| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | చంద్రోదయాభివర్ణనము |
| కం. | కలువలకు మేలు దెలుపఁగ నలయు చకోరికల వనట లడఁపఁగఁ దొలుతన్ నెల పనిచిన నెచ్చెలి యనఁ దొలిదిక్కున ధవళకాంతి దోరం బయ్యెన్ | 159 |
| సీ. | యామినీప్రాణనాయకు రాక విని వాని - యడుగుల కిడినట్టి మడుఁ గనంగఁ శ్రీసహోదరుని గర్భీకరించిన పూర్వ - దిక్కాంత నెమ్మోము తెలుప నంగఁ దొలినెలతాల్పు రేదొర విడియింప ని - ర్మించిన మగఱాల మేడ యనగఁ గొడుకు రాఁగలఁ డంచుఁ గడుఁ బొంగు వాహినీ - వరుని యూర్ముల మించు నురుఁ గనంగఁ | |
| గీ. | దూర్పుదిక్కునఁ బాండిమ దోఁచె నంత తోనఁ దోడ్తోడ సమయాభిధానమౌని విష్ణుపదము నివాళింప వేడ్కనెత్తు కప్పురపు దివ్వె యన సుధాకరుఁడు వొడమె | 160 |
| భుజంగప్రయాతము | క్రమించెన్ బ్రగాఢాంధకారంబు పెల్లా క్రమించెన్ దివిన్ జంద్రికల్ దారకాభల్ శమించెన్ భ్రమించెన్ వెసన్ గోకి పేరా శ మించెన్ జకోరద్విజశ్రేణి యాత్మన్ | 161 |