| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
ననవుడు విని లక్ష్మణాగ్రజుండతని వినయనయజ్ఞానవిశ్వాసభక్తి భావశుద్ధుల కాత్మఁబలుమాఱు మెచ్చి దేవత లుప్పొంగ దివిజారి గ్రుంగఁ గ్రుంగనిధర్మంబు గొనలుసాగంగ గంగాదినదులెల్లఁ గలఁకదేరంగఁ దేరనిచిత్తంబు దేరి రాఘవుఁడు ఘోరంబుగా ధనుర్గుణము మ్రోయించి కనలెడుదీర్ఘనిర్ఘాతముల్ గురియు ననలాస్త్ర మరిఁబోసి యలవొప్ప నేసి యా రావణుని నాభియందున్న యమృత మారూఢశరవహ్ని కాహుతిసేసి మఱి నూటతొమ్మిదిమాఱులు ద్రుంచె దఱిగొని రావణుతలలు బాహువులు. నిరుపమాస్త్రంబున నృపకులాధిపుఁడు పరికింప మఱి నూటపదియ2330వమాఱు ఒక్కశిరంబును నొగిఁగరద్వయముఁ 2331దక్కంగఁదక్కిన తలలు బాహువులుఁ దెగనేసె; నేసినఁద్రిదశులు సెలఁగి; రగచరవరు లార్చి రందంద పేర్చి. తల లోలిఁదెగి రక్తధారలు ధాత్రి నొలుకఁగ దివి కుబ్బి యొప్పె రావణుఁడు లోక2332ముల్ గాల్చి యాలోలకీలములు పైకొని మండెడు ప్రళయాగ్ని పగిదిఁ. దనువున ఘనరక్తధారలు నిండ దనుజేశుతనువుపైఁదలయొప్పెఁజూడ నరుణాతపచ్ఛాయ లడరునస్తాద్రిఁ బరగెడు భానుబింబంబు చందమున. నప్పుడు రావణుండా విభీషణునిఁ దప్పక చూచి యుదగ్రుఁడై యలిగి: “యెవ్వరు నెఱుఁగని యిట్టి నా మర్మ మివ్వసుధేశున కెఱిఁగించె వీఁడు; వీనిఁద్రుంచెద.”నంచు విపులోగ్రశక్తి పూని వైచుటయు నభోవీథినుండి యఱిముఱి నిగుడి కాలాగ్ని చందమున నెఱమంట లెగయుచు నేతెంచుచుండ నా రామవల్లభుండచలుఁడై ఘోర నారాచముల దాని నడుమనే త్రుంచె. జడిగొని రఘురాముశరవృష్టి పర్వి యుడుగకుండుటయు నం దుండరాకున్న వలనేది రాక్షసేశ్వరుకోపవహ్ని పొలుపఱఁబెడఁబాసి పోవు చందమునఁ బోయె రావణుదేహమున నున్న తేజ మా యవసరమున నద్భుతంబగుచుఁ. దలలుఁజేతులుఁద్రెవ్విదశకంఠుఁడొక్క తలయుఁజేదో2333యియై దర్పించి యపుడు వీరరసంపుఁబెన్వెల్లి చందమునఁ దోరమై తొరుగునెత్తుటఁ దొప్పఁదోఁగి తడఁబడ నెత్తుటఁదడిసి రణోర్విఁ బడియున్న తలలును బాహుదండములు వానిఁజంచులఁ జించువరపక్షి గణముఁ బూని యొక్కటఁ జూచి భూనాథుఁజూచి 2334జఱి2335గొని తనదైనసటలెల్లఁ బెఱుకఁ 2336జెఱ విడివడి మ్రోయుసింగంబుభంగి నేపారుతనకోఱలెల్లను బెఱుకఁ గోపించి పైఁబడు ఘోరాహికరణి మీసంబు లూఁచిన మిగులఁగోపించి శాసింపఁగడఁగినజముని చందమున మెఱసి లోకములెల్ల మ్రింగెడురీతి నుఱక కోపించి మహోగ్రుఁడై 2337తొంటి యన్నిచేతులఁగల యా సత్త్వమెల్ల నున్న చేతులరెంట నుగ్రమై తోప నా సురవరుఁడట్టహాసంబు సేసి ప్రాస తోమర శూల పరశు ఖడ్గముల శరముల సురియల శక్తుల గదల నురువడి నేసియు నుఱక వైచియును బొడిచియు నడిచియుఁ బోనీక రాము నుడుగక నొప్పించి యుగ్రుఁడై యేచి దేవతల్ భయమందఁదెగి మహారణము గావించుచుండె నక్కజమైన కడిమిఁ. గడఁకయు లావును గర్వంబు మిగుల నడరి ధీరతఁ బోరు నమరారిఁజూచి మాతలి భీతుఁడై మఱి రాము2338ననియె: “నీ తడవేటికి నినకులాధీశ![వా.రా. సర్గ 111] తలలు బాహువులు నిద్దనుజాధిపతికి మొలచునో? క్రమ్మఱ మొలవకమున్నె యెడవక బ్రహ్మాస్త్ర మేసి యీ నీచుఁ బడవైతుగాక దోర్బలశక్తి మెఱసి.” |