ఇతిహాసములు ఉత్తరరామాయణము రావణుని యుద్ధ ప్రయాణ వర్ణనము
రావణుని యుద్ధ ప్రయాణ వర్ణనము
సీ.పూరియుఁగట్టియల్‌ నీరును గల పథం - బున సేన నడపించు భూరిశక్తి
పాళెంబు డించుచోఁ బయనంబు సేయుచో - నెందులఁగ్రందుగానీని నేర్పు
పనికిరాఁగల వీరభటులకు నాడాడ - బహుమానము లొనర్చు ప్రాభవంబు
వలసిన వస్తు లవ్వారిగా శిబిరంబు - నందుఁగల్గించు మహావిభూతి
 
గీ.యడవు లేఱులు పల్లంబు లనక నుద్ద
విడి రథాదులతోఁ జొచ్చు విపులధాటి
దనకె చెల్లు ననంగ నద్దశముఖుండు
వెండిమలదండ కపుడేఁగి దండువిడిసె
146
కం.ఈ లీల వెండిమలకడఁ
బాళెము డిగి వేల ముడిగి పరిసర వరకం
కేళీవనపాళీఘన
కేళీవనదర్శనేచ్ఛ గిఱికొన మెలఁగెన్‌
147
ఉ.వాసవు మీఁదఁ బోవు దశవక్త్రుఁడు గెల్పు వహింప విక్రమో
ల్లాసిపలాశిసంగతిఁ జెలంగు లతాంగన లింపొసంగు భృం
గీ సముదారగానములఁ గ్రేవలఁదెమ్మెర రాల్చు క్రొవ్విరుల్‌
సేసలు వెట్టి రొక్కమొగి శ్రీకరపల్లవరాగముల్‌ దగన్‌
148
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju