ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
ఖడ్గరోముఁ డాదిగా రాక్షసులు వానరవీరులతోఁ బోరి మడియుట
నప్పుడు హనుమంతుఁడసురేశుమీఁద
నుప్పొంగి కవియు నుద్యోగంబు సూచి
2221యచలనిభాకారుఁడసమసాహసుఁడు
రుచిరఖడ్గుడు ఖడ్గరోముండు గినిసి:
“యందెందుఁగడఁగెద? వం దేల నీకు?
నిందుర మ్మనిలజ! యే నున్నవాఁడ.”
ననవుడుఁగుప్పించి యతనిపై కుఱికి
తను రోమశితఖడ్గధారల మునిఁగి
యొక భంగి వెడలి మహోగ్రుఁడై నిగుడి
ప్రకటసత్త్వోన్నతిఁ బవమానసుతుఁడు
కులశైలమును బోలుకొండఁజేఁబూని
పెలుచ నార్చుచు వచ్చి పృథివి గంపింప
వానిపై నురువడి వైచె; వైచుటయు
దాని వాఁ డురురోమధారాభిహతిని
ఖండించి ప్లవగుల ఖండించికొనుచు
దండి నప్పవమానతనయుఁదాఁకుటయుఁ
బావనియును మహాపర్వతంబెత్తి
వేవేగ దానవవీరుపై వైవఁ
గులిశధారాహతిఁగూలుశైలంబు
పొలుపునఁగూలె నప్పుడు రక్కసుండు.
సర్పరోముఁడు 2222తీవ్ర2223సర్పోగ్రుఁడగుచు
దర్పించి కడఁకమైఁదాఁకి యంగదునిఁ
దనురోమసర్పసంతతుల నొప్పింప
ఘనమైనకడిమి నంగదుఁడు కోపించి
గ్రద్దన లయకాలకాలుఁడై మండి
యద్దైత్యుమస్తకం బఱచేత వ్రేయ
దనుజుని శిరమటు తద్దయుఁబగిలి
ఘనరక్తధార లొక్కటఁగ్రమ్ముచుండ
రోషాగ్ను లొలుకుచు రోమసర్పముల
భీషణాకారుఁడై పేర్చి2224యందంద
యంగదునంగంబు లదరంట నేయ
నంగదుం డధికరోషాయత్తుఁడగుచు
నసురశిరోమధ్య మతిఘోరముష్టిఁ
బసచెడఁదాటించి పడవైచి త్రొక్కి
తల ద్రుంచివైచి యుద్ధతశక్తి వాని
బలువిడి నిర్గతప్రాణుఁగావించె
భీషణరణకళాభీలు నన్నీలు
రోషించి వృశ్చికరోముండు దాఁకి
ఘన విషజ్వాల లొక్కటఁ బిక్కటిల్లఁ
దను రోమవృశ్చికతతుల నందంద
యేచి నొప్పింప సహింపక నీలుఁ
2225డాచి యద్దానవు నాత్మఁగైకొనక
విరథులై రాక్షసవీరులు పఱవ
నురుసాలతరువున నురువడి వ్రేసె.
వ్రేసిన దనుజుఁ డా వృక్షంబుఁద్రుంచె
గాసి2226ల్లి 2227విషరోమకంటకా2228గ్రములఁ.
ద్రుంచినఁగనుఁగొని తోరంపుఁగడిమి
నంచితజయశీలుఁ డా నీలుఁడలిగి
ఘోరబాహాశక్తిఁగుశలుఁడై 2229పేర్చి
భూరిశాఖల నొప్పుభూజంబు వెఱికి
కొని వచ్చి వాని వక్షోవీథి వ్రేసి
యనిమిషు లుప్పొంగ హతజీవుఁజేసె.
భగ్నారివీరుఁడభగ్న ప్రతాపుఁ
డగ్ని వర్ణుఁడు కడు నాగ్రహవృత్తి
వడి మహాటవుల దుర్వారతఁబేర్చి
కడఁగి యుగ్రత నేర్చుకార్చిచ్చుకరణి
నగణితస్ఫుటవహ్ను లంగంబులందు
నిగుడించి క్రోఁతుల నీఱుసేయుచును
బ్రళయాగ్ని యునుబోలెఁ బఱతెంచుచుండ
నలుకమై వీక్షించి యవనీశ్వరుండు
బలిముఖప్రవరులపరిభవక్రమముఁ
దిలకించి కరుణావిధేయుండుగాన
తలఁపున నోర్వక దనుజునుగ్రతకుఁ
దలయూఁచి దశకంఠుతమ్మున కనియె:
“నో విభీషణ! నాకు నూహింపఁదెలియ
దీవచ్చుచున్నవాఁ డెవ్వఁడో 2230చూడ?
నా రావణుఁడు పంప ననిసేయఁగోరి
ధీరుఁడై యనలుఁడేతెంచుచున్నాఁడొ?
వీఁడొక రాక్షసవీరుఁడో? కాక
వీఁడెవ్వఁ? డేర్పడ వివరింపు నాకు.”
ననవుడు: “దేవ! వీఁడగ్ని వర్ణుండు;
తన మేనిమంటలు దరికొనఁ జేసి.
పర్వతంబులనైన భస్మంబు సేయు;
గర్వదుర్వారుఁ, డఖండవిక్రముఁడు.”
ననిన నచ్చెరువంది యర్కవంశజుఁడు
ఘనమైన వాని యుగ్రతఁజూచి యలిగి
2231వాసవనుతుఁడంత వరుణాస్త్ర మేసె.
నేసిన నది మింట నెడ మీక నిండి
కప్పారు మేఘముల్‌ గప్పి యార్భటము
లుప్పొంగ జడివాన లుడుగక కురిసి
యల2232వేది మంటల నార్చి పెల్లార్చి
ఖలు నగ్నివర్ణు నొక్కట నేలఁగూల్చె.
నాలంబులో నప్పు డగ్నివర్ణుండు
కూలుట గనుఁగొని క్రూరుఁడై పేర్చి
కోప2233ంబు పేర్మి నక్షుల నిప్పు లురలఁ
జూపుల లయకాలసూర్యుఁడై మండి
రాముఁగనుంగొని రాక్షసేశ్వరుండు;
“రామ! న న్నెఱుఁగవే! రణమధ్యవీథిఁ
గ్రూరనిష్ఠురవజ్రఘోరదుర్వార
ధారావిదారితోద్ధతకులాచలుఁడు
దేవేంద్రుఁడుద్వృత్తి దేవసంఘముల
తో వచ్చి యెదిరినఁద్రుంతు నే నాజి.
ని న్నేల కైకొందు? నీచకాపేయ
సన్నాహమే నన్ను సాధించు 2234నింకఁ!
బదిలమై 2235మగపాఁడి పాటింతుగాక!
తుదిముట్ట నన్ను నెదుర్కొందుగాక!
త్రోచి శస్త్రాస్త్రపంక్తుల నొంతుగాక!
యేచి నీలావు నాకెఱిఁగింతుగాక!”
యనవుడు రఘురాముఁడాదురాత్మకుని
చెనఁటిమాటలు విని చిఱునవ్వు నవ్వి
గంధసింధురము ఘీంకార మాలించు
సింధురాంతకమత్తసింహంబపోలె
నూరకుండుటయు మహోగ్రుఁడై కినిసి
యా రాముతమ్ముఁడయ్యసురారిఁదాఁకి
ఘోరనారాచముల్‌ గురియఁదద్బాణ
ధారలఁద్రుంచి యాతని లెక్కగొనక
భానుపై నడచుస్వర్భానుచందమున
భానువంశాధీశుపై నప్పు డడరి
దారుణ స్ఫుటవజ్రధారానుకారి
నారాచతతుల నన్నరనాథుఁగప్పెఁ.
గప్పిన నప్పుడా కాకుత్స్థుఁడలిగి
నిప్పులు రాలెడు నిష్ఠురాస్త్రముల
నుగ్రుఁడై యేయంగ యుద్ధమద్యమున
నిగ్రహింపఁగఁజొచ్చె నెఱసి రావణుఁడు.

  1. యచలాచలాకారుఁడతి బలోన్నతుఁడు
  2. శేష
  3. సర్పాంగుఁ
  4. యద్దనుజుఁ-డ
  5. డేచి… నిచ్చ
  6. ల్ల
  7. తన
  8. స్త్ర…
  9. తివిఱి
  10. వీఁడు
  11. వలనొప్ప నురువడి వరుణాస్త్రమేసి- బలువిడి నిర్గతప్రాణుఁగావించె- నాలంబులో…
  12. వేఁడి
  13. ఘూర్ణీకృతాక్షుల
  14. నహహ
  15. మగఁటిమి
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )