| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| సీ. |
అవనీశ! విను ద్రోణుఁ డనువాఁడు వసువులయందు ముఖ్యుఁడు, ధర యతనిభార్య, వారి నిద్దఱ బ్రహ్మ ‘వసుధపై జన్మింపుఁ’ డంచుఁ బంచిన వార లతనిఁ జూచి ‘విశ్వేశ్వరుండైన విష్ణుసేవారతి మా కిచ్చితేనిని మహి జనింతు’ మనవుడు ‘నట్ల కా’ కనియె వేల్పులపెద్ద యా ద్రోణుఁ డీనందుఁడై జనించె |
|
| ఆ. |
ధర యశోద యయ్యె, దనుజేంద్రవైరియుఁ, గమలగర్భుమాట గారవించి తల్లిదండ్రు లనుచుఁ దగ వారి మన్నించె, నధికభక్తితోడ నలరి రిట్లు. |
353 |
| వ. | అంత నొక్కనాఁడు దనయింటికడ పాపలందఱు నయ్యై పసులవెంటఁ బంపువడి పోయిన నందసుందరి సంరంభంబునం దరికంబంబుకడఁ గుదురున నొక్కదధికుంభంబు వెట్టి మిసిమి గల మీఁగడఁ బెరుఁగు గూడఁబోసి వీఁక నాఁకత్రాడు కవ్వంబున నలవరించి. | 354 |