| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ఏకాదశస్కంధము |
| క. |
సుర గరుడ ఖచర విద్యా, ధర హర పరమేష్ఠిముఖ సుధాశనులు మునుల్ సరసిజనయనునిఁ గనుఁగొన, నరుదెంచిరి ద్వారవతికి నతిమోదమునన్. |
83 |
| క. |
కని పరమేశుని యాదవ, వనశోభితపారిజాతు వనరుహనేత్రున్ జనకామితఫలదాయకు, వినుతించిరి దివిజు లపుడు వేదోక్తములన్. |
84 |
| తే. |
అఖిలలోకేశ! సర్వేశ! యభవ! నీవు, నుదయ మందుట భూభార ముడుపుకొఱకుఁ బంచవింశోత్తరశతాబ్దపరిమితంబు, నయ్యె విచ్చేయు వైకుంఠ హర్మ్యమునకు. |
85 |
| వ. | అనినఁ గమలభవ భవ ముఖ నిఖిల సురగణంబుల వచనంబు లియ్యకొని కృష్ణుండు వారితోడ ‘యాదవుల కన్యోన్యవైరానుబంధంబులు గల్పించి వారల హతంబు గావించి భూభారం బడంచి యిదె వచ్చెదం బొం’ డని చెప్పి వీడ్కొలిపినఁ గమలాసనాది బృందారకులు నిజస్థానంబులకుం జని రంత. | 86 |