| ఇతిహాసములు | రంగనాథరామాయణము | కిష్కింధాకాండము |
|
కండుమహాముని ఘనశాపవహ్ని మండి నిర్మృగము నిర్మానుషంబగుచు నుండ నీడయుఁద్రావ నుదకంబు లేక పండక జనశూన్యపథమైన యడవి చొచ్చి యెంతేనియు సొలసి లోఁదారు నచ్చోట నుదకంబు లరయుచున్నంత: నందొక్కరక్కసుం161 డడ్డమై నిలిచి: “యెందుఁబోవఁగవచ్చు నింక నాచేతఁ జావక మీ”162కంచు సంరంభ మెసగఁ ‘గో’వనియార్చినఁగుపితుఁడై యప్పు డంగదుఁడాదైత్యు నదరంట వ్రేయఁ బొంగి రక్తము వాత బొటబొట వెడల వసుధపైఁబడె. నంత వానరులెల్లఁ బొసఁగంగ నొక మహాభూజంబునీడ నలసికూర్చుండి“తోయంబు లెచ్చోటఁ 163గలవొకో” యని దప్పిగదురనున్నంత[వా.రా. సర్గ 50-52] దరమిడి యొక బిలద్వారంబు వెడలి యురువడి జలపక్షులొండొండ యెగయఁ గనుఁగొని‘యుదక మిక్కడ నుండనోపు’ నని వచ్చి బిలములో నందఱు సొచ్చి కలగొని విపులాంధకారమై తెరువు తెలియ కొండొరువుల ధృతి 164నూదికొనుచు ననుపమసత్త్వులై యట పోవఁబోవఁ గనుఁగొని నయ్యంధకారంబు విరిసి యరుదుగా జగదద్భుతాకారమైన పురమొకఁడచ్చోటఁబొడగాంచి నిలిచి పసిఁడిగోపురములుఁబసిఁడి 165మాడువులుఁ బసిఁడియట్టళ్లును బసిఁడికోటలును బసిఁడివృక్షంబులుఁబసిఁడిపూఁబొదలు బసిఁడిపర్వతములుఁబసిఁడితామరలు నై చూడ నా పురంబతిరమ్యమైనఁ జూచి యెంతేనియుఁ జోద్యంబు నొంది “ప్రకటసంపదలచేఁబరగుచుండియును నకట! నిర్మానుష్యమైన దీ పురము 166ఏలొకో? యిట్లయ్యె నీ పురం.”బనుచు నే లీల వెడలుచొప్పెఱుఁగంగ లేక చాలఁజింతిలుచు నచ్చటఁగొన్నినాళ్లు పోలఁజరించుచుఁబురమధ్యవీథి మిన్నులతో రాసి మేటియై యందు నున్నతంబైయున్న యొకమేడ గనిరి. కని దాని మీఁదికిఁగపులెల్లఁబ్రాఁకి కనిరి దపోవృత్తిఁ గడునొప్పుదాని హరిణాజినాంబర యై యొప్పుదానిఁ దరుణేందుకళఁబోలి తనరారుదాని నొకపుణ్యకాంత. నయ్యువిదకు మ్రొక్కి యకలంక చిత్తుఁడై హనుమంతుఁడనియె: “నోతన్వి! నీవెవ్వ? రొంటిమై నిచట నీ తపంబున నుండ నేమి కారణము? ఏ మహాత్మునిపుర మీ పుణ్యనగరి? మే మెన్నఁడును గాన మీ విచిత్రమ్ము.” |