| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
నా సమయంబున ననియె మాతలికి వాసవుఁడా రామవల్లభుఁజూ2236చి:[వా.రా. సర్గ 103] “దేవహితార్థమై తివిఱి రాఘవుఁడు పోవక దనుజుతోఁబోరుచున్నాఁడు; వాఁడె పదాతియై వసుధ నున్నాఁడు; వాఁడు రథస్థుఁడై వాలుచున్నాఁడు. ఎందు లోకోన్నతుండితఁడు దుఃఖముల డింది యక్కుమతికి దిగువ నున్నాడు. వేదపల్లవముల విహరించుసౌఖ్య వేది కర్కశరణవీథి నున్నాఁడు; కమలామనోరథగతుల నున్నతుల నెమకెడుసుఖి నేల నిలుచున్నవాఁడు. ఇనకులాధిపునకు నీ దివ్యరథముఁ గొనిపొమ్ము వేవేగఁగుంభిని.”కనుడు ననిలమనోవేగ మలరునశ్వముల గనకదండాబద్ధఘనకేతనముల మహనీయరుచిరోరుమణికదంబముల మహితమై బాలార్కమహిమ దీపింపఁ దనరారు రథము మాతలి2237యొప్పుమిగులఁ గొనివచ్చి వేడ్కతోఁగుంభిని నిలిపి యా రాముముందఱ హస్తముల్ మొగిచి యారూఢబలశాలియై విన్నవించె: “దేవ! రాఘవధరాధీశ! సమస్త దేవతారాధ్య! వందితభక్తసాధ్య! శరచాపకవచాదిసన్నాహరథముఁ బురుహూతుఁడిదె మీకుఁబుత్తెంచినాఁడు. కాకుత్స్థ! నీవింకఁగౌశికుపనుపుఁ గైకొని యీ వజ్రకవచంబుఁబూని యీ దివ్యరథమెక్కి యీ యాయుధముల నీ దుర్మదాంధుని నెదిరి 2238సాధింపు; మేను సారథిగాఁగ నింద్రుండు సకల దానవావళి గెల్చె ధరణీశ! తొల్లి.” యనవుడు విని రాముఁడవ్విభీషణుని యనుమతితోఁగూడ నా రథంబునకు వలగొని వచ్చి యుజ్జ్వలతనుప్రభలు పొలయంగ, నీ రేడుభువనంబు లలరఁ జదల నొక్కటఁబర్వ జయజయధ్వనులు పొదివి శాఖామృగంబులు మిన్నుముట్ట నురువడిఁగమలాప్తుఁడుదయాద్రి నెక్కు కరణి నా రథమెక్కెఁ గమలాప్తకులజుఁ. డప్పుడు నభమెల్ల నల్లాడుచుండ నుప్పతిల్లుచునుండె నొండొండ 2239నిండి శరదభ్రసంధ్యాభ్రచయసమానములు గరుడోరగామరగణవిమానములు. సరి2240చూచుసురలు ఖేచరులుఁగిన్నరులు పరమసమ్మదమును భయము ను2241ప్పొంగ “నిది పర్వతద్వంద్వ; మిది యబ్ధియుగళ మిది పావకద్వయ; మిదినభోయుగము; కదిసిపోరాడంగఁ2242గవిసెఁబో నేఁడు ఇది సమానస్కంధ; మెట్లొకో?”యనుచుఁ గంపింప జగము లాకంపింప గిరులుఁ గంపింప నిరువాగుఁ గంపింప2243ఁగడఁగి రణజయోదగ్రులై రామరావణులు రణజయవ్యగ్రులై రామరావణులు కదిసిన, దృష్టినిర్ఘాతపాతములఁ జదిసిన మెఱుఁగులు చదలిపైఁజెదరఁ జెలఁగె సేనలరెంట సింహనాదములు; గలఁగె నాకాదిలోకంబు లన్నియును. ఆ మేటి విలుకాండ్రు నన్యోన్యవిజయ కాములై రథచిత్రగతు లొప్పుమెఱయ దినకరానలకల్పదీర్ఘనిర్ఘాత ఘనశాతశరసముత్కరపరంపరలఁ గరములు గళములుఁగక్షముల్ భుజము లురములు నిటలంబు లూరులు బరులు నేసి నొప్పించుచు నిరువురుఁగదిసి త్రాసులై దొరసి విత్రాసులై బెరసి యంపకయ్యము సేయునప్పుడొండొరుల సొంపుఁబెంపును దెంపుఁజూడ నచ్చెరువు. ఫలితవిక్రమసమప్రారంభు లగుచుఁ ‘దొలఁగక చేతులు దొనలయమ్ములకుఁ జాఁచిరి, తివిచిరి, సంధించి, రేయఁ 2244బూఁచిరి, యేచిరి పొ!’మ్మంచుఁదెలియ రాకుం2245డె! నప్పు2246డా రామరావణుల భీకర2247కరశరాభీల వేగములు గణనల క్రమములుఁగడచి యందంద రణచండకోదండరవిమండలము2248లఁ బ్రేంఖచ్ఛరాంశులఁబేర్చి పుంఖాను పుంఖంబు2249లగుటయు బొంకుగావించి. బాణ బాణా సనప్రౌఢు లక్షీణ తూణీరు లేయుచోఁదొడరి యొండొరులఁ బ్రతిసేసి యొకటికిఁబదియింటి వెనుక నుతశక్తి దానికి నూఱింటివెనుక వెనుకొని దానికి వేయింటివెనుక ప2250నుగొని దానికిఁబదివేలు వెనుక యుడుగక దానికి నొక లక్ష వెనుక మడువక దానికి మఱి కోటి వెనుక నేసిన శరము మున్నేసినశరము రాసిన యొక్కట దాఁకు రామరావణుల. |