| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | రావణుఁడు మేరుగిరింజేరి విడియుట |
| సీ. | వీచోపుగుమి వీచువిధమున నునువెల్ల - జల్లుల మెకములు చఱులఁదిరుగఁ బావడ లిడునట్లు పతుల చెమ్మటఁ బయ్యె - దల మాన్చు సతులు నెత్తముల మెలఁగ దీపికావళి మించు తెఱుఁగున జ్యోతిర్ల - తావితానము లుపత్యకల వెలుఁగఁ జూపఁ జెంగట నిల్పు సొబగున హరులును - గరులును బాదాంతికముల నొలయ | |
| గీ. | భవ్యమందాకినీక్షౌమపటముఁ గట్టి గైరికద్యుతికుంకుమ గంధ మలఁది వేడ్క గంధర్వగానముల్ వించు మించు కాంచనావనిభృన్మౌళిఁ గాంచె నతఁడు | 32 |
| తే.గీ. | కాంచి రజతాద్రిఁ బెఱకినకరణిఁ దన్నుఁ బెఱుక వలదని గిరి కాన్కఁబెట్టి నీకుఁ దటచరత్కుంభికరపతద్రత్నపాళిఁ గొను మనుచు మంత్రి యన నవ్వికొనుచు నచట | 33 |
| శా. | ఆనాఁడెల్ల వసించి తద్గిరి వినోదారామ లీలా విలో కానందామృతవార్ధి మగ్నుఁడయి దైత్యస్వామి కల్యంబునన్ స్నానాదిక్రియ లాచరించి, మణిచంచత్పుష్పకం బెక్కి ఛా యానీరేజదళేక్షణాధిపజిగీషాయత్తుఁడై యయ్యెడన్ | 34 |