ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
దేవాంతక త్రిశిరు లంగదుఁ దలపడుట
ననుజుండు వడుటకు 1354నడలుచు,వాలి
తనయు1355ఁడేచుటకు నుద్దండకోపంబు
ముప్పిరిగొనఁగ నిమ్ములఁబరిఘమ్ముఁ
ద్రిప్పుచుఁబఱతెంచె దేవాంతకుండు
రవిమండలముఁబోలు రథ ముగ్రభంగి
నవని గంపింప నుద్ధతిఁదోలుకొనుచుఁ
ద్రిశిరస్కుఁడగు నగ్ని తెఱఁగున మెఱసి
త్రిశిరుండు వచ్చె నుద్దీప్తకోపమున.
నప్పు డంగదుఁడు శాఖా1356యతంబగుచు
నొప్పెడు నొక వృక్ష మురువడిఁబెఱికి
యడరంగ నార్చి దేవాంతకు వైవ
నడుమనె త్రిశిరుండు 1357నఱుముగా నేసె
నేసిన మింటికి నెగసి యంగదుఁడు
గాసిల్లి శైలవృక్షంబులు 1358మిగుల
నడరింప నపుడు దేవాంతక త్రిశిరు
1359లడఁగించి వాని నుద్ధతశక్తి మెఱసి
పరగించి రతనిపైఁబటు1360సాయకంబు
లరుదారఁగాఁజేరి యత్యుదగ్రతను.
నంతటఁబోవక యార్చుచు మఱియు
వింతగాఁబొదువుచు వేగంబు మెఱసి
యా వాలిసుతుమీఁద నధికరోషమున
దేవాంతకుఁడు వైచెఁ1361దీవ్రతఁబరిఘఁ
దరమిడి సింహనాదంబు సేయుచును
దెరలక శరవృష్టి త్రిశిరుండు గురిసె.
నురుదంతిఁ1362గొలిపి మహోదరుండేచి
పరగించె నతనిపైఁబటు తోమరంబు.
నెనసి యా మువ్వురిట్లేపు సూపుటయు
ఘనరోష మెసగ నంగదుఁడు మై వెంచి
దంభోళిక్రియ మహోదరుని యేనుంగు
కుంభస్థలము దాఁకఁ గుధరశృంగంబుఁ
గెరలి వ్రేసిన నది ఘీంకార మెసగ
నొరలి గ్రుడ్డులు వెలికుఱికి చచ్చుటయు
జయలక్ష్మి రాఘవేశ్వరుఁబొందఁగోరి
ప్రియమునఁగైసేయఁబెట్టియఁదెఱచె
ననఁగ నా కరితల యటు వ్రస్సి యొప్పె
ననుపమంబైన ముత్యంబులు సెదర.
నంతటఁ బోక దేవాంతకు వ్రేసె
దంతి దంతముఁబుచ్చి తారాసుతుండు.
అటు వ్రేటువడి వాతహతిఁజలియించు
పటుసాలవృక్షంబుపగిదిఁ దూఁగాడి
నెత్తురుఁగ్రక్కియు నెఱి సాహ1363సమునఁ
జిత్త మొక్కింతగాఁజేసి యయ్యసుర
పరిఘంబుఁగొని వ్రేసెఁ బర్వతతటము
కరణి నొప్పారు నంగదు నురస్థ్సలము.
నంగదుండును దాన నవనిపై మ్రొగ్గి
యంగముతోడ ధైర్యము సిక్కఁబట్టి
కోపించి దేవాంతకునిమీఁద నడవ
దీపితాస్త్రంబులఁద్రిశిరుండు మూఁట
నా వాలితనయుని నాత్మఁగైకొనక
లావున ఫాలస్థలము నాట నేసె.

  1. నార్చుచు
  2. నేఁచు, నేచు
  3. యుతం
  4. నజ్జుగా నేసె
  5. మీఁద
  6. లెడఁబడఁగాఁ ద్రుంచి యె (రె) ంతయు మెఱసి
  7. తోమరంబు
  8. దీపిత, దీవ్రపరిఘము
  9. బఱపి
  10. సంబుఁ- జిత్త మొక్కటి గాఁగఁ
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )