| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
శంకింప వలదు; విచారంబు సేసి యింక మీ నిశ్చయ మిట్టిదయేని యిక్కడ సొద వేర్చుఁ; డిందఱుఁజూడ స్రుక్కక యనలంబుఁజొచ్చెదఁ;జొచ్చి పావకుముఖమునఁ2427బతి కింకఁబరమ పావనురాలనై బ్రహ్మాదిసురల మెచ్చించి మిమ్మెల్ల మెచ్చించి భూమిఁ జొచ్చెద.”ననవుడు స్రుక్కి లక్ష్మణుఁడు రామునిఁగనుఁగొని రాము కన్నెఱిఁగి భూమిజ కప్పుడద్భుతముగాఁదెచ్చి సొద వేర్చుటయు మహీసుత సీత ప్రీతి సొద సూచి ప్రణమిల్లి సొదచుట్టుఁదిరిగి యభినుతు లొనరించి యగ్ని దేవునకు నభిముఖియై నిల్చి హస్తముల్ మొగిచి: “ధర్మదేవతలార! ధర్మంబులార! నిర్మల2428మతులార! నియతాత్ములార! జగ2429దధిపతులార! చంద్రార్కులార! నిగమసాధకులార! నిగమంబులార! సంచితోన్నతులార! సర్వజ్ఞులార! పంచభూతములార! పరహితులార! నరవరులార! కిన్నరవరులార! సురవరులార! భూసురవరులార! కరుణాఢ్యులార! దిక్పతులార! విమత హరులార! పాపసంహరులార! యేను ఘనమనోవాక్కాయకర్మంబులందుఁ బనిగొన రామభూభర్తకుఁదప్పఁ; దప్పిన నీ యగ్ని ధరియింప లేక యిప్పుడ నీఱౌదు నిందఱుఁజూడ.” నని యొప్పఁబల్కుచు నమ్మహీపుత్త్రి తన చిత్తమున నున్న తాత్పర్యమొప్పఁ గనుఁగొని బ్రహ్మాండకటకంబు2430నిండి యనుపమాకారంబులై పేర్చిపేర్చి యొండొంట శిఖల మహోదగ్రమగుచు మండెడునగ్నిలో మానిని సొచ్చె. నావంతయును గంద2431దా పూవుఁబోఁడి పావకసరసిలోఁబదిలమై నిలిచి. కరచరణాననకమలంబు లొప్ప వర కుచద్వయచక్రవాకంబు లొప్ప నవబాహువల్లీ మృణాళంబు లొప్పఁ బ్రవిమలత్రివళీతరంగంబు లొప్ప మహితలోలన్నేత్రమత్స్యంబు లొప్ప సహజ2432నీలాలక శైవాల మొప్పఁ గమలిని తెఱఁగునఁ గరమొప్పుచున్న కమలాక్షిఁగనుఁగొని కపులు రాక్షసులు శోకింపఁదొడఁగిరి; సురసిద్ధసాధ్య లోకంబు లెల్ల నా2433శ్లోకింపఁదొడఁగె. నా మరుత్తనయుండు నర్కనందనుఁడు సౌమిత్రియును విభీషణుఁడంగదుండుఁ దరుచరయూధముల్ దానవాధిపులు సరమాదులైన రాక్షసవధూజనులు నధికశోకంబున నడలుచు నుండి; రధిపతి నిర్విణ్ణుఁడై యుండె. నంత హరుఁడు వాగ్వరుఁడును నఖిలదిక్పతులు గరుడగంధర్వులు ఖచరవల్లభులు[వా.రా. సర్గ 120] వరవిమానస్థులై వచ్చి యందఱును బరగఁబ్రత్యుత్థానపరుఁడైన రాము వీక్షించి:“వేదాంతవేద్యుండ వఖిల సాక్షివి కర్తవు సంవిదాకృతివి నిర్వాణపరుఁడవు నిత్యపూర్ణుడవు సర్వసంవేదివి జగదేకనిధివి అక్షీణపుణ్యుండ వవ్యక్తపరుఁడ వక్షరత్రయమూర్తి వాద్యంతపతివి; భువనంబు లబ్ధులు భూతముల్ నదులు సవనంబు లద్రులు జంతుసంతతులుఁ దరువులుఁదెరువులుఁదంత్రముల్‌విధులు సురలు నక్షత్రముల్ శ్రుతులుశాస్త్రములుఁ గనుఁగొన వేలు లక్షలుఁగోట్లు గణన ననుపమశతకోటు లరసి యెవ్వరును గడ గాన రొక్కొక్క కమలజాండమునఁ బడి.2434యట్టిబ్రహ్మాండపంక్తులు గలసి నీ కుక్షి నుండు; వానికి లెక్క లేదు; నీ కడఁగానంగ నేర్తురే యొరులు? భవదీయమాయాప్రభావంబు దెలియ భవదీయులకుఁగాక పరులకు వశమె? యొకనిఁజంపితి; గెల్చి; తొకఁడునిన్ గెలిచె; నొకఁడు సాధ్యుఁడు; నీకునొకఁడెక్కు;డనుచు స్తుతినింద లవి నిన్ను సోఁక వెన్నఁడును 2435నతిమహత్త్వోన్నతు లట్టివి నీకు; దాసభావంబునఁ దక్క నొండొకట నీ సంవిదాకృతి2436నిత్యదుర్ఘటము. నరనాథ! నీ వాదినారాయణుండ; వరయ నా జానకి యయ్యాదిలక్ష్మి. లోకైక రక్షణలోలత నీవు కాకుత్స్థుఁడనఁగఁ బ్రఖ్యాతుండ వైతి. నిన్నేలమఱచితి? నిష్ఠురవహ్ని నున్న జానకిఁజూచుచుండుట దగదు. పిలిపించి గైకొమ్ము; ప్రీతి మన్నింపు; వలవ దు2437పేక్షింప వనజాక్షి నింక.”[వా.రా. సర్గ 121] నని పెక్కుభంగుల నఖిలదేవతలుఁ గనుఁగొని పలుకుచోఁగడఁగి పావకుఁడు: |