| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
నని మంత్రులాడుచో నధికదర్పములు ఘనమైన లావులుఁగల దైత్యవరులుఁ బ్రళయకాలాంతక 120ప్రభులైనవారు సులభశౌర్యుఁడుఁబ్రహస్తుడుఁ నింద్రజిత్తు శతమాయుఁడును121బాహుశాలి దుర్ముఖుఁడు నతికాయుఁడును మకరాక్షుండు ఖడ్గ రోముండు వృశ్చికరోముండు సర్ప రోముండు నగ్నివర్ణుఁడు విరూపాక్షుఁ డక్షీణబలుఁడు ధూమ్రాక్షుఁడన్వాఁడు నక్షతోన్నతుఁడు యూపాక్షుఁడన్వాఁడు రమణీయబలశాలి రశ్మికేతుండు నమితవిక్రమశాలి యగ్నికేతుండు వజ్రదంష్ట్రుండనువాఁడుఁ ద్రిశిరుఁడు వజ్రదేహుఁడు బలవంతుఁడైనట్టి సుప్తఘ్నుఁడును మఱి శోణితాక్షుండుఁ బ్రాప్తశౌర్యుఁడు మహాపార్శ్వుఁడన్వాఁడు నొనరఁ గుంభుఁడు నికుంభుండు సూర్యశత్రుఁ డును నగ్నికోపనుండును మహోదరుఁడు దివ్యుల గెలిచినదేవాంతకుండు నవ్యయవిక్రముం డా నరాంతకుఁడుఁ గడు నుగ్రుఁడగు మహాకాయుఁడన్వాఁడు నడర విద్యుజ్జిహ్వుఁడనువాఁడు మఱియుఁ గంపనుండును మహాఘనుఁడకంపనుఁడుఁ బెంపారుచున్నయభేద్య 122విక్రముఁడు నాదిగాఁగల్గు మహాదైత్యవరులు నా దైత్యవల్లభునగ్రభాగమునఁ గన్నులఁగోపంబు గ్రమ్మి యొల్కంగ మిన్నులుముట్టంగ మీఱి పల్కుచును బ్రళయావసరమహాపవన123నిర్ధూత కులపర్వతము లనఁగుంభిని యద్రువ నొండొరుఁజూచుచు నుద్దండవృత్తి నొండొరు మెచ్చక యుగ్రత మెఱసి యూర్పులు నిగుడ నత్యుద్ధతి మ్రోయు సర్పంబులునుబోలె సరభసవృత్తి శూలంబు లంకించి సురియలు124బిగిచి వాలముల్ జళిపంచి వడి లౌడులెత్తి సబళంబు లమరించి చక్రముల్ ద్రిప్పి ప్రబలంబులగు ముద్గరంబులు దిగిచి పట్టెంబు లెసగించి ప్రాసముల్ ద్రిప్పి గట్టివిండ్లను గుణ125కంపంబు సేసి యుడుగక యలుఁగు లొండొంటితో రాసి మిడుఁగుర్లు మంటలు మిక్కుటంబగుచు నొండొరు విపుల కేయూరంబు లొరయ నొండొరు మకుటంబు లుగ్రత రాయ భాసుర 126మౌక్తికప్రకరముల్ సెదర రాసిన127భూషణరజములు దొరుగ సందడింపుచు మహాసంరంభ మెసగ బృందారకారితోఁబేర్చి యిట్లనిరి: “దేవగంధర్వ దైతేయకిన్నరులు దేవ! నిన్ జూడ భీతిల్లుదు 128రెపుడు; నరు లెంతవారు-వానరు లెంతవారు సురవైరి! నినుఁజూచి స్రుక్కక నిలువ నేము నాఁడొకకొంత యేమఱియుండ నా మర్కటాధముఁడట్లేఁగెఁగాక! యింక మా ముందఱ నీ లంకఁజొచ్చి శంకింప కెవ్వరు చనఁజాలువారు? వానరులనియెడు వార్త లేకుండఁ బూని నిర్జించి పెంపున మహీధవులఁ జంపి యే తెంతుము చయ్యన మమ్ముఁ బంపు దానవనాథ! పల్కు లింకేల?” యని గర్వదుర్వారులై పల్కుచున్న దనుజుల నందఱఁదప్పక చూచి |