| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | అంధకార విజృంభణానువర్ణనము |
| చం. | అలసి పతంగదేవుఁడపరాంబుధి వ్రాలిన వేడ్కతో రసా తలమున నుండియున్ వెడలి దారుణకాలభుజంగ సంఘముల్ గలయఁగ నెల్లదిక్కులను గ్రమ్మెనొ శత్రుఁడనంగ రాహు వ గ్గలికఁ దమోగతిన్ జగముఁగైకొనెనో యన మించెఁ జీఁకటుల్ | 154 |
| తే.గీ. | ఉప్పరము పేర నొప్పెడు కప్పుడనఁటి నుప్పతిలి, చుట్టు రాలిన కప్పురంపుఁ గుప్పలో యన మందార కోరకాభ తారకావళు లంబరస్థలిని నెరసె | 155 |
| సీ. | రతి చన్నుమిట్టల రాణించు కస్తూరి - కాపంకమునఁ దిలకంబుదిద్ది కేళినీభ్రూయుగశ్రీలఁబోలెడు నల్ల - చెఱకు సింగిణివిల్లు చేధరించి మోహంపురాణి క్రొమ్ముడి యెమ్మె కెనయైన - బలునారి పలుమాఱుఁబట్టి దీటి లచ్చికోడలి కన్నులకు దీటువచ్చు నీ - లోత్పలశరపంక్తు లొనరఁదాల్చి | |
| గీ. | లలితకలకంఠ కోలాహలంబు లెసఁగఁ దళముకొని రెండు గెడలఁ గాదంబకోటి గొల్వ రాచిల్క సాంబ్రాణి గుఱ్ఱమెక్కి దర్పకుఁడు పాంధజనులపై దండు వెడలె | 156 |
| ఉ. | కోరిన మంచి తేనియలు గ్రోలఁగ నిచ్చి సుగంధసంపదల్ చూఱలుగొన్న నోరిచి రజోగుణయుక్తి దళంబు లొందఁగాఁ జేరిక సేయు పద్మినుల శ్రీదొలఁగన్ గుముదిన్యుపాంతముల్ సేరి మదాళు లాశ్రయివిశేష మెఱుంగుదురే మలీమసుల్ | 157 |
| మ. | తొలియిక్కల్ పరికించుఁ గన్గొలకులందున్ నీరు నించుం జలిం చు లసత్పంకజకోరకాగ్రముల నస్తోకార్తిఁ బ్రాపించు ఱె క్కలు ముక్కుల్ దుదనప్పళించు సరసిం గాన్పించునాత్మాంగమే తిలకించుం బతియంచుఁ గోకి యొక టెంతేఁ గంతుసంతప్తయై | 158 |