శ్రీరస్తు
శ్రీమహాభాగవతము - దశమస్కంధము - ఉత్తరభాగము
ఉపోద్ఘాతము
| క. |
శ్రీకర! పరిశోషిత ర, త్నాకర! కమనీయగుణగణాకర! కారు
ణ్యాకర! భీకరశర ధా, రా కంపితదానవేంద్ర! రామనరేంద్రా!
|
1 |
| వ. |
మహనీయ గుణగరిష్ఠులగు న మ్మునిశ్రేష్ఠులకు నిఖిలపురాణవ్యాఖ్యానవైఖరీసమేతుండైన సూతుం డిట్లనియె, నట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రుండు రుక్మిణీపరిణయానంతరంబున నైన కథావృత్తాంతం బంతయు వినిపింపు మనిన శుకయోగీంద్రుం డిట్లనియె.
|
2 |
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - daSama skaMdhamu - uttara bhAgamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )