| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
పో లంక.”కనుడు నప్పుడు చిన్నవోయి యోలిన వేఁడినిట్టూర్పులు నిగుడ మండెడికోపంబు 1042మలిపి చిత్తమున దండిగర్వము దక్కి దశకంధరుండు బలమెల్లఁబొలిసి దర్పము పేర్మిదూలి వెలువెలఁబాఱుచు విరథుఁడై నడచి పెదవులు దడుపుచు బిమ్మిటిగొనుచుఁ గదిరినభీతి గద్గదకంఠుఁడగుచుఁ జేరి యొండొరులచేతులు సఱచి బోరన నవ్వుచు భూతంబు లార్వ గురువులువాఱుచు గునిసియాడుచును గెరలి వానరకోటి గేలిసేయంగఁ గఱకెల్ల నుడిగి యొక్కరుఁడును వేగ పఱచి యా లంకలోపలఁజొచ్చు నప్పు. డటు లంకలోపలి కరిగి రావణుఁడు పటుతరంబగుచింతఁబడి తల్లడిలుచుఁ[వా.రా. సర్గ 60] బంచాననంబుచేఁబడియుఁజావునకు నించుక దప్పినయేనుఁగుపగిది, గరుడనిచేఁబడి క్రమ్మఱ బ్రదికి సురిగిపోయినదందశూకంబువోలె స్ఫీతవిద్యుత్ప్రభాభీలకీలముల నాతతబ్రహ్మదండాతిశయంబు లగు రాముబాణంబు లడరి ప్రాణముల దెగటార్చుచునికిఁజింతించి చింతించి యుడుగని వేఁడి నిట్టూర్పులఁబెల్లు వడగాలిఁ బోలె నెవ్వ1043ల నైన సుడియఁ దలకొన్న సిగ్గున ధైర్యంబు వదలి కొలువులోఁగల దైత్యకోటి నీక్షించి: “నాలావుకలిమి దానవవీరులార! నేలతోఁ1044గలయుట నేఁడువో కలిగె. సహజపరాక్రమశాలి యొక్కరుఁడు మహిమీఁదఁబుట్టె రామక్షితీశ్వరుఁడు. సొరిది యుద్ధంబుల సురసిద్ధసాధ్య గరుడ గంధర్వ రాక్షస పక్షి యక్ష కిన్నరోరగ వర కింపురుషులును నన్ను జయించు టెన్నఁడు లేకయుండ వరముఁగాంచితి బ్రహ్మవలన నే; నపుడు సరకుసేయను నరసమితి,1045వానరుల. నా మోసమెల్లను నాకుఁబైవచ్చె. నేమని చెప్పుదు నీ దురవస్థ! కోట మీ రేమఱకుండి వాకిళ్లఁ బాటించి 1046యెంతయు బలుకాపు లిడుఁడు. దురములోపలఁబ్రహస్తుఁడు మొదలైన యురువీరులందఱు నొగిఁబోరి పడిరి. మఱి యింక రామలక్ష్మణుల జయింప నెఱి బిరుదెవ్వఁడు నిజముగా నిందు! బహుసంగరాంగణ పరిణతుండైన సహజశూరుఁడు రామజనపాలుమీఁద నడవ నేర్చినయట్టి నా తమ్ముఁడైన కడిఁదివీరుఁడు కుంభకర్ణుండుగాక వినుతింప మఱియొండువీరుండు గలఁడె?” యనుచు నద్దశకంఠుఁడందఱఁజూచి: |