| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | షష్ఠస్కంధము |
| క. |
శ్రీపతికి మత్పతికి నుత, గోపతికిఁ ద్రిలోకపతికి గురుజనబుధ సం తాపనివారణమతికినిఁ, బ్రాపితసనకాదితతికి బహుతరధృతికిన్. |
32 |
| క. |
హరికి గురుకలుషకుంజర, హరికి బలాభీలహరికి నంతస్స్థిత గ హ్వరికి నరహరికి రక్షితకరికిఁ గరాగ్రస్థగిరికి ఘనతరకిరికిన్. |
33 |
| క. |
గుణికి సమాశ్రితచింతామణికి మహేంద్రాదిదివిజమండలచూడా మణికిఁ బ్రకల్పితశయ్యాఫణికి నురోభాగకౌస్తుభప్రియమణికిన్. |
34 |
| క. |
కంసాసురసంహారున కంసాంచితకర్ణకుండలాభరణునకున్ హింసాపరపరమస్తకమాంసకరాళితగదాభిమతహస్తునకున్. |
35 |
| క. |
వరయోగిమానసాంతఃకరణసుధాంభోధిభావకల్లోలలస త్పరతత్త్వశేషశాయికిఁ జిరదాయికి సకలభక్తచింతామణికిన్. |
36 |