| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | రావణుఁడు మధుసహితుండై యింద్రునిమీఁదికి యుద్ధమునకు వెడలుట |
| మ. | వెడలెన్ వాజిఖురాగ్ర ఘట్టనల నుర్విందాల్చు శేషాహియున్ బడగల్ వంపఁ జమూసమూహ రజః పారంపరిన్ వేల్పుటే ఱడుసుం జెంద భటార్భటీ పటహ శంఖాభీల ఘోషంబులన్ జడధిధ్వాన మడంగ స్వఃపుర జిగీషాబద్ధ చేతస్కుఁడై | 144 |
| వ. | ఇవ్వడుపున వెడలి యక్కడింది రక్కసి రిక్కలఱేఁడు త్రొక్కుడు లేనినిడుద పయనంబులన్ జని జని | 145 |