| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| మ. |
‘అదె వచ్చెన్ దవవహ్ని ధూమకణకీలాభీలదుర్వారమై యిదె కప్పెన్ మము నెల్లవారి నిట మీఁ దేలాగు రక్షింపు నీ పదపద్మంబుల కాని యొం డెఱుఁగ, మో పద్మాక్ష!, యో కృష్ణ! మ్రొ క్కెద మో రామ! మహాపరాక్రమ! దవాగ్నిన్ వేగ వారింపవే! |
713 |
| క. |
నీ పాదంబులు నమ్మిన, నాపద లెక్కడివి? జనుల కత్యుగ్ర మహా దీపితదావజ్వలనము, పైపడ కుండెడివిధంబు భావింపఁ గదే.’ |
714 |
| వ. | అని ఘోషించు ఘోషజనులం గరుణించి జగదీశ్వరుండగు ననంతుం డన శక్తియుతుండై గహనంబు నిండిన దావదహనంబు పానంబు సేసిన, విజయగానంబు దశదిశల నిగిడె, నంతం గృష్ణుండు గోగణజ్ఞాతి సహితుండై మందయానంబున మందకుఁ జనియె, నిట్లు రామకేశవులు గోపాలబాలవేషంబులం గ్రీడించు సమయంబున. | 715 |