంబునకు నేతెంచి యందలిగుహల మహాగహనముల నందంద వైదేహి నరయుచుఁగదలి యది యాదిగా దక్షిణాశకై నడచి పొదలుపూఁబొదలందు భూజంబులందు నదులందు గిరులందు నగరంబులందు వెదకి జానకిఁగాన వెరవులే 160కలసి చింతాసమాక్రాంతచిత్తులై వార లంతంత గుమురులై యట పోయిపోయి పదియేండ్ల తన కూర్మిపట్టి యచ్చోట కదలక మెదలక కాలునిపురికిఁ బోయినఁబొగులుచుఁబుత్త్రశోకాగ్నిఁ బాయక పడి కాలి పలవించుచున్న |