ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
హనుమదాదులు త్రిశిరః ప్రభృతులఁ జంపుట
నంత నీలుండును ననిలనందనుఁడుఁ
బంతంబుతోఁదోడుపడి రంగదునకు.
నందు నీలుండు మహాశైల మెత్తి
యందంద త్రిశిరుపై నార్చుచు వైవ
నశనిచంద1364ంబగు నస్త్రంబుఁదొడిగి
త్రిశిరుండు నగ్గిరిఁదెగ నేసె1365నపుడు.
ధీరత వాటించి దేవాంతకుండు
1366బారియై యొప్పిన పరిఘఁద్రిప్పుచును
బలియుఁడై చనుదేరఁ బవమానసూనుఁ
డలుకతో రాక్షసు నౌఁదలఁ1367జూచి
బెడిదంబుగా వెసఁబిడికిటఁబొడిచెఁ.
బొడిచిన నప్పుడు పొరిఁబొరిఁబండ్లు
డుల్లంగ నోరు బెట్టుగ1368ఁదెఱచుచును
ద్రెళ్లె దైత్యుఁడు గ్రుడ్లు తిరుగవైచుచును.
దేవత లార్చిరి దివినుండి యపుడు.
దేవాంతకునిపాటు దెఱఁగొప్పఁజూచి,
త్రిశిరుండు1369గోపించి తీవ్రత నేసె
నశనివేగాస్త్రంబు లా నీలుమీఁదఁ.
దగ వెండియును మహోదరుఁడప్పు డుగ్ర
మగునొక్క కరి నెక్కి యార్చుచు వచ్చి
కులగిరిపై వానగురియు మేఘంబు
నలవున నతనిపై నస్త్రంబు లేసె.
నా నీలుఁడును వారియస్త్రసంతతులఁ
దానెంతయును భిన్నతనుఁడయి నొచ్చి
యట మూర్ఛనొందియు నంతన తెలిసి
పటుగతితోడ నభంబున కెగసి
తరువులతోడ నుద్ధతి మీఁదికెత్తి
ధరణీధరము మహోదరుమీఁద వైచె.
వైచిన దానిచే వారణయుక్తుఁ
డై చచ్చెఁ దలవ్రస్సి యమ్మహోదరుఁడు.
ధరమీఁద నమ్మహోదరుఁడు గూలుటయుఁ
దిరమైనకడిమితోఁ ద్రిశిరుండు గినిసి
‘సరిగొందు’ నని పెక్కుశరములు1370గురిసె
నరవాయిగొనక యా హనుమంతుమీఁదఁ;
జెచ్చెరఁబర్వతశిఖరంబు విఱిచి
తెచ్చి యా పావని త్రిశిరుపై వైచె;
నది నడుమనె తుమురై రాల నేసెఁ
ద్రిదశులు వెఱఁగందఁ ద్రిశిరుండు వేర్చి;
హనుమంతుఁడును వాని యరదంబు మీఁది
కనువారఁగా దాటి యత్యుదగ్రతను
సింగంబు గజములఁజెలరేగి వ్రచ్చు
భంగి రథ్యంబులఁబటుగతి వ్రచ్చె;
నాతండుఁగినిసి యా హనుమంతుమీఁద
నాతతంబుగ శక్తి నడరించుటయును
బలుమంట లెగయంగఁ బఱతెంచు దాని
బలువడిఁబట్టి యప్పావని ద్రుంచె;
శక్తిఁద్రుంచిన భుజశక్తి వాటించి
శక్తిజిహ్వయుఁబోలు చటులాసిఁగొనుచు
నచ్చెరువైన రయంబు సొంపార
వచ్చి యా హనుమంతు వక్షంబు1371వ్రేసె;
వ్రేసిన నతఁడును వెస నఱచేత
వ్రేసె నా రాక్షసు విపుల వక్షంబు;
నటు వ్రేటు వడి తనయడిదంబు విడిచి
కుటిలరాక్షసుఁడు గ్రక్కన మూర్ఛఁబొందె.
ననిలజుండును బడ్డ యడిదంబుఁబుచ్చి
కొని బెట్టుగా నార్చెఁగుంభిని వగుల.
నా లోనఁదెప్పిరి యా త్రిశిరుండు
వాలినపిడికిట వాయుజుఁబొడిచె.
హనుమంతుఁడంత నత్యంతరోషమునఁ
దనకటంబులు వొంగ దర్ప ముప్పొంగ
రూపించి యా విశ్వరూపుమస్తకము
లేపునఁద్రుంచుసురేంద్రుచందమునఁ
జెచ్చెర దనుజుని శిరములు మూఁడు
నచ్చెరువైన యా యడిద మంకించి
తెగనేసె నా దైత్యుతీవ్రకర్మములు
దగఁ1372బుచ్చుకొని త్రుంచు దైవంబుకరణి.
దిశలు భూభాగంబు దివియు1373ఁగంపింపఁ
ద్రిశిరుండు భూస్థలిఁద్రెళ్లె; ద్రెళ్లుటయుఁ
బటురౌద్రమున మహాపార్శ్వుండు గినిసి
నిటలంబు బొమలును నెరి ముడివడఁగ
నరులనెత్తుటఁదోఁగి యాశాకరీంద్ర
కరభీకరంబును గనకచక్రముల
నురుమణిప్రభల నత్యుగ్రమై యముని
పరుషోగ్రదండంబు పాటిగాఁగలిగి
యరుణపుష్పంబుల నరుణగంధముల
నురుతరం బగుచు నయోమయంబగుచు
నుదయార్క భాసమానోజ్జ్వల1374ంబగుచు
నొదవు గదాదండ ముగ్రుఁడై తాల్చి
తనకోపశిఖి మండ దర్ప ముప్పొంగ
హనుమంతుమీఁద రయంబున నడవ
నెడ సొచ్చి యొక్క మహీధరంబెత్తి
యెడపక దైత్యుని ఋషభుండు వైచె.
నడరి యంతటిలోన నమ్మహీధరముఁ
దొడిఁబడ గదగొని తుమురుగా నడిచి
చటులత గదఁద్రిప్పి సమదుఁడై ఋషభుఁ
బటుసత్త్వమున మహాపార్శ్వుండు వైచె.
దానిచే వక్షంబు దాఁకి యా ఋషభుఁ
డూనినమూర్ఛ1375చే నొయ్యన సోలి
యా లోనఁదెలిసి మహాపార్శ్వురొమ్ము
వాలినపిడికిట వ్రయ్యఁదాటించెఁ.
దాటించుటయు గదాదండంబు విడిచి
మేటి1376సత్త్వము1377సెడి మేదినిఁబడియె.
నా గదాదండంబు నా ఋషభుండు
వేగంబె కొని యార్చి వ్రేసె నద్దైత్యు.
వ్రేసిన వజ్రంబువ్రేటునఁగొండ
తో సరియై తల తుమురుగాఁ గూలె.
నటు మహాధ్వనితో మహాపార్శ్వుఁడవనిఁ
బటు భయంకరవృత్తిఁబడుటయుఁజూచి
కరువలిచేఁదూలు కారాకు లనఁగఁ
దిరిగి దైత్యులు నలుదెసలకుఁజనిరి.
యా చందమున వారలందఱుఁబడుట
చూచినరోషవిస్ఫురణ శోభిల్ల[వా.రా. సర్గ 71]
మిడికి లోకములెల్ల:“మ్రింగెద.”ననుచుఁ
గడఁగిన క్రియ నతికాయుఁడు వేర్చి
వేయుసూర్యులభంగి వెలుఁగుచు మిగుల
నాయతం బయినట్టియరదంబు నెక్కి
తనరార సింహనాదము సెలంగించి
తన పేరు సెప్పి యుద్దండకోదండ
నిష్ఠురారావంబు నిగుడఁగాలాగ్ని
గాష్ఠంబు లడఁగింపఁ గవయుచందమునఁ
గపిసేనపై మహోగ్రంబుగాఁగవియఁ
గపులు నిశాటునాకారంబుఁజూచి
పటురౌద్రలీల నప్పటికుంభకర్ణుఁ
డిట వచ్చెనో యని యెంతయు బెదరి
కొందఱు మూర్ఛిల్లఁ, గొందఱు వెఱవఁ
గొందఱు వెఱఁగు చేకొని చూచుచుండఁ,
గొందఱు వాపోవఁ, గొందఱు 1378గలఁగఁ
గొందఱు:“రామ! చేకొను.”మని మ్రొక్కఁ,
బర్వినభీతిమైఁబఱతెంచుకపుల
నుర్వీశ్వరుం:“డోడ కోడకుఁ”డనుచుఁ
గలయ లోకంబెల్లఁగప్పి గర్జించు
ప్రళయావసర మేఘపటలంబుఁబోలె
బెడిదంబుగా 1379నార్చి పృథులవేగమున
నడతెంచుచున్న దానవనాథతనయు
నగ్గలికయు లావు నధికదర్పంబు
నగ్గతియును దవ్వులందె వీక్షించి
యనయంబు వెఱఁగంది యప్పు డా రామ
జననాథుఁ డా విభీషణుఁజూచి పలికెఁ:
“బిడుగు మ్రోసినమాడ్కిఁబెడిదంపు మ్రోఁత
యడరి వచ్చుచునున్న యరదంబుమీఁద
నింద్రచాపముతోడ నెన వచ్చునట్టి
సాంద్రప్రభాయతచాప మొప్పారఁ
బరిఘ గదా ప్రాస పట్టిస శూల
పరశు తోమర భిండిపాల చక్రాది
వరదివ్యశస్త్రనిర్వాహంబుతోడ
నరుదైన సైంహికేయ ధ్వజంబొప్ప
నలువంద నార్చుచు నలువురు సార
థులతోడ నొక వేయితురగముల్‌1380వూన్చి1381
మూడుకన్నులు గల మూర్తియుఁబోలె
వేఁడిమి దిక్కుల వెదచల్లుకొనుచుఁ
గపులఁదోలుచును నిక్కడనె చూచుచును
విపరీతగతి వచ్చు వీఁడెవ్వఁ?”డనిన:

  1. ము మీఱు
  2. నడుమ
  3. భారమై యొప్పెడు
  4. బట్టి
  5. విచ్చుకొనుచుఁ
  6. గోప ముద్దీపింప
  7. నేసె
  8. దాఁక
  9. బంచు
  10. ఘోషింప
  11. దీప్తు -లొ
  12. మై నొక్కింత నిలిచి
  13. సత్త్వంబేది
  14. దూలి
  15. వగవ
  16. ఁబేర్చి
  17. పూని
  18. యమరినరథ మెర్క్కి యధికవేగమున - సమరవిక్రమకళాచతురత గల్గి - మూఁడు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )