| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
నప్పుడు చనుదెంచి యా మేఘనాదుఁ డప్పంక్తికంఠుతో ననియె నొప్పార: “నే నీకుఁగలుగంగ 1445నిటు వగపేల? దానవాధీశ్వర! తగదు చింతింపఁ. బటుతరంబైన నా బాణసం1446హతికి నెటు సహింపఁగఁజాలు నీశ్వరుండైన? నటు చూడు రాముని నాతని తమ్ముఁ జటులాంబకముల జర్జరితులఁజేసి యసువులు వెఱికి యయ్యగచరా1447వళుల వసుమతిపైఁ గూల్చి వచ్చెదఁగడిమి. విబుధకంటక! నేఁడు వినుము నా ప్రతిన: విబుధలోకేశుండు విష్ణుండు యముఁడు శిఖియును రుద్రుండు సితకరార్కులును నఖిలసాధ్యులు బలియజ్ఞవాటమున నేచి విజృంభించునెడఁ ద్రివిక్రమునిఁ జూచినగతి నన్నుఁ జూతురుగాక!” యని 1448వాయునిభవేగమగు రథంబెక్కి దనుజేంద్రతనయుఁ డెంతయు సొంపుమీఱి నడవంగ నప్పుడు నానా1449ముఖములఁ గడువేగమున 1450నొక్క కదలుగాఁగదలి వెడలె రథంబులు; వెడలె నేనుఁగులు; వెడలె గుఱ్ఱంబులు; వెడలెఁగాల్బలము. పుండరీకంబులఁబొలుపారువారుఁ బుండరీకాక్షులఁ1451 బొలుపారువారుఁ బుండరీకచ్ఛాయఁబొలుపారువారుఁ బుండరీకోన్నతిఁబొలుపారువారు బుండరీకోగ్రతఁబొలుపారువారుఁ బుండరీకముశక్తిఁ బొలుపారువారు నప్పుడుగ్రతఁ జతురంగసైన్యముల నొప్పిరి దానవు లుగ్రా1452ననముల. నార్పులు బొబ్బలు నతులహుంకృతులు దర్పితసింహనాదస్ఫురణములు నేమీరవంబులు నిస్సాణరవము రామణీయకము1453నుగ్రంబునై 1454యమర భాసుర ధవళాతపత్ర మొప్పార నా సుధాకరుతోడియాకాశ మనఁగఁ గమలలోచనములు గ్రాల నందంద ప్రమదాజనము చామరంబులు వీవ బహుభూషణప్రభాపటలంబు వెలుఁగ సహజవైభవమహోజ్జ్వలుఁ డింద్రజిత్తు చనుదెంచి రణమహీస్థలమున నిలిచి 1455ఘనభుజుఁ డత్యంతకౌతూహలమున రక్తవస్త్రంబుల రక్తమాల్యముల రక్తగంధంబుల రాజితుండగుచు వరమంత్రముల హుతవహుఁబ్రతిష్ఠించి శరములుఁదోమర చయములు వరుసఁ బరిధులు1456సేసి యొప్పఁగ స్రుక్‌స్రువములు కరమర్థి లోహముల్‌గా సంఘటించి తనలోన నిష్ఠ యుదాత్తమై యొప్ప దనుజేంద్రతనయుఁ డధర్వణోక్తముగఁ జదురుఁడై నెయ్యి లాజలుఁదాడి సమిధ లొదవంగ వేల్చుచు హోమాంతవేళఁ గడఁగి కృష్ణచ్ఛాగకంఠ రక్తంబు నడరెడు వహ్నిఁబూర్ణాహుతి వేల్వ ననలుండు వొడసూపి హవ్యముల్ గొనియె. ననలునికరుణ బ్రహ్మాస్త్రంబు రథము ధనువును గవచంబుఁదద్దయుఁబ్రీతిఁ గొనియార్చు 1457కొనుచు దిక్కులు పెల్లగిల్ల దానవుండర్కేందుతారకాసమితి తో నభం బగలంగ దుర్దాంతుఁడగుచు రథరథ్యకేతుసారథులతో నెగసి ప్రథితవేగమున నంబరవీథి డాఁగి యగణితవిక్రముఁడై యొప్పఁబలికెఁ దగియెడుబుద్ధిగాఁ దన సేనతోడఁ: “దరలక నిలిచి యుద్ధము సేయుచుండుఁ: డురక యేనును దివినుండి ఘోరముగ రణ మొనరించి యా రామలక్ష్మణుల గణుతింప1458కింత వేగమునఁజంపెదను.” అనిన యుత్సాహవాక్యము విని1459యుబ్బి దనుజు1460లు సేనావితానంబుతోడఁ దరుచరసేన1461లఁ దాఁకి యందంద బరవసంబునఁబెక్కుభంగులఁబోర నా సమయంబున నా దానవుండు భాసురంబుగఁదన ప్రభఁగాననీక యా దివినుండి దివ్యాస్త్రంబు లేయ నా దానవునిదెస కగచరు లెగసి యగములు వైవంగ నవి ద్రుంచి గుండె లగ1462లించి పెక్కండ్ర నవనిపైఁగూల్చి వేగంబె యొక్కొక్క విషమబాణమున నేగురఁదొమ్మండ్ర నేడ్గుర నేసె. మఱియును గడిమిమై మర్కటేశ్వరులు నెఱయంగ గిరిధరణీజంబు లెత్తి యా యింద్రజిత్తుపై నడరింప నతఁడు సాయకంబుల వానిఁజతురుఁడై త్రుంచి పదునెనిమిది తీవ్రబాణంబు లేసె1463 మదమెల్లఁజెడ గంధమాదను1464ఁ;గడిమి; దీపింప నలుఁదొమ్మిదిట రూపుమాపె; నేపార మైందుని నేడింట నొంచెఁ; గదిసి పంచకమున గజుఁబొలియించెఁ; బదియింట భల్లూకపతి మేను సించె; నూఁటను హనుమంతు నొప్పించి మించె; మూఁట గవాక్షుని మొగిఁగాఁడ నేసెఁ; 1465బదుమూఁట హరిరోము ప్రాణముల్ గొనియె; నద టణంగఁగ రంభు నాఱింట నేసె; ననయంబుఁబదిట సూర్యప్రభు నొంచెఁ; బనసునియంగంబు బదుమూఁటఁగ్రుచ్చె; ఘనతరబాణాష్టకంబునఁగుముదు, నెనసి నీలుని ముప్పదేనింట ముంచె; మసలక మఱి పెక్కుమార్గణంబులను రసికత దూలఁదారాతనూభవుని, సునిశితంబైన యాశుగములు1466మూఁట దినకరతనయు, నైదిట నింద్రజాలు, గిరిభేది రెంటను, గెడపి యా ఋషభు నిరువదిశరముల నిలఁద్రెళ్ల నేసెఁ; గేసరిఁబదునాలుగిట దధిముఖుని భాసురంబగు బాణపంచకంబునను, సుముఖునిఁగ్రథనుని సొరిది నాఱింట, విముఖుని నాఱింట, ద్వివిదు నేడింట, శరభుని నేడింట, శతబలిఁబదిట, సరి నెన్మిదిట హరు, సన్నాదు మూఁట, నరుదుగాఁదక్కిన యఖిలయూధపుల వరదివ్యశస్త్రాస్త్రవర్షంబు గురిసి కడుభిన్నగాత్రులఁగావించి నేలఁ బడవైచి మఱి గతప్రాణులఁజేసి |