ఇతిహాసములు ఉత్తరరామాయణము దేవయక్షాదుల కాంతలు రావణుని శపించుట
దేవయక్షాదుల కాంతలు రావణుని శపించుట
ఉ.ఏము పతివ్రతాత్వము వహించినవారలమేని నిన్నినా
ళ్ళేమి కొఱంతలేక చరియించితిమేని మదీయమానముల్‌
గామవశాత్ముఁడై చెఱుపగాఁ బనిఁబూనిన యీ దశాస్యుఁడున్‌
గామిని వంకనే యడఁగుఁగాక సుతానుజబంధుకోటితోన్‌
95
వ.అని శపించి, అంత నిలువక96
సీ.మనవారి వీఁడు ద్రుంచిన చందమున వీని - వారి వైరులు వట్టి చీఱవలదె?
యనదలమై చిక్కి మనము గుందెడులీల - వీని యాండ్రును బలవింపవలదె?
మనవంటి సకుల బల్మినిబట్టి యీడ్చె ని - త్తులువ హస్తము లెల్లఁ దునియవలదె?
వనితలు సుట్టు నేడ్వఁగ నవ్వుచున్నాఁడు - వీనితలల్‌ గొట్టివేయవలదె?
 
గీ.యనుచుఁ బ్రాణేచ్ఛ లుడిగి యయ్యలరుఁబోండ్లు
తన్నుఁ దిట్టుచు బిట్టు రోదనము సేయ
నాలకించుచు నిస్తేజుఁ డయ్యు నెగ్గు
సిగ్గు లెంచక తన ప్రోలు సేరె నతఁడు
97
వ.ఇవ్విధంబున98
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju